S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/22/2017 - 02:07

న్యూఢిల్లీ, జూలై 21: దేశంలోని బడుగు, బలహీన, దళిత వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య లభించాలంటే ప్రభుత్వ పాఠశాలలను గణనీయంగా మెరుగుపరచవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ సభ్యుడు బాల్కా సుమన్ స్పష్టం చేశారు.

07/22/2017 - 02:06

న్యూఢిల్లీ, జూలై 21: సహేతుకమైన, పరిశీలనార్హమైన ఆధారాలేమీ లేకుండా తమపై ఆరోపణలు చేసేవారిపై ధిక్కార చర్యలు చేపట్టే అధికారాన్ని కట్టబెట్టాలంటూ ఎన్నికల కమిషన్ చేసిన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విషయాన్ని న్యాయశాఖ సహాయ మంత్రి పి.పి.చౌదరి శుక్రవారం లిఖితపూర్వకంగా రాజ్యసభకు తెలిపారు.

07/22/2017 - 02:06

న్యూఢిల్లీ, జూలై 21: జిమ్ములు, ఫిట్‌నెస్ కేంద్రాలను రెగ్యులేట్ చేయాలంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. దేశంలోని ఏర్పాటవుతున్న జిమ్‌నాజియంలు, ఫిట్‌నెస్ కేంద్రాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రైవేట్ మెంబర్ బిల్లులో సూచించారు.

07/22/2017 - 02:05

న్యూఢిల్లీ, జూలై 21: ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా మంత్రి మండలి ఏర్పడిన సందర్భంగా ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేయడానికి ఇద్దరు మంత్రులు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ ఎలా తిరస్కరిస్తారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్ ప్రశ్నించారు. శుక్రవారం కాంగ్రెస్ సభ్యుడు బికె హరిప్రసాద్ వివిధ భాషలపై ప్రతిపాదించిన ప్రైవేటు మెంబరు బిల్లుపై చర్చలో ఎంఎ ఖాన్ పాల్గొన్నారు.

07/22/2017 - 02:04

న్యూఢిల్లీ, జూలై 21: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్లే కాశ్మీర్ సమస్య మండుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం నాడిక్కడ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం ద్వైపాక్షికమని, ఇందులో మూడో దేశ జోక్యానికి ఎలాంటి ఆస్కారం లేదని వెల్లడించారు.

07/22/2017 - 01:20

న్యూఢిల్లీ, జూలై 21: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై)తో ప్రైవేటు బీమా సంస్థలే లాభపడుతున్నాయన్న ఆనుమానాలను కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ తోసిపుచ్చుతూ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ సొంత బీమా కంపెనీలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తున్నామని చెప్పారు. 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను 5 ప్రభు త్వ, 13 ప్రైవేటు బీమా సంస్థలు అమలు చేస్తున్నాయి.

07/22/2017 - 01:20

న్యూఢిల్లీ, జూలై 21: కోర్టుల్లో మరింత ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తులను నియమించుకోవాలన్న ప్రతిపాదనకు న్యాయ వ్యవస్థ సుముఖంగానే ఉందని, అయితే ఇందు కోసం ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో శుక్రవారం ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

07/22/2017 - 01:19

న్యూఢిల్లీ, జూలై 21: రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాద కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.కేహర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ ఈ విషయంలో బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి చేసిన వాదనను పరిశీలించింది.

07/22/2017 - 01:04

న్యూఢిల్లీ, జూలై 21: కేంద్రం వయోవృద్ధుల కోసం ఏడాదికి 8 శాతం కచ్చితమైన రాబడి హామీనిచ్చే పింఛను పథకాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించింది. 2017-18 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ‘ప్రధానమంత్రి వయో వందన యోజన’ (పిఎంవివివై) అనే పింఛను పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. 60 ఏళ్లు, అంతకు పైబడిన అందరూ ఈ పథకానికి అర్హులే.

07/22/2017 - 01:03

న్యూఢిల్లీ, జూలై 21: ఆర్థిక సంవత్సరాన్ని ఇప్పుడున్న ఏప్రిల్- మార్చి నుంచి జనవరి -డిసెంబర్‌కు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు.

Pages