S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/01/2017 - 02:11

న్యూఢిల్లీ, జూన్ 30: పరోక్ష పన్నులన్నింటినీ కలిపేస్తూ కేంద్ర ప్రభుత్వం నాలుగు శ్లాబుల్లో తీసుకొచ్చిన కొత్త వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) గందరగోళమయమంటూ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. శుక్రవారం అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాజకీయ పార్టీలతో పాటు వాణిజ్య వర్తక శ్రేణులు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. జిఎస్‌టి పరిపూర్ణం కాదంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.

07/01/2017 - 02:02

జిఎస్‌టి నిర్ణయాన్ని తొందరపాటుగా అభివర్ణిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో వీధికెక్కిన వర్తకులు ఓ రైలును అడ్డుకున్నారు. అలాగే అనేక రాష్ట్రాల్లో టోకుధరల మార్కెట్లను మూసివేశారు. జిఎస్‌టికి నిరసనగా కాశ్మీర్ వర్తకులు, ఉత్పత్తిదారుల సమాఖ్య శనివారం నాడు బంద్‌కు పిలుపునిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని పలు నగరాల్లో కూడా నిరసనగా శుక్రవారంనాడు వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఆగిపోయాయి.

07/01/2017 - 02:19

చిత్రం.. జిఎస్‌టి అమలులోకి వస్తున్న తరుణంలో ముంబయలో మిఠాయలు పంచుతున్న బిజెపి కార్యకర్తలు

07/01/2017 - 01:59

చిత్రం.. పూరీ తీరంలో సైకత శిల్పంతో జిఎస్‌టికి స్వాగతం పలుకుతున్న సుదర్శన్ పట్నాయక్

07/01/2017 - 01:57

న్యూఢిల్లీ, జూన్ 30: జౌళి, బీడీ పరిశ్రమ, సినిమా టికెట్లను జిఎస్‌టి నుంచి మినహాయించాలని తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి ఆయనొక లేఖ రాశారు. జిఎస్‌టి వల్ల నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

07/01/2017 - 01:37

శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు.. అంటూ సీతారాముల విగ్రహాలను అపూరూపంగా చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న నాలుగు రోజుల టెక్స్‌టైల్ ఇండియా -2017 సదస్సుకు శుక్రవారం హాజరైన మోదీ, అక్కడి స్టాళ్లలో కళాకారుల పనితనాన్ని ఆసక్తిగా తిలకించారు.

07/01/2017 - 01:34

న్యూఢిల్లీ, జూన్ 30: భారత అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన ముకుల్ రోహత్గి స్థానే ఆయన ఈ పదవిని చేపడతారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సహా మూడు దేశాల పర్యటన చేపట్టడానికి ముందే అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్ నియామకంపై చర్చ జరిగింది. ఆ సందర్భంగానే ప్రధాని మోదీని వేణుగోపాల్ కలుసుకున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి.

07/01/2017 - 01:29

న్యూఢిల్లీ, జూన్ 30: దేశవ్యాప్తంగా రైతాంగానికి చివరి క్షణంలో జిఎస్‌టి పన్ను భారం నుంచి ఊరట లభించింది. శుక్రవారం రాత్రి సమావేశమైన జిఎస్‌టి మండలి ఎరువులపై పన్నును 12శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. పనె్నండు శాతం పన్ను విధించడం వల్ల ఎరువుల రేట్లు పెరుగుతాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని జిఎస్‌టి చైర్మన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

07/01/2017 - 01:27

న్యూఢిల్లీ, జూన్ 30: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) కారణంగా ఆహార పదార్థాలతోపాటుగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయని, సామాన్యుడిపై మరింత భారం పడుతుందన్న ఆందోళనలు ఓవైపు వ్యక్తమవుతుంటే, నిజాయితీపరులకు లాభమే ఉంటుందని కేంద్రం వివరణ ఇస్తోంది.

07/01/2017 - 01:25

దేశ ఆర్థిక సంస్కరణల చరిత్రలో మరో సువర్ణ శకం ఆవిష్కృతమైంది. సమాఖ్య ఫెడరలిజానికి తిరుగులేని చుక్కానిగా నిలుస్తూ..కేంద్ర, రాష్ట్రాల మధ్య సరికొత్త అవగాహనకు అద్దం పడుతూ చారిత్రక ఘట్టంగా వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఆవిర్భవించింది. ఎన్నో అరుదైన ఘట్టాలకు తలమానిక వ్యవస్థగా నిలిచిన పార్లమెంట్ సెంట్రల్ హాలు ఇందుకు వేదిక అయింది.

Pages