S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/20/2018 - 05:45

న్యూఢిల్లీ, జూలై 19: వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల అనువాదం కచ్చితంగా, సరిగా ఉందా లేదా అనే అంశంపై రాష్ట్రప్రభుత్వాల నుంచి అఫిడవిట్‌లను స్వీకరించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. నీట్ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోందన్నారు. గురువారం రాజ్యసభలో ఎఐఎండిఎంకె సభ్యుడు విజిలా సత్యనాథ్ జీరో అవర్‌లో అడిగిన ప్రశ్నకు మంత్రి జవడేకర్ పై విధంగా బదులిచ్చారు.

07/20/2018 - 05:43

న్యూఢిల్లీ, జూలై 19: ప్రజలకు కనీస మంచినీటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, మంచీనీరు ఒక ప్రాథమిక హక్కు అని సినీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. దేశంలో ప్రజలు మంచినీటి కోసం అలమటిస్తున్నారన్నారు. గురువారం జీరో అవర్‌లో ఆమె మాట్లాడుతూ, కేప్‌టౌన్ అనే నగరంలో ఎడాపెడా నిర్మాణాలను అనుమతించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. భారత్‌లో కేప్‌టౌన్ పరిస్థితులు తలెత్తరాదన్నారు.

07/20/2018 - 05:38

న్యూఢిల్లీ, జూలై 19: పాస్‌పోర్టుల మంజూరులో భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. కొత్త మొబైల్ యాప్ ద్వారా పాస్‌పోర్టు దరఖాస్తుల ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేవన్నారు.

07/20/2018 - 05:37

న్యూఢిల్లీ, జూలై 19: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసిన తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిపూర్ణానందపై విధించిన నగర బహిష్కార నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్వామికి జరిగిన నష్టాన్ని వివరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.

07/20/2018 - 02:23

న్యూఢిల్లీ, జూలై 19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తని వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం పార్లమెంట్ అవరణలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటూ ఫోర్త్ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాలానికి తగ్గట్లుగా బాబు రంగులు మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు.

07/20/2018 - 02:20

న్యూఢిల్లీ, జూలై 19: దేశంలో సుమారు వంద కోట్ల మంది ఎంతో పవిత్రంగా భావించే గంగా నది ప్రమాదంలో పడింది. కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నది. గంగా నది ప్రక్షాళనకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు.

07/20/2018 - 05:07

మంగళూరు, జూలై 19: కర్నాటకలోని ఉడిపి షిరూర్ మఠ్ శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ గురువారం నాడు మణిపాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపై వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విష పదార్థాల వల్ల ఆరోగ్యం త్వరగా క్షీణించిందని, స్వామీజీ ప్రాణాలు కాపాడేందుకు తాము ఎంత ప్రయత్నించామని వైద్యులు వెల్లడించారు. 54 ఏళ్ల స్వామీజీ రక్తంతో కూడిన వాంతులు చేసుకుంటూ శ్వాస తీసుకోవడానికి బాధపడ్డారు.

07/20/2018 - 02:16

న్యూఢిల్లీ, జూలై 19: కేరళలోని శబరిమలై ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు 41 రోజుల దీక్ష నిబంధన పాటించారా లేదా అన్నది పరిశీలించడం అసాధ్యమని, ఈ కారణంతో 10 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యన ఉన్న ఆడవారికి ఆలయ ప్రవేశం నిషేధించడం సబబు కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.

07/19/2018 - 17:27

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15న జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలో దాడిచేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎర్రకోట వద్ద భద్రతా బలగాలు నిఘా పెట్టాయి.

07/19/2018 - 17:21

న్యూఢిల్లీ: టీటీడీపై నెలకొన్న వివాదాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు ఏంపీ సుబ్రమణ్యం స్వామి నిర్ణయించారు. టీటీడీపై కొంత కాలంగా వస్తున్న ఆరోపణలు, శ్రీవారి నగల వ్యవహారం గురించి సుబ్రమణ్య స్వామి ప్రధానంగా పిటిషన్‌లో పేర్కొననున్నారు. రమణ దీక్షితులు ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.

Pages