S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/23/2017 - 02:50

న్యూఢిల్లీ, జూన్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమాన్ని ఎన్‌డిఏ బలప్రదర్శనగా మార్చివేశారు. జెడి(యు), అన్నాడిఎంకె, టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి, బీజూ జనతాదళ్ పార్టీల మద్దతు సంపాదించటం ద్వారా ఎన్‌డిఏ బలాన్ని దాదాపు 60 శాతానికి పెంచిన నరేంద్ర మోదీ దీనిని నామినేషన్ పత్రాలను దాఖలు చేసే సమయంలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు.

06/23/2017 - 02:44

న్యూఢిల్లీ, జూన్ 22: కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. దీనిపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) మధ్యవర్తిత్వం అక్కర్లేదని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఐరాస ఏమైనా చేయాలనుకుంటే జిహాద్ పేరుతో పాకిస్తాన్ భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించకుండా చూస్తే చాలని పేర్కొన్నారు.

06/23/2017 - 02:39

న్యూఢిల్లీ, జూన్ 22: ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య, అర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగు పరుచుకునేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. ఆగ్నేయాసియా దేశాలతో (ఏసియన్) గత రెండేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న వాణిజ్యం ఇప్పుడు వృద్ధిబాట పట్టిందని, ఈ దిశగా 2016-17లో ఏకంగా 8శాతం వృద్ధి నమోదు చేసుకుందని ఆమె పేర్కొన్నారు.

06/23/2017 - 02:38

న్యూఢిల్లీ, జూన్ 22: రుణమాఫీ అన్నది ఫ్యాషన్‌గా మారిపోయిందని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే రుణమాఫీ చేయొచ్చని గురువారం ఇక్కడ అన్నారు. అయితే ఈ రోజుల్లో అదో ఫ్యాషన్‌గా మారిపోయిందని వెంకయ్య చెప్పారు. రుణమాఫీతోనే రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగవ్వవని, అలాగే అదే చివరి పరిష్కారం కూడా కాదని మంత్రి పేర్కొన్నారు.

06/23/2017 - 02:05

న్యూఢిల్లీ, జూన్ 22: బాల పురస్కార్ అవార్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి వసల నరసయ్య ఎంపికయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2017 సంవత్సరానికి బాల సాహిత్యం, యువ పురస్కారాలను గువాహటిలో అకాడమీ చైర్మన్ విశ్వనాథ్ ప్రసాద్ తివారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 24 భాషల్లో అవార్డులను ప్రకటించారు. బాల సాహిత్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రచనలు చేయడంవల్ల ఈ అవార్డుకు వసల నరసయ్య ఎంపికయ్యారు.

06/23/2017 - 02:05

న్యూఢిల్లీ, జూన్ 22: విశాఖపట్నం నుంచి నేపాల్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి ఆ దేశంలో చిక్కుకున్న 21 మంది తెలుగువారు క్షేమంగానే ఉన్నారు.

06/23/2017 - 01:56

న్యూఢిల్లీ, జూన్ 22:ఖతార్‌లో ఉన్న భారతీయులందరూ సురక్షితంగా, భద్రంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గల్ఫ్ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా ఖతార్‌తో సంబంధాలు తెగిపోవడంతో భారత్‌కు తిరిగి రావాలనుకునే వారికోసం ప్రత్యేక విమానాలు నడుపుతున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు.

06/23/2017 - 01:54

న్యూఢిల్లీ, జూన్ 22: క్షమాభిక్ష పెట్టాలని పాకిస్తాన్‌లో మరణ శిక్షపడ్డ భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాధవ్ అక్కడి ఆర్మీ చీఫ్ ఖామర్ జావెద్ బాజ్వాకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం పాకిస్తాన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది.

06/23/2017 - 01:46

సూళ్లూరుపేట, జూన్ 22: భారీ ప్రయోగాలు చేపడుతూ ప్రపంచ దృష్టి మనపై తిప్పుకున్న ఇస్రో మరో రికార్టు ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. మరో కొన్ని గంటల వ్యవధిలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)చరితాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఒకే రాకెట్ ద్వారా మరోసారి 31 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. నెల్లూరు

06/23/2017 - 03:04

న్యూఢిల్లీ, జూన్ 22: దళిత నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్ కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను తమ అభ్యర్థిగా రంగంలోకి దించాలని ప్రతిపక్షం నిర్ణయించటతో కొత్త రాష్టప్రతి ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది. దళిత నాయకుడైన రామ్‌నాథ్ కోవింద్‌పై మరో దళిత నాయకురాలు మీరాకుమార్ పోటీకి దిగటం తో కొత్త రాష్టప్రతి ఎన్నిక రసకందాయంలో పడింది.

Pages