S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/21/2018 - 04:58

న్యూఢిల్లీ, జూలై 20: ప్రధాని నరేంద్ర మోదీని కౌగలించుకొని, ఆతర్వాత కన్నుగీటి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందరినీ విస్మయానికి గురిచేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న ఆయన ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసిన రాహుల్ ఆ వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బలవంతంగా కౌగిలించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

07/21/2018 - 01:45

న్యూఢిల్లీ, జూలై 20: ఎంతో మంది విద్యార్థులు, యువకులు, ప్రజల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని లోక్‌సభలో టీఆర్‌ఎస్ సభాపక్షం నాయకుడు జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా, అశాస్ర్తియంగా జరిగిందని, లోక్‌సభ తలుపులు మూసి, విభజన ప్రక్రియను పూర్తి చేశారని వ్యాఖ్యానించడం ద్వారా తెలుగుదేశం సభ్యులు పార్లమెంటును అవమానించారని జితేందర్ రెడ్డి విమర్శించారు.

07/21/2018 - 05:02

న్యూఢిల్లీ, జూలై 20: విభజన హామీలను కేంద్రం నెరవేర్చకుండా తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని టీఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో వినోద్ పలు అంశాలను ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం దుర్మార్గమని అన్నారు.

07/20/2018 - 22:30

న్యూఢిల్లీ, జూలై 20: దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మూక హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో సిక్కుల ఊచ కోత అతి పెద్ద మూక హింసగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను తిప్పిగొట్టారు.

07/20/2018 - 22:28

ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్), జూలై 20: దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో బాలుర కంటే బాలికలను ఉత్తమ ప్రదర్శనతో రాణిస్తున్నప్పటికీ, వారి సంఖ్య గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తున్నదని రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీ 64వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ 2017లో ఐఐటీ ప్రవేశ పరీక్షకు 1,60,000 మంది హాజరయ్యారని, అయితే, వారిలో బాలికలు 30,000 మంది మాత్రమేనని పేర్కొన్నారు.

07/20/2018 - 22:26

న్యూఢిల్లీ, జూలై 20: బ్రిక్స్ సమ్మిట్‌లో హాజరయ్యే నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం ర్వండా, ఉగండా, దక్షిణాఫ్రికా దేశాలను సందర్శించనున్నారు. అంతర్జాతీయ శాంతి, రక్షణ విషయాలను ఈ సమావేశంలో చర్చకు వస్తాయని భావిస్తున్నారు. ఈనెల 23 నుంచి 27 మధ్య ప్రధాని మూడు దేశాలలో పర్యటిస్తారు.

07/20/2018 - 22:22

న్యూఢిల్లీ, జూలై 20: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా శుక్రవారం జరిగిన చర్చలో మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకోవడం, తర్వాత తన స్థానంలోకి వెళ్లి కన్నుకొట్టడం తీవ్ర సంచలనం అయ్యిం ది. ఈ సంఘటనలపై సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పెద్దయెత్తున జోక్‌లు, వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు, వాఖ్యలు, ప్రశంసలు వెల్లువెత్తాయి.

07/20/2018 - 22:21

న్యూఢిల్లీ, జూలై 20: నిపుణులు, న్యాయకోవిదులతో చర్చించిన అనంతరం 366 ఆర్టికల్‌లోని ‘సంప్రదింపులు’ అనే పదం నిర్వచనంపై రాజ్యాంగ సవరణకు ప్రయత్నిస్తామని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పిపి చౌదరి తెలిపారు. 366 ఆర్టికల్‌లోని ‘సంప్రదింపులు’ అనే పదం నిర్వచనంపై రాజ్యాంగాన్ని సవరించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో టిఎంసి నేత సుఖేందు శేఖర్ రే ఇచ్చిన ప్రైవేట్ బిల్లుపై మంత్రి శుక్రవారం జరిగిన సమావేశంలో వివరణ ఇచ్చారు.

07/20/2018 - 22:19

న్యూఢిల్లీ, జూలై 20: అమెరికా, భారత్‌ల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ, వాణిజ్య అంశాలపై ఈ ఏడాది సెపెంబర్ 6వ తేదీన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, అమెరికా నుంచి విదేశాంగ కార్యదర్శి పాంపియో, రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ పాల్గొంటారు. ఈ సమావేశం వాస్తవానికి ఈ ఏడాది జూలై 6వ తేదీన జరగాల్సి ఉంది.

07/20/2018 - 17:46

న్యూఢిల్లీ: అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేస్తూ ప్రధాని మోదీ ప్రజలకు చేరువయ్యారని, అలాంటి నాయకుడికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కలిసి అవిశ్వాసం తీసుకువచ్చాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. 30 సంవత్సరాల తరువాత సంపూర్ణ మెజార్టీతో కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడిందని, అవిశ్వాసాన్ని ఎదుర్కోవటానికి తాము సిద్ధమయ్యామని అన్నారు.

Pages