S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/19/2018 - 12:49

దంతెవాడ: చత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, నక్సల్స్‌కు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతిచెందారు. నక్సల్స్ స్థావరాల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

07/19/2018 - 12:48

రిషికేశ్: ఉత్తరాఖండ్‌లోని సూర్యదర ప్రాంతంలో రిషికేశ్- గంగోత్రి హైవేపై ఆ రాష్ట్ర రోడ్డు రవాణాకు చెందిన ఆర్టీసీ బస్సు లోయలోపడి పది మంది చనిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్లను ఏర్పాటుచేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ.50 వేలు నష్టపరిహారం అందించనున్నారు.

07/19/2018 - 06:31

న్యూఢిల్లీ, జూలై 18: సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌ను తమ ప్రభుత్వం నియంత్రించదని, తమ ప్రభుత్వం ప్రజల వాక్‌స్వాతంత్య్రం, భావస్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించదని, వాటి పరిరక్షణకు కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి కేంద్ర సహాయమంత్రి ఎస్‌ఎస్ అహ్లూవాలియా పార్లమెంట్‌లో స్పష్టం చేశారు.

07/19/2018 - 05:12

సిమ్లా/న్యూఢిల్లీ, జూలై 18: మిగ్-21 యుద్ధ విమానం కూలి పైలట్ మృతి చెందారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో బుధవారం జరిగింది. సాధారణ శిక్షణలో భాగంగా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరిన ఈ విమానం 1.20 గంటలకు కాంగ్రా జిల్లాలోని ఒక గ్రామంలో కూలిపోయింది.

07/19/2018 - 05:29

న్యూఢిల్లీ, జూలై 18: లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలపడాన్ని ఆ పార్టీ ఎంపీలు స్వాగతించారు. తోట నరసింహం, సుజనా చౌదరి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానానికి దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయని, ఆ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.

07/19/2018 - 05:05

న్యూఢిల్లీ, జూలై 18: రాజ్యసభలో చర్చలకు ఇంత వరకూ 17 భాషలు ఉండగా, అదనంగా మరో ఐదు భాషలను ఈ జాబితాలో చేరుస్తున్నట్టు ఎగువ సభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై వెంటనే రాజ్యసభలో చర్చ చేపట్టాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభంకాగా, రాజ్యసభలో టీడీపీ ఎంపీలు విభజన హామీలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.

07/19/2018 - 02:23

న్యూఢిల్లీ, జూలై 18: పార్లమెంటు ఉభయ సభలు చాలా ఏళ్ల తర్వాత సజావుగా మొదలయ్యాయి. తెలుగుదేశం, ఎస్పీ సభ్యులు లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో నినాదాలిస్తూ గొడవ చేశారు. అయితే అది శ్రుతిమించ లేదు. రాజ్యసభలోనూ తెలుగుదేశం సభ్యులు తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుపట్టటంతో 15 నిమిషాలపాటు వాయిదా పడింది. ఈ రెండు సంఘటనలు మినహా ఉభయ సభల్లో ఇతర ఏ రకమైన గొడవా జరగలేదు.

07/19/2018 - 02:21

న్యూఢిల్లీ, జూలై 18: దేశ వ్యాప్తంగా కొట్టి చంపిన సంఘటనలు, లేదా బహిరంగంగానే ఉరివేసి చంపిన కేసుల వివరాలు ప్రభుత్వం వద్ద లేవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ స్పష్టం చేశారు.

07/19/2018 - 05:06

న్యూఢిల్లీ, జులై 18: ఎయర్‌లైన్స్‌లో అదనంగా ఛార్జీలు వసూలు చేయడంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలపై ఎయర్‌లైన్స్ వివక్ష చూపుతున్నాయని, దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించారు. విమానయాన సంస్థలు ప్రాధాన్యత గల సీట్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న విషయాన్ని ఎంపీలు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు.

07/19/2018 - 01:58

న్యూఢిల్లీ, జూలై 18: భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రభుత్వం అదనపు సుంకాలను విధించడంతో ప్రభుత్వ, వాణిజ్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ప్రపంచ వాణిజ్య సంస్థ అప్పిలేట్ వివాద పరిష్కార కమిటీకి భారత్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నెల 19,20 తేదీల్లో ఈ ఫిర్యాదులపై అప్పిలేట్ కమిటీ విచారణ చేపట్టనుంది.

Pages