S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/04/2017 - 00:32

న్యూఢిల్లీ, జూలై 3: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎంలు) ట్యాంపరింగ్ అయ్యాయంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు విచారించింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది.

07/04/2017 - 00:29

న్యూఢిల్లీ,జున్ 3: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జీటిలో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ విచారించింది.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలైనందు వల్ల

07/03/2017 - 02:58

న్యూఢిల్లీ, జూలై 2: గత శుక్రవారం అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాలులో గంటకు పైగా అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భారత్ ఒక కొత్త ఆర్థిక ప్రపంచంలోకి అడుగుపెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా వస్తు, సేవలకు ఒకే పన్ను కలిగిన ఏడవ దేశంగా అవతరించిన విషయం తెలిసిందే.

07/03/2017 - 02:56

న్యూఢిల్లీ, జూలై 2: రాబోయే రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు అనుకూలంగా ప్రతిపక్షాల సభ్యులనుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని బిజెపి ఆశిస్తోంది.

07/03/2017 - 02:54

లక్నో, జూలై 2: యాంగ్రీ యంగ్ కాప్ శ్రేష్ఠా ఠాకూర్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వారం రోజుల క్రితం బులంద్‌షహర్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న బిజెపి స్థానిక కార్యకర్తకు ఫైన్ వేసిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు నినాదాలు చేయడంతో వారితో వాగ్వాదానికి దిగి, వారిపై చర్యతీసుకున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ శ్రేష్ఠా ఠాకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

07/03/2017 - 02:51

లక్నో, జూలై 2: వచ్చే వారం గురుపూర్ణిమ తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణంకోసం యత్నాలు ఊపందుకోనున్నాయి. దీనికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఉన్న నారదానంద ఆశ్రమంలో గురుపూర్ణిమ రోజున పెద్దఎత్తున సాధువులు, సన్యాసులు సమావేశమవుతున్నారు.

07/03/2017 - 02:39

న్యూఢిల్లీ, జూలై 2: మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకున్న గౌరవాభిమానాలను, భావోద్వేగాలను చాటుకున్నారు. ఆయన తనను తండ్రిలాగా చూసుకున్నారని కొనియాడారు. రాష్టప్రతి భవన్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీపై ఓ ఫోటో బుక్‌ను మోదీ విడుదల చేశారు.

07/03/2017 - 02:33

న్యూఢిల్లీ, జూలై 2: దేశ రాజధానిలోని ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో ఆంధ్రా, తెలంగాణ నుంచి వచ్చి డిగ్రీ చదివే వారి సంఖ్య 2017లో బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ ఏడాది కూడా డియూ పరిధిలో ఉన్న కాళాశాలల్లో చదివేందుకు దరఖాస్తులు చేసుకోగా పెద్ద ఏత్తున అడ్మిషన్లు పొందారు.

07/03/2017 - 02:03

న్యూఢిల్లీ, జూలై 2: కేంద్ర న్యాయ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కుమార్తె వివాహ రిసెప్షెన్ ఢిల్లీలోని హోటల్ తాజ్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక గజపతిరాజు తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

07/03/2017 - 01:56

న్యూఢిల్లీ, జూలై 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో జరుపబోతున్న పర్యటన భారత్‌లోని యూదుల్లో ఆశలను రేకెత్తిస్తోంది. ఈ పర్యటన పూర్తయిన తర్వాత భారత్‌లో తమకు మైనార్టీ హోదా లభిస్తుందని వారు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. మనదేశంలో 2 వేల సంవత్సరాల నుంచి దాదాపు 6 వేల మంది యూదులు నివసిస్తున్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఉంటున్నారు.

Pages