S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/13/2018 - 04:08

ఇస్లామాదాబ్, ఫిబ్రవరి 12: ఐక్యరాజ్య సమితి నిషేధం విధించిన తీవ్రవాదులు, తీవ్రవాద సంస్థలపట్ల కఠినంగా వ్యవహరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది.

02/13/2018 - 04:07

రాంచీ, ఫిబ్రవరి 12: టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సకాలంలో పైలట్ గుర్తించడంతో 180 మంది ప్రయాణీకులకు తృటిలో ప్రమాదం తప్పింది. రాంచీలోని బిర్సాముండా విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

02/13/2018 - 04:05

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రపంచంలోని ఏ సాహిత్య ప్రమాణాలతోనూ తీసిపోని తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కాకపోవడం పెద్ద లోపమని కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత దేవీప్రియ అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం 24 భాషల్లో అకాడమీ పురస్కారాలకు ఎంపికైన రచయితలకు సోమవారం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది.

02/13/2018 - 04:05

కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో విపరీతంగా మంచు కురుస్తోంది.
ఈ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు సోమవారం భారీగా తరలివచ్చారు.

02/13/2018 - 03:36

అగర్తలా, ఫిబ్రవరి 12: త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో త్రిపుర 20వ రాష్ట్రం అవుతుందని అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. ఆదివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారం పూరె్తైన తరువాత బీజేపీకే అనుకూల వాతావరణం కనిపిస్తోందని, ఇక్కడ ప్రభుత్వం నెలకొల్పడం ఖాయమని సోమవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

02/13/2018 - 03:34

రాయ్‌చూర్, ఫిబ్రవరి 12: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలకు పదునుపెట్టారు. ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ‘జన ఆశీర్వాద్ యాత్ర’ ప్రారంభించిన రాహుల్ గాంధీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జైషా అవినీతిపై మోదీ నోరు మెదపరేమని నిలదీశారు. అవినీతిపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రధాని జైషా వ్యవహారంపై వౌనం దాల్చడానికి కారణమేమిటని ప్రశ్నించారు.

02/13/2018 - 00:16

జమ్ము-శ్రీనగర్, ఫిబ్రవరి 12: భారత సరిహద్దు అవతలిశక్తుల మార్గనిర్దేశనంతో శ్రీనగర్‌లోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడికి తెగబడినట్టు నిఘావర్గాల నుంచి సమాచారం ఉందని, దుస్సాహసానికి పాల్పడిన పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ హెచ్చరించారు.

02/13/2018 - 00:12

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:జమ్మూలోని సుంజువాన్ సైనిక శిబిరంపై ఇస్లామిక్ తీవ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపుదాడి చేసేందుకు త్రివిధ దళాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సుంజువాన్ సైనిక శిబిరంపై శనివారంనాడు తీవ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు సైనికులు, ఒక సైనికుడి తండ్రి మరణించటం తెలిసిందే.

02/12/2018 - 17:54

శ్రీనగర్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు జమ్మూలోని సంజువాన్ ఆర్మీ క్యాంప్‌ను సందర్శించారు. మూడురోజుల క్రితం సంజువాన్‌ ఆర్మీ క్యాంప్‌పై జైషే ఉగ్రవాదులు దాడి చేయడంతో ఇప్పటికీ గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూలో సోమవారం పర్యటించిన రక్షణ మంత్రి సీతారామన్ దాడి జరిగిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.

02/12/2018 - 17:22

ఎన్నికల్లో పోటీ చేయను : ఉమా భారతి

Pages