S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/21/2017 - 02:34

మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో పరాజయం అనంతరం కేరళకు వెళతానని ప్రకటించిన ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ శర్మిల సోమవారం తిరువంతపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు భారీగా స్వాగతం పలుకుతున్న డివైఎఫ్‌ఐ కార్యకర్తలు

03/21/2017 - 02:32

లక్నో, మార్చి 20: మూడేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల సందర్భంలో స్టార్ ప్రచార వ్యూహ కర్తగా వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు యూపి కాంగ్రెస్ కార్యకర్తలకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడ వేస్తే చాలు తిరుగులేని విధంగా విజయం తథ్యమన్న మాట యూపిలో బెడిసికొట్టింది.

03/21/2017 - 02:03

న్యూఢిల్లీ, మార్చి 20: ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ల ఉపాధి అవకాశాలను పెంచేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర మానవ వనరుల శాఖ సహా య మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు.

03/21/2017 - 01:33

ముంబయి, మార్చి 20: బ్రిటిష్ టెలికం సంస్థ వొడాఫోన్, ఆదిత్య బిర్లా సారథ్యంలోని ఐడియా సెల్యులర్ సంస్థలు విలీనమయ్యాయి. దీంతో అత్యధిక వినియోగదారుల సంఖ్య రెవిన్యూ మార్కెట్ కల్గిన ఓ భారీ మొబైల్ సంస్థ ఏర్పాటైనట్లయింది. రానున్న రెండేళ్ల కాలంలో ఈ విలీన సంస్థ ఏకీకృత రూపంలో అమలులోకి వస్తుందని, దీనికి కుమారమంగళం బిర్లా చైర్మన్‌గా వ్యవహరిస్తారని ప్రకటించారు.

03/21/2017 - 02:43

న్యూఢిల్లీ, మార్చి 20: అమెరికాలో ఇటీవల భారతీయులపై జరుగుతున్న దాడులు సాధారణ శాంతిభద్రతల సమస్య కానే కాదని, అవి ‘విద్వేష దాడులే’నని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ రాజ్యసభలో స్పష్టం చేశారు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రశే్న లేదని సుష్మా స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం ఆమె ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేశారు.

03/21/2017 - 01:50

న్యూఢిల్లీ, మార్చి 20: దేశవ్యాప్తంగా సరికొత్త పరోక్ష పన్నుల విధానం జిఎస్‌టి అమలుకు మరింతగా మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన నాలుగు కీలక బిల్లులను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించటంతో పార్లమెంట్‌లో దీన్ని ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది.

03/21/2017 - 01:21

న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట నిచ్చే రీతిలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) నిబంధనలను ప్రభుత్వం సడలించింది. వీటిని సరళీకరించడంతోపాటు మరింత సహేతుకంగా మార్చింది. ముఖ్యంగా ఉద్యోగులు తీసుకునే అడ్వాన్సులు, విత్‌డ్రావెల్స్‌కు సంబంధించి కనీసం 15 రోజుల వ్యవధిలోనే వారు కోరిన మొత్తాన్ని ఆమోదించాలని స్పష్టం చేసింది.

03/20/2017 - 23:54

న్యూఢిల్లీ, మార్చి 20: దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల ప్రజల సంక్షేమానికి కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బిసి ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. వెనుకబడిన కులాలకు చెందిన పార్లమెంటు సభ్యులు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆయన కార్యాలయంలో కలుసుకుని వినతిపత్రం అందజేశారు.

03/20/2017 - 23:53

న్యూఢిల్లీ, మార్చి 20: హెచ్1బి వీసాల విధానంలో మార్పులు చేయడంవల్ల పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదని అమెరికా భరోసా ఇచ్చింది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వెల్లడించారు. లోక్‌సభలో ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన చేస్తూ హెచ్1బి వీసాలకు సంబంధించి కీలకమైన మార్పులు ఉండవని అన్నారు.

03/20/2017 - 23:52

న్యూఢిల్లీ, మార్చి 20: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేయడంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) జోక్యం చేసుకోలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. ఉత్తరప్రదేశ్ బిజెపి శాసనసభాపక్ష నేత ఎన్నిక కార్యక్రమానికి వెంకయ్య నాయుడు పార్టీ కేంద్ర పరిశీలకునిగా హాజరైన విషయం తెలిసిందే.

Pages