S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/30/2017 - 01:39

అహ్మదాబాద్, జూన్ 29: గోరక్షణ పేరుతో హత్యలకు పాల్లడితే ఉపేక్షించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హ్చెరించారు. గురువారం ఇక్కడ సబర్మతీ ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ‘సమాజంలో హింసకు తావులేదు’ అని స్పష్టం చేశారు. గో రక్షకులమంటూ కొందరు సామూహిక హత్యలు, హింసాత్మక చర్యలకు పాల్పడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

06/30/2017 - 01:37

సూళ్లూరుపేట, జూన్ 29: సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇస్రో గురువారం తెల్లవారు జామున 2గంటల 45నిమిషాలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి జీశాట్-17 ఉపగ్రహ ప్రయోగాన్ని దిగ్విజయంగా ప్రయోగించింది.

06/30/2017 - 01:35

న్యూఢిల్లీ, జూన్ 29: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఏర్పాటుచేసిన జిఎస్‌టి ప్రారంభోత్సవ సమావేశం వివాదాస్పదంగా తయారైంది. జిఎస్‌టి ప్రారంభోత్సవ సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తోపాటు వామపక్షాలు, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్ బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించాయి.

06/30/2017 - 01:33

న్యూఢిల్లీ, జూన్ 29: స్వతంత్య్ర భారత చరిత్రలో మరో చారిత్రక అధ్యాయానికి మరి కొన్ని గంటల్లో నాందీ ప్రస్తావన జరుగబోతోంది. రాష్ట్రానికో రేటుతో..పన్నుమీద పన్ను చందంగా మారిన సంక్లిష్ట పరోక్ష పన్నుల వ్యవస్థ స్థానే ‘ఒకే దేశం ఒకే పన్ను’ నినాదంతో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి రానుంది.

06/30/2017 - 01:24

న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో మైనార్టీలకు ఎలాంటి అభద్రతాభావం లేదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. మైనార్టీలను లక్ష్యం చేసుకుని జరుగుతున్న హింసాత్మక ఘటనలపై స్పందించారు. దేశంలో మైనార్టీలు అభద్రతకు గురికావలసిన వాతావరణం లేదని, అక్కడక్కడా జరుగుతున్న ఘటనల వెనుక దుష్టశక్తులు ఉన్నాయని ఆరోపించారు. వీటి ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని ఆయన స్పష్టం చేశారు.

06/30/2017 - 01:23

లక్నో, జూన్ 29: తల్లి ఆత్మహత్యతో తల్లిడిల్లిపోయిన ఓ చిన్నారి న్యాయం కోసం పోలీసులకు లంచం ఇవ్వడానికి సైతం సిద్ధపడింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో గుండెలను పిండే ఘటన చోటుచేసుకుంది. తల్లి సంక్షరణలో గడపాల్సిన ఐదేళ్ల బాలిక తాను పిగ్గీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఇవ్వబోయింది. ఐదేళ్ల మాన్వీ తల్లి సీమా కౌశిక్ ఏప్రిల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.

06/30/2017 - 01:21

న్యూఢిల్లీ, జూన్ 29: శుక్రవారం అర్ధరాత్రి నుంచి చారిత్రక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రాబోతుండటం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మొత్తం నాలుగు శ్లాబుల పరిధిలోకి ఏయే వస్తువులు వస్తాయన్న దానిపై కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు పన్ను లేని వస్తువులు, సేవలు ఏమిటి? అలాగే 5, 12, 18, 28 శాతం పన్నుల శ్లాబుల్లోకి వచ్చే వస్తువులు, సేవలు ఏమిటన్న విషయం ఆసక్తిని కలిగిస్తోంది.

06/30/2017 - 01:19

ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌నాథ్ కోవింద్ ప్రచారం నిమిత్తం గురువారం చండీగఢ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కత్తిని బహూకరిస్తున్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్. చిత్రంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తదితరులు

06/30/2017 - 01:18

న్యూఢిల్లీ, జూన్ 29: రాష్టప్రతి పదవికోసం జరుగుతున్న ఎన్నికల్లో 102 మంది దాఖలు చేసిన నామినేషన్లను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. 104 మంది రాష్టప్రతి పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఏన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరా కుమార్‌ల నామినేషన్ పత్రాలు మాత్రమే సరిగా ఉన్నందున వారిరువురు మాత్రమే పోటీలో ఉంటారు.

06/30/2017 - 01:17

కోల్‌కతా, జూన్ 29: భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అంటూ, కులాలు, మతాల ప్రాతిపదికన కాకుండా దేశమంతా ఒక్కటిగా ముందుకు సాగాలని అన్నారు. ఇటీవల దేశంలో కొంతమంది మైనారిటీలపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Pages