S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/01/2018 - 13:36

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధానిలో శనివారం లీటర్ పెట్రోల్‌ ధర 16 పైసలు పెరిగి రూ. 78.68గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ. 70.42గా ఉంది. లీటర్ పెట్రోల్‌ ధర ముంబయిలో రూ. 86.09, కోల్‌కతాలో రూ. 81.60, చెన్నైలోని 81.72గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర ముంబయిలో రూ. 74.76, కోల్‌కతాలో రూ. 73.27, చెన్నైలో రూ. 74.39గా ఉంది.

09/01/2018 - 12:41

న్యూఢిల్లీ: ప్రముఖ జైన మత సన్యాసి తరుణ్‌సాగర్ శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. కామెర్ల వ్యాధితో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు సంతాపం తెలిపారు. జైన మతంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందిన తరుణ్‌సాగర్ సమాజాభివృద్ధికి చేసిన సేవలు దేశం మరిచిపోదని అన్నారు.

09/01/2018 - 06:32

న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ గరిష్ట స్థాయిలో దారుణంగా పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలే కారణమని పేర్కొంది. డాలర్ విలువతో పోల్చితే రూపాయి మారకం రూ.71కు చేరుకుందని, దీని వల్ల ఆర్థిక రంగం అతలాకుతలమైందన్నారు.

09/01/2018 - 06:22

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకవేళ హడావుడిగా రాష్ట్ర శాసన సభను రద్దు చేసినా, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అంచనా వేశారు. బలవంతంగా ఎన్నికలను జరిపేందుకు ప్రయత్నిస్తే తాము కోర్టుకు వెళ్లి ఆపుతామని స్పష్టం చేశారు.

09/01/2018 - 06:20

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. వికృతమైన పన్నులు వడ్డిస్తూ లెవీ పేరుతో 11 లక్షల కోట్ల రూపాయలను లూటీ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. నింగినంటిన నిత్యావసరాల ధరలతో దేశంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు.

09/01/2018 - 06:19

తిరువనంతపురం, ఆగస్టు 31: వరదలు, భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలో పునర్మిర్మాణం పనులను వేగవంతంగా చేపట్టాలని, దీని కోసం నిధులను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా డ్యాంల గేట్లను ఇష్టం వచ్చినట్లు ఎత్తడం వల్ల వరద నీటి ఉధృతికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఈ అంశంపై న్యాయవిచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

09/01/2018 - 06:18

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలకు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేస్తూ ఏర్పాటుచేసే నిబంధన శనివారం నుంచి అమలు జరగాల్సివుంది. కార్లకు మూడు సంవత్సరాలు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల కాలవ్యవధితో ఈ బీమా పథకం అమలు జరగాల్సివుంది. ఐతే ఈ నిబంధన అమలుకు మరికొంత గడువు పొడిగించాలంటూ వచ్చిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది.

09/01/2018 - 06:02

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కుటుంబ జీవనానికి మహిళల విశిష్టపాత్రను గుర్తించాలని, వారు ఆర్థిక పరమైన తోడ్పాటు అందించలేకపోయినా, ఒక వేళ విడాకులు పొందే పరిస్థితి ఎదురైన పక్షంలో మహిళలకు ఆస్తిలో సమానమైన వాటాను ఇవ్వాలనే అభిప్రాయాన్ని లా కమిషన్ సూచించింది. దీనికి అనుగుణంగా అన్ని రకాల పర్సనల్ చట్టాలు, సెక్యులర్ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని లా ప్యానెల్ పేర్కొంది.

09/01/2018 - 05:59

న్యూఢిల్లీ, ఆగస్టు 31: బహిరంగ ప్రకటనల విడుదలలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కేంద్రం, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టి శుక్రవారం ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

09/01/2018 - 02:19

ముంబయి, ఆగస్టు 31: ఇటీవల అరెస్టయిన వామపక్ష తీవ్రవాద సానుభూతిపరులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ముంబయి పోలీసులు శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. మోదీ రాజ్‌ను అంతం చేయడానికి రాజీవ్ గాంధీ తరహాలో విపత్తును సృష్టించాలన్న ప్రస్తావన కూడా వీరి మధ్య సాగిన సంభాషణల్లో చోటు చేసుకుందని వారు చెప్పారు.

Pages