S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/12/2018 - 01:28

న్యూఢిల్లీ, జూన్ 11: వెనుకబడిన కులాల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ పద్ధతిని తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. టల్కటోరా స్టేడియంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ బీసీ నాయకుల జాతీయ సమావేశంలో మాట్లాడారు. క్రీమీలేయర్ విధానం వలన వెనుకబడిన, అట్టడుగు కులాలకు చెందిన విద్యార్థులు ఎన్నో అవకాశాలను కోల్పోతున్నారని అన్నారు.

06/12/2018 - 01:17

పశ్చిమ బెంగాల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది హౌరా బ్రిడ్జి. దాని పక్కనే బస్టాండు. దానికి అనుసంధాంగా ఉన్న రోడ్లన్నీ వచ్చేపోయే వాహనాలతో ఎప్పుడూ బిజీగా వుంటాయ. హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాలను సోమవారం ఏరియల్ నుంచి తీసి ఫోటో ఇది.

06/12/2018 - 01:12

న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్తమైందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం విరుచుకుపడ్డారు. ‘్భరత ఆర్థిక వ్యవస్థకు నాలుగు టైర్లులో మూడు టైర్లు పంక్చర్ అయ్యాయి’ అని ఆయన ఎద్దేవా చేశారు. చిదంబరం సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ ‘జీఎస్టీ లోపభూయిష్టం. కోట్లాది ప్రజలను మోసం చేశారు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలను జీఎస్టీ పేరుతో వెంటాడుతున్నారు.

06/12/2018 - 01:11

న్యూఢిల్లీ, జూన్ 11: బీజేపీ మొదటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని వైద్య సంబంధ పరీక్షలకోసం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎఏయిమ్స్)లో చేర్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎయిమ్స్‌కు వచ్చి వాజ్‌పేయిని పరామర్శించారు. వాజ్‌పేయి సాధారణ వైద్య పరీక్షల కోసమే ఎయిమ్స్‌లో చేరారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

06/12/2018 - 01:05

న్యూఢిల్లీ, జూన్ 11: రైల్వేలను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని 12 నగరాలకు చెందిన ప్రాంతీయ మీడియాననుద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘్భరతీయ రైల్వేలను ఇప్పుడే కాదు మరెప్పుడూ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.

06/12/2018 - 01:03

న్యూఢిల్లీ, జూన్ 11: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తరహాలో ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర బయటపడిన నేపథ్యంలో ఆయనకు మరింతగా భద్రతను పెంచేందుకు సోమవారం ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోదీకి కల్పిస్తున్న భద్రతను సమీక్షించడంతో పాటు తాజా పరిణామాల నేపథ్యంలో దాన్ని మరింత పటిష్ఠం చేసే అంశంపై దృష్టి పెట్టారు.

06/12/2018 - 01:39

శ్రీనగర్, జూన్ 11: కేంద్రం ప్రభుత్వంతో చర్చకు రావాలని కాశ్మీర్ వేర్పాటువాదులకు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ సమస్య పరిష్కారానికి కేంద్రం తీసుకుంటున్న చొరవను ఈ సందర్భగా ఆమె ప్రశంసించారు. వేర్పాటువాదులు ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సోమవారం ఇక్కడ విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదంతో ఏ సమస్యా పరిష్కారం కాదని మెహబూబా స్పష్టం చేశారు.

06/12/2018 - 00:44

న్యూఢిల్లీ, జూన్ 11: దేశంలోని అరవైశాతం మంది వెనుకబడిన కులాల వారికి లోకసభ, రాజ్యసభ, శాసనసభల్లో సముచిత స్థానం కల్పిస్తామని, రాజకీయాల్లో పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్‌లకు దేశ ప్రజలంటే ఏమిటనేది త్వరలోనే చూపిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు.

06/12/2018 - 00:28

బీజేపీ తొలి ప్రధాని, పార్టీ సీనియర్ నేత 93 ఏళ్ల అటల్ బిహారీ వాజపేయి సోమవారం అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. వాజపేయ ఆరోగ్య సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగమేఘాల మీద ఎయిమ్స్‌కు చేరుకున్నారు. వ్యక్తిగత వైద్య పర్యవేక్షకుడు, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తన బృందంతో ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

06/11/2018 - 17:11

న్యూఢిల్లీ: ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు రెబల్‌ ఎమ్మెల్యే కపిల్‌ మిశ్రా షాకిచ్చారు‌. అసెంబ్లీకి తక్కువ హాజరు అయ్యారంటూ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీ హైకోర్టులో కపిల్‌ ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. తాగునీటి శాఖను తన వద్దే ఉంచుకున్న కేజ్రీవాల్‌.. ఆ సమస్యను పరిష్కరించటంలో ఘోరంగా విఫలం అయ్యారని, అంతేకాకుండా అసెంబ్లీ సెషన్స్‌ను ఎగ్గొడుతూ..

Pages