S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/09/2018 - 02:12

న్యూఢిల్లీ, జూలై 8: ఎన్‌డీఏ కూటమిలో కొనసాగటంతోపాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గం సమావేశంలో నిర్ణయించారు.

07/09/2018 - 02:01

కోల్‌కతా, జూలై 8: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపొట్టుకోవాలన్న కొందరి వామపక్ష నేతల యోచన సిపిఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్‌లో చీలికకు దారితీసే ప్రమాదం ఏర్పడింది. ఈ ఫ్రంట్‌లోని భాగస్వాములైన పలుపార్టీలు కాంగ్రెస్‌తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో నాలుగు దశాబ్దాలుగా కలిసి ఉన్న ఈ వామపక్ష ఫ్రంట్ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది.

07/09/2018 - 02:25

జమ్మూలోని అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంప్‌లో భజనలు చేస్తున్న సాధువులు, భక్తులు.
వాతావరణం అనుకూలించకపోవడం, కాశ్మీర్ వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునివ్వడంతో
వరుసగా నాలుగో రోజు అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది.

07/09/2018 - 02:27

కోల్‌కతా, జూలై 8: ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి సమయంలో సుదీర్ఘ చంద్ర గ్రహణం వినీలాకాశంలో దర్శనమివ్వబోతోంది. అపురూపమైన ఈ చంద్రగ్రహణం దాదాపు ఒక గంట 43 నిమిషాల సేపు ఉంటుంది. భారత కాలమాన ప్రకారం ఈ నెల 27వ తేదీ రాత్రి 11.54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఈ వివరాలను ఎంపీ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి డైరెక్టర్ డాగక్టర్ దేవీ ప్రసాద్ దురాయ్ తెలిపారు.

07/09/2018 - 01:30

న్యూఢిల్లీ,జూలై 8: జమిలి ఎన్నికలకు తాము సిద్ధమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) స్పష్టం చేసింది. దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తమ అభిప్రాయాన్ని కేంద్ర లా కమిషన్‌కు తెలియజేశారు. లోక్‌సభ, శాసన సభల ఎన్నికలను ఓకేసారి నిర్వహించేందుకు తన సమ్మతిని తెలుపుతూ కేసీఆర్ రాసిన లేఖను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బి.

07/09/2018 - 04:22

న్యూఢిల్లీ: లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించటం రాజ్యాంగ విరుద్ధమని, ఆచరణయోగ్యం కాదని తెలుగుదేశం పార్టీ జాతీయ లా కమీషన్‌కు స్పష్టం చేసింది. 2019లో లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగవలసి ఉన్నందున ప్రస్తుతానికి జమిలి ఎన్నికలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

07/08/2018 - 05:56

పనాజీ, జూలై 7: ప్రపంచంలో మూడవ అతి పెద్ద విదా వ్యవస్థ భారత్‌లో ఉన్నా, ఇప్పటికీ ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్షగా మిగిలిందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. శనివారం ఇక్కడ ఆయన గోవా విశ్వవిద్యాలయం 30వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

07/08/2018 - 05:55

జైపూర్, జూలై 7: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉవీళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ ‘బెయిల్ గాడీ’ గా తయారైందని, ఆ పార్టీకి సీనియర్ నేతలందరూ బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌లో శిఖర సమానులమనుకునే నాయకులంతా కోర్టుల నుంచి బెయిల్ తీసుకుని కాలక్షేపం చేస్తున్నారు. వీరిలో కేంద్ర మాజీమంత్రులు కూడా ఉన్నారు’ అని ఆయన విరుచుకుపడ్డారు.

07/08/2018 - 05:54

చెన్నై, జూలై 7: ప్రజల్లో స్వచ్ఛందంగా నేత్ర దానం చేసేందుకు ముందుకు వచ్చే సంస్కృతిని పెంపొందించాలని భారత ఉపరాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ 32వ ఇంట్రాక్యులర్ ఇంప్లాంట్ రిఫ్రాక్టివ్ సర్జరీ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో నేత్ర సంరక్షణపై అవగాహన పెంపొందించాలని కోరారు.

07/08/2018 - 05:29

న్యూఢిల్లీ, జూలై 7: తెలుగుదేశం, శివసేన మాదిరిగా జేడీ(యూ) కూడా బీజేపీకి గుడ్‌బై చెబుతుందా? జేడీ(యూ) ఆదివారం తీసుకునే నిర్ణయం బిహార్ రాజకీయాల్లో కీలక మలుపు కానుందా? అవుననే అంటున్నారు రాజకీయ విశే్లషకులు. జేడీయూ జాతీయ కార్యవర్గం ఆదివారం ఢిల్లీలో సమావేశమై 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలా లేక స్వతంత్రంగా ముందుకు సాగాలా అనే అంశంపై లోతుగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది.

Pages