S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/05/2017 - 01:59

కోల్‌కతా, జూలై 4: పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణ చేశారు. త్రిపాఠి తనను బెదిరించారని, అవమానించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర గవర్నర్‌లా కాకుండా త్రిపాఠి బిజెపి బ్లాక్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ‘గవర్నర్ ఫోన్ చేసి నన్ను బెదిరించారు. బిజెపి పక్షాన నిలిచే విధంగా ఆయన మాట్లాడిన తీరు నాకు అవమానంగా అనిపించింది’ అని మమత తెలిపారు.

07/05/2017 - 01:38

న్యూఢిల్లీ, జూలై 4: పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రానికి లా కమిషన్ గట్టిగా సిఫార్సు చేసింది. దీనివల్ల వైవాహిక అక్రమాలను అడ్డుకోవడానికి వీలవుతుందని పేర్కొంది. పెళ్లికి సంబంధించిన రికార్డులు లేని కారణంగా భార్య హోదా దక్కకుండా చేయడం నుంచి కూడా మహిళలకు రక్షణ కల్పించేందుకు వీలవుతుందని అభిప్రాయపడింది.

07/05/2017 - 01:28

న్యూఢిల్లీ, జూలై 4: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా అచల్‌కుమార్ జ్యోతి నియమితులయ్యారు. చీఫ్ కమిషనర్ నసీం జైదీ గురువారం పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్న జ్యోతి(64) గతంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అచల్‌కుమార్ అక్కడ విధులు నిర్వర్తించారు.

07/05/2017 - 01:27

న్యూఢిల్లీ, జూలై 4: పాత నోట్లు జమ చేసుకోవడానికి సహేతుకమైన కారణాలు చూపించే నిజాయితీపరులకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్రం, ఆర్బీఐకి మంగళవారం సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో మార్గనిర్దేశనం చేయాలని కోరింది. 500, వెయ్యి నోట్ల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాద్యాన్ని చీఫ్ జస్టిస్ జెఎస్ ఖెహెర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది.

07/05/2017 - 01:25

న్యూఢిల్లీ, జూలై 4: భారత్ చైనాల మధ్య సిక్కింపై తలెత్తిన వివాదం క్రమంగా సంఘర్షణలకు దారితీసే అవకాశం కన్పిస్తోంది. సిక్కింపై రాజీ లేదని మంగళవారం తేల్చి చెప్పిన చైనా, పరిస్థితి గంభీరంగా ఉందని, దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత భారత్‌దేనని విస్పష్టంగా తెలిపింది. అసాధారణ రీతిలో భారత్‌లోని చైనా రాయబారి లూ వో జా హుయి ఈ వ్యాఖ్యలు చేయటం రెండు దేశాల మధ్య పరిస్థితులను మరింత తీవ్రతరం చేసేదిగానే కన్పిస్తోంది.

07/04/2017 - 02:01

ఒడిశా తీరంలోని బాలాసోర్‌లో సోమవారం నిర్వహించిన చిన్నతరహా మిసైల్ పరీక్ష విజయవంతమైంది. భూఉపరితలం నుంచి 25 నుంచి 30 కి.మీ. దూరంలోని టార్గెట్‌ను ఈ మిసైల్ ఛేదించింది. చాందీపూర్‌లోని లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి
ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ మిసైల్‌ను డిఆర్‌డిఆర్ రూపొందించింది.

07/04/2017 - 01:59

న్యూఢిల్లీ, జూలై 3: ముక్కుసూటిగా, ధైర్యంగా ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించ గలుగుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన తర్వాత స్వాతంత్య్రం సాధించిన దేశాలన్నీ అద్భుతంగా అభివృద్ధి సాధించాయని కానీ మన దేశం మాత్రం అనుకున్నంత ప్రగతి సాధించలేక పోయిందని పేర్కొన్నారు. మార్పు తేవాలంటే దానికి కఠిన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగల సత్తా ఉండాలని అన్నారు.

07/04/2017 - 01:57

పూరీ, జూలై 3: ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర జరిగి ఎనిమిది రోజులు పూర్తయి, తొమ్మిదో రోజున నిర్వహించే దేవతా విగ్రహాలను తిరిగి తీసుకువచ్చే ‘బహుదా యాత్ర’ కార్యక్రమాన్ని సోమవారం కన్నుల పండువలా నిర్వహించారు. ఈ ఉత్సవానికి దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు హాజరయ్యారు.

07/04/2017 - 01:55

న్యూఢిల్లీ, జూలై 3: ఇప్పటివరకు ఏ భారత ప్రధాని చేయని ప్రయత్నమిది. అది వినూత్న ఆలోచనలకు దివిటీ పట్టే ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారు. నేటి యువతను రేపటి ఆశాసౌధానికి సారధులుగా తీర్చిదిద్దే ఓ బృహత్తర కార్యక్రమాన్ని భుజానకేసుకుంటున్నారు. అదే యువతలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని పాదుకొల్పుతూ రేపటి కోసం వారు అహరహరం పరితపించే రీతిలో తన ఆలోచనలను రంగరిస్తూ ఈ అక్షర సంధానం చేస్తున్నారు.

07/04/2017 - 01:54

శ్రీనగర్, జూలై 3: దక్షిణ కాశ్మీర్‌లో సోమవారం జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని బహమనూ ప్రాంతంలో మిలిటెంట్లు నక్కి ఉన్నారన్న సమాచారంతో సోమవారం ఉదయమే భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. సాయంత్రం వరకూ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు మిలిటెంట్లు చనిపోయినట్లు ఆర్మీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలియజేశారు.

Pages