S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/18/2018 - 13:58

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో దాడులు పెరుగుతుంటే సహిస్తూ ఊరుకోలేమని మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ అన్నారు. ఆయన లోకసభలో మాట్లాడుతూ.. తిరువనంతపురంలో తన ఆఫీసుపై జరిగిన దాడిని, స్వామి అగ్నివేశ్‌పై జరిగిన దాడిని ఖండించారు. జాతీయ భావాన్ని దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని అన్నారు.

07/18/2018 - 13:21

న్యూఢిల్లీ: గ్రేటర్‌ నోయిడాలో మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనంపై పడింది. దాంతో ఈ రెండు భవనాలు కూలిపోయాయి. భవన శిథిలాల్లో 30 మంది వరకూ చిక్కుకోగా వారిలో ముగ్గురు మృతి చెందారు. మరో 50 మందికి గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు.

07/18/2018 - 12:33

చెన్నై: అనారోగ్య సమస్యలతో స్వల్ప శస్త్ర చికిత్స కోసం డీఎంకే అధినేత కరుణానిధి స్థానిక కావేరి ఆసుపత్రిలో చేరారు. కరుణానిధి గత కొంతకాలంగా గొంతు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారు.

07/18/2018 - 12:22

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలు అమలు చేయాలని కోరుతూ పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ ఎంపీలు ఆందోళన చేశారు. వీరితో పాటు లోకసభలో రాజీనామా చేసిన ఎంపీలు కూడా ఆందోళన చేయటంతో మార్షల్ వారిని నిబంధనలకు విరుద్ధంగా చేయవద్దని పంపివేసేందుకు ప్రయత్నించగా.. దీంతో సభ్యులు ప్లేకార్డులు వదిలేసి తమ సభ్యులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.

07/18/2018 - 12:21

న్యూఢిల్లీ: రాజ్యసభ మధ్యాహ్నాం 12 గంటలకు వాయిదా పడింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. సభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభా కార్యక్రమాలను ప్రారంభించేందుకు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రయత్నించగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై చర్చ జరగాలని టీడీపీ సభ్యుడు ఎంపీ రమేష్ పట్టుబట్టారు.

07/18/2018 - 12:20

న్యూఢిల్లీ: లోకసభలో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని టీడీపీ ఎంపీలు పట్టుపట్టగా స్పీకర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తరువాతే విపక్షాలు లేవనెత్తిన అంశాలు చర్చకు అనుమతి ఇస్తామని స్పీకర్ తేల్చిచెప్పారు.

07/18/2018 - 12:30

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18 పనిదినాలలో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ..సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశాల్లో 46 బిల్లులను చర్చించి ఆమోదించుకోవాలని అధికారపక్షం నిర్ణయించింది.

07/18/2018 - 02:26

న్యూఢిల్లీ, జూలై 17: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు పార్టీ విధాన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. గత మార్చినెలలో ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసే అధికారాన్ని రాహుల్ గాంధీకి అప్పగించారు.

07/18/2018 - 02:25

బెంగళూరు, జూలై 17: ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలతో జెడి(ఎస్), కాంగ్రెస్ మధ్య సంబంధాలు చెడిపోయాయని మీడియాలో వస్తున్న వార్తలను కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఖండించారు. అవి తాను కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసినవి కావని ఆయన వివరణ ఇచ్చారు.

07/18/2018 - 02:24

న్యూఢిల్లీ, జూలై 17: కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న బీజేపీ, ఇతరుల విమర్శలపై ఆ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ ఎట్టకేలకు వౌనం వీడారు. ‘లైన్‌లో నిల్చున్న చివరి వ్యక్తికి సైతం కాంగ్రెస్ అండగా నిలుస్తుంది. వారిలోని భయాలను తుడిచివేస్తుంది. వారి కులం ఏమిటి, మతం ఏమిటి, వారి విశ్వాసాలు ఏమిటి అన్నది నాకు చాలా చిన్న విషయం’ అని ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

Pages