S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/03/2017 - 01:30

న్యూఢిల్లి, జూలై 2: స్విస్ బ్యాంకుల్లో గోప్యంగా నగదు దాచుకునే దేశాల్లో భారత్‌కు 88వ స్థానం లభించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది మంచి పరిణామమే. నల్లకుబేరులు భయపడుతున్నారని, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం జమ చేయడం గణనీయంగా తగ్గిందని కేంద్రప్రభుత్వం చేస్తున్న వాదనకు తాజా సమాచారం ఊతమిస్తోంది.

07/03/2017 - 01:36

న్యూఢిల్లీ, జూలై 2: సిక్కింలోని భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో దాదాపునెల రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతుండడంతో భారత్ ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించింది. 1962నాటి యుద్ధం తర్వాత భారత్-చైనా సైనికుల మధ్య ఇంత సుదీర్ఘకాలం ఉద్రిక్తత కొనసాగడం ఇదే మొదటిసారి.

07/03/2017 - 01:23

న్యూఢిల్లీ, జూలై 2: ప్రైవేట్ ఏజన్సీలతో సహా బయటి ప్రదేశాల్లో ఉండే అన్ని ఆధార్ నమోదు కేంద్రాలను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా ప్రభుత్వ లేదా మున్సిపల్ కార్యాలయ ఆవరణల్లోకి మారేలా చూడాలని ఆధార్ జారీ అథారిటీ యుఐడిఏఐ రాష్ట్రాలను ఆదేశించింది.ఈ చర్య ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న 25 వేలకు పైగా ఆధార్ నమోదు కేంద్రాలపై ప్రభావం చూపించడంతో పాటుగా అవి అన్నీ నేరుగా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోకి వస్తాయి.

07/03/2017 - 00:45

శ్రీనగర్, జూలై 2: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని ఇప్పుడున్న రూపంలో ఆమోదించినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని జమ్మూ, కాశ్మీర్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ హెచ్చరించింది. జిఎస్‌టిలో రాష్ట్రానికి తగిన రక్షణలను చేర్చేంతవరకు తాము ఈ కొత్త పన్నును అంగీకరించబోమని ఆ పార్టీ స్పష్టం చేసింది.

07/03/2017 - 00:43

న్యూఢిల్లీ, జూలై 2: వినియోగదారులకు అందుబాటులో ఉండి సేవలందించే రైల్వే సిబ్బంది యూనిఫారం ఇకనుంచి మారనుంది. టిటిఈలు, స్టేషన్ మాస్టర్లు, గార్డ్స్, డ్రైవర్లు, కేటరింగ్ సిబ్బందికి ఆకర్షణీయమైన నలుపు, పసుపు రంగుల్లో టీ షర్టులు, డిజైనర్ ఫ్లోరెసెంట్ జాకెట్లను ఇవ్వనున్నారు. ఈ మేరకు ఫ్యాషన్ డిజైనర్ రితు బెరి దుస్తులను రూపొందించారు.

07/03/2017 - 00:43

న్యూఢిల్లీ, జూలై 2: పదేళ్ల క్రితం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన పేలుళ్ల కేసులో తమ దేశానికి చెందిన 13 మంది సాక్షులను హర్యానాలోని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచే విషయమై నిర్ణయం తీసుకునేందుకు భారత్ మరో నాలుగు నెలల సమయం ఇవ్వాలని పాకిస్తాన్ కోరింది. 2007లో జరిగిన ఈ పేలుళ్లలో 68 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

07/03/2017 - 00:43

పనాజి, జూలై 2: ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్ల పాలనలోకన్నా గత ప్రభుత్వాల హయాంలోనే ఎక్కువగా కొట్టి చంపిన సంఘటనలు జరిగాయని, అయితే అప్పుడు ఎవరూ ఈ అంశాన్ని ప్రశ్నించలేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రస్తుత సంఘటనలను తక్కువ చేసి చూపాలని కానీ, గతంలో జరిగిన సంఘటనలతో పోల్చి చూడాలని కానీ తాను కోరుకోవడం లేదని, తాను కూడా ఈ సంఘటనలను సీరియస్‌గా తీసుకుంటున్నానని ఆయన చెప్పారు.

07/02/2017 - 01:13

పనాజి, జూలై 1: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా ‘ఇన్‌స్పెక్టర్ రాజ్‌‘ (తనిఖీల రాజ్యం)కు ముగింపు పలుకుతుందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పార్లమెంటులో శుక్రవారం అర్ధరాత్రి అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో జిఎస్‌టిని ప్రారంభించిన విషయం తెలిసిందే.

07/02/2017 - 01:13

న్యూఢిల్లీ, జూలై 1: జిఎస్‌టి అమలులోకి వచ్చినప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్టమ్రైన గుజరాత్‌లో వస్త్ర వ్యాపారులు జిఎస్‌టికి వ్యతిరేకంగా తమ దుకాణాలను మూసివేసి ఆందోళనను కొనసాగిస్తుండగా, పశ్చిమ బెంగాల్, జమ్మూ, కాశ్మీర్‌లాంటి మరి కొన్ని రాష్ట్రాల్లో అన్ని రంగాల వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు.

07/02/2017 - 01:12

న్యూఢిల్లీ, జూలై 1: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో డాక్యుమెంట్లు అందజేయడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. పిటిషనర్, బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి నేషనల్ హెరాల్డ్‌పై పిటిషన్ వేశారు.

Pages