S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/20/2018 - 17:45

న్యూఢిల్లీ: సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ ఆలింగనం చేసుకోవటం, కన్నుగొట్టడంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. రాహుల్ తనకు కొడుకులాంటివాడని, ఆయనపై ద్వేషం లేదని అన్నారు. అంతకు ముందు ఇదే విషయంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ సభలో విపక్షాలు చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించాయని అన్నారు.

07/20/2018 - 16:18

న్యూఢిల్లీ: విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందమైన రాజధాని కట్టుకోవాలనే ఆసక్తి ఉన్నపుడు హైకోర్టు బిల్డింగ్ ఎందుకు నిర్మించటం లేదని అన్నారు. కృష్ణా,గోదావరి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందన విమర్శించారు.

07/20/2018 - 16:17

న్యూఢిల్లీ: లోకసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాఫెల్ ఒప్పందం దగ్గర నుంచి పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ పన్ను వరకు మోదీని టార్గెట్ చేస్తూ రాహుల్ ప్రసంగించారు. రాహుల్ తన ప్రసంగం చివరలో ‘‘మీరు నన్ను పప్పు అన్నా మిమ్మల్ని ద్వేషించను’’ అని తన ప్రసంగాన్ని ముగించారు.

07/20/2018 - 13:58

న్యూఢిల్లీ: ఏపీ ప్రజలు బాధితులుగా మిగిలారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్ సభలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మాత్రమే కాకుండా, దేశ ప్రజలందరినీ మోసం చేస్తోందని మండిపడ్డారు. నోట్ల రద్దుతో గాయం చేశారని గుజరాత్ లోని సూరత్ వ్యాపారులే చెప్పారని అన్నారు. ప్రధాని అయ్యాక జీఎస్టీని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.

07/20/2018 - 13:29

న్యూఢిల్లీ: విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తే ఇపుడు బీజేపీపైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిది అని బీజీపీ ఎంపీ రాకేశ్ సింగ్ ప్రశ్నించారు. మిమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్‌తో కలిసి వెళుతున్నారు. ఈ విషయం కుమారస్వామి ప్రమాణస్వీకారం రోజునే వెల్లడయిందని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సాన్నిహిత్యాన్ని లోకం చూస్తుందని విమర్శించారు.

07/20/2018 - 13:27

న్యూఢిల్లీ: సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగిస్తుండగా ఆయన ప్రసంగంపై టీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. తమకు ప్రసంగించేందుకు అనుమతినివ్వాలని, వ్యక్తిగత అజెండాతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మీకు సమయం ఇచ్చినపుడు మీ వాదనను వినిపించండని స్పీకర్ సూచించటంతో సభ్యులు వెనక్కి తగ్గారు.

07/20/2018 - 13:26

న్యూఢిల్లీ: ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. ఆయన లోకసభలో అవిశ్వాసంపై మాట్లాడుతూ..తలుపులు మూసి మరీ రాష్ట్రాన్ని విభజించిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు. ఇకనైనా కేంద్రం తమకు ఇచ్చిన హామీలపై నిలబడాలని కోరారు. విభజన పాపం కాంగ్రెస్‌దే కాదు బీజేపీది కూడా అని విమర్శించారు. విభజనతో 90 సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయని అన్నారు.

07/20/2018 - 12:01

న్యూఢిల్లీ: ఈ రోజు చాలా ముఖ్యమైందని, పార్లమెంటులో సభ్యులు నిర్మాణాత్మకమైన, అంతరాయం లేని చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారంనాడు ఓ ట్వీట్ చేస్తూ..యావత్ భారతదేశం మనల్ని నిశితంగా చూస్తుందని పోస్టు చేశారు.

07/20/2018 - 12:00

న్యూఢిల్లీ: సభ ప్రారంభంకాగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షనాయకుడు ఖర్గే తమకు సమయం సరిపోదని మాట్లాడుతుండగా.. తనకు మైక్ కావాలని తీసుకున్నారు. ఆపై ఆయన మాట్లాడుతూ తమకు కేంద్రం చాలా అన్యాయం చేసిందని, కేంద్ర వైఖరికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు.

07/20/2018 - 11:59

న్యూఢిల్లీ: లోకసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రకటించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించాల్సిందిగా స్పీకర్ సుమిత్రా మహాజన్ టీడీపీ ఎంపి గల్లా జయదేవ్‌ను కోరారు.

Pages