S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/18/2017 - 02:40

సీలేరు, అక్టోబర్ 17: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా సభ్యులు అత్యంత గోప్యంగా జాన్‌బాయ్ వంతెన పేల్చివేతకు ప్రణాళిక రూపొందిస్తూ వంతెన వద్ద తిరుగుతుండగా అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజుల క్రితమే మావోయిస్టులు దారకొండలో సెల్ టవర్ దగ్ధం చేసారు. అనంతరం కోరుకొండకు చెందిన ఒక వ్యాపారిని కూడా హత్య చేసారు.

10/18/2017 - 01:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్‌లో చేరేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎదుట మూడు షరతులు పెట్టడం చూస్తే, రేవంత్ తన నిర్ణయం తీసేసుకున్నట్టే కనిపిస్తోంది.

10/18/2017 - 02:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: జాతి చరిత్ర, వారసత్వానికి విలువనివ్వకుంటే దేశాభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఒక ఆయుర్వేద ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ స్థాపించిన అఖిల భారత ఆయుర్వేద సంస్థను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

10/18/2017 - 00:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఒకప్పుడు దేశంలోకంటే ఇతర దేశాల్లో ఉద్యోగాల పట్లే మక్కువ చూపే భారతీయులు ఇప్పుడు స్వదేశీ బాట పడుతున్నారా? మంచి ఉద్యోగం, భారీ ఆదాయం అన్నది విదేశాల్లోనే సాధ్యమవుతుందన్న వీరి ఆలోచనలో మార్పు వస్తోందా? తాజాగా జరిగిన సర్వేను బట్టి అవునన్న సమాధానమే కళ్లకు కడుతోంది. భారతీయులు విదేశీ ఉద్యోగాల కంటే కూడా దేశీయ ఉద్యోగాల పట్లే మొగ్గు చూపుతున్నారని ఈ సర్వేలో స్పష్టమైంది.

10/17/2017 - 03:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశ రాజధానిలో ఢిల్లీ తెలుగు అకాడమీ, శ్రీ కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ నేతృత్వంలో అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన నాటికల పోటీలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాయి. ఆంధ్రప్రదేశ్ భవన్‌లో అక్టోబర్ 13న ప్రారంభమైన పోటీలు సోమవారంతో ముగిశాయి. విభిన్న ఇతివృత్తాలతో ఆరు నాటికలు, రెండు ప్రత్యేక ప్రదర్శనలతో ఢిల్లీ తెలుగు కళాప్రియులను అలరించాయి.

10/17/2017 - 03:18

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-కొచ్చువెలి మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 07115 హైదరాబాద్-కొచ్చువెలి ప్రత్యేక రైలు నవంబర్ 4,11,18,25 తేదీలలో హైదరాబాద్ నుంచి రాత్రి గం. 21:00లకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం గం. 03:20లకు కొచ్చువెలి చేరుకుంటుంది.

10/17/2017 - 02:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌ను మార్చేందుకు సిద్ధంగా లేమని కేంద్ర రోడ్డు రవాణా జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సోమవారం గడ్కరీ విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ను మారిస్తే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరుగుతుందని, ఆ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం సుముఖంగా లేదని స్పష్టం చేశారు.

10/17/2017 - 02:54

ఘజియాబాద్‌లోని దాస్నా జైలు నుంచి సోమవారం విడుదలై వెలుపలకు వస్తున్న రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్. నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన అనంతరం వీరు జైలునుంచి విడుదలయ్యారు.

10/17/2017 - 02:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా మారిన పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరి అకస్మాత్తుగా మారిపోవటం ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది. ఇస్లామిక్ ఉగ్రవాదానికి తెర దించాలంటూ అమెరికా ఇటీవల పాకిస్తాన్‌పై పెద్దఎత్తున ఒత్తిడి తీసుకురావటం తెలిసిందే.

10/17/2017 - 02:37

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనా, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపైనా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సోమవారం మరోసారి ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ‘లోక్‌శక్తి’ (ప్రజాశక్తి) సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Pages