S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/02/2017 - 01:12

బెంగళూరు, జూలై 1: రాష్టప్రతి ఎన్నికల్లో తాను బలి పశువును కాదని, ఎందుకంటే తాను ఒక సిద్ధాంతంకోసం పోరాడుతున్నానని ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి అయిన మీరాకుమార్ స్పష్టం చేశారు. ‘ఒక సిద్ధాంతం కోసం పోరాడే, ఆత్మప్రబోధం పిలుపు మేరకు ఓటు వేయాలని కోరే ఎవరు కూడా బలిపశువు కాబోరు. నేను ఒక యోధురాలిని. నేను పోరాడుతూనే ఉంటాను.

07/02/2017 - 01:12

చెన్నై, జూలై 1: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాధ్ కోవింద్ శనివారం నాడిక్కడ అన్నాడిఎంకెలోని రెండు వర్గాలతోపాటు పుదుచ్ఛేరి శాసనసభ్యులతోనూ సమావేశమయ్యారు. రాష్టప్రతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోవింద్ అభ్యర్థించారు. పుదుచ్ఛేరి ఏకైక లోక్‌సభ సభ్యుడు ఆర్ రాధాకృష్ణన్ ఆయనను కలుసుకుని మద్దతు తెలిపారు.

07/02/2017 - 01:11

న్యూఢిల్లీ, జూలై 1: పెద్దనోట్ల రద్దు నిర్ణయం లాగానే దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని అమలు చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి.

07/02/2017 - 01:11

న్యూఢిల్లీ, జూలై 1: దేశంలో జి ఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సిఏ కోర్సులో ఈ పన్నును ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ వివేక్ ఖురానా శనివారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సిలబస్‌ను త్వరలో వెల్లడిస్తామన్నారు. నవంబర్‌లో జరిగే పరీక్షల్లో సిఏ విద్యార్థులు పది మార్కులకు సంబంధించిన జిఎస్టీ అనుబంధ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటంది.

07/02/2017 - 01:37

శ్రీనగర్, జూలై 1: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చావుదెబ్బ తగిలింది. లష్కరే కమాండర్ బషీర్ లష్కరీని భద్రతాదళాలు శనివారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి. గత నెలలో ఆరుగురు పోలీసుల మరణం వెనక బషీర్ హస్తం ఉంది. అప్పటినుంచి అతడికోసం దళాలు గాలిస్తుండగా అనంత్‌నాగ్ జిల్లాలో దొరికాడు.

07/02/2017 - 01:10

న్యూఢిల్లీ, జూలై 1: పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానం చెందలేదని ఆందోళన పడొద్దని ఆదాయ పన్నుశాఖ ప్రకటించింది. జూన్ 30లోగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే పాన్ కార్డు నిరుపయోగం అవుతుందని వదంతులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఐటి శాఖ శనివారం నాడొక ప్రకటన చేసింది. ఐటి రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు లేదా కొత్త పాన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నప్పుడూ ఆధార్‌ను లింక్ చేసుకోవచ్చని పేర్కొంది.

07/02/2017 - 01:09

న్యూఢిల్లీ,జూలై 1: దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తూ జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చిన తొలిరోజే కేంద్ర సర్కారు ఒక్క కలం పోటుతో లక్ష బోగస్ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఈ విషయాన్ని శనివారం ప్రకటించారు. అవినీతిపై తాము చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

07/01/2017 - 02:25

న్యూఢిల్లీ, జూన్ 30: ఇదివరకటి భారత్ కాదు ఆ తేడాను గుర్తించకుండా 1962లో లాగానే ఉందనుకోవద్దని చైనా కు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ధీటైన సమాధానం చెప్పారు. తమ దేశ భూ భాగాన్ని భారత్ ఆక్రమిస్తోందని, ఒక్కసారి 1962లో ఏమి జరిగిందో భారత్ గుర్తుంచుకోవాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై జైట్లీ ఘాటుగా స్పదించారు.

07/01/2017 - 02:13

న్యూఢిల్లీ, జూన్ 30: చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్ల వడ్డీ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటును 0.1 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికమైన జూలై నుంచి సెప్టెంబర్ వరకూ ఇది వర్తిస్తుంది.

07/01/2017 - 02:13

న్యూఢిల్లీ, జూన్ 30: కొత్తగా వస్తుసేవా పన్ను (జిఎస్‌టి) అమలులోకి రావడంతో శనివారంనుంచి బ్యాంకు సర్వీసులు, ఎల్‌ఐసి ప్రీమియం, క్రెడిట్‌కార్డు బిల్లులు మరింత భారం కాబోతున్నాయి. ఈ కొత్త విధానం శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలుకావడంతో మారిన రేట్లు ఆ మరునాటినుంచే అమలులోకి వస్తున్నాయి.

Pages