S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/06/2017 - 03:06

న్యూఢిల్లీ, జూలై 5: వివాదాస్పద న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు పూర్తి పాఠాన్ని వెలువరించింది. మొత్తం న్యాయవ్యవస్థనే అవహేళన చేసే రీతిలో కర్ణన్ చేష్టలు, తీర్పులు, ప్రకటనలు సాగాయని సుప్రీం కోర్టు తెలిపింది. కర్ణన్‌కు ఆరు నెలల జైలు శిక్ష ఏయే కారణాలతో విధించామన్న అంశంపై సవివరమైన రీతిలో ఈ తీర్పు పాఠాన్ని వెలువరించింది.

07/06/2017 - 03:05

న్యూఢిల్లీ, జూలై 5: తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు నగదు, బంగారం ఎరవేశారన్న వ్యవహారాన్ని పరిశీలించేందుకు బుధవారం సుప్రీం కోర్టు అంగీకరించింది. గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. పళనిస్వామికి మద్దతు ఇవ్వాలంటూ శశికళ వర్గం ఎమ్మెల్యేలకు భారీఎత్తున నగదు, బంగారం ఎవరేసినట్టు ఓ ఆంగ్ల చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది.

07/06/2017 - 02:28

న్యూఢిల్లీ, జూలై 5: త్రిపురలో కూడా పట్టు బిగించాలని అనుకుంటున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఐదుగురు ఎమ్మెల్యేలు తిరగబడటంతో చుక్కెదురైంది. టిఎంసికి చెందిన ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాన్ని కాదని, ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామనాథ్ కోవింద్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకోవడంతో మమత వీరిపై చర్య తీసుకున్నారు.

07/05/2017 - 02:19

న్యూఢిల్లీ, జూలై 4: ఉప రాష్టప్రతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆగస్టు 5న ఉప రాష్టప్రతి ఎన్నిక జరుగుతుంది. ఈనెల 18న నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేష్ల పరిశీలన కాగా ఉపసంహరణ తేదీ 21. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపరాష్ట్ర పదవికి ఎన్నిక అనివార్యమయితే ఆగస్టు 5న జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపుఉంటుందని ఇసి వెల్లడించింది.

07/05/2017 - 02:18

కోల్‌కతా, జూలై 4: పశ్చిమబెంగాల్ లోని ఉత్తర 24పరగణాల జిల్లాలో తీవ్రస్థాయిలో మత సంఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి అదుపు తప్పటంతో 400మంది బిఎస్‌ఎఫ్ జవాన్లను రాష్ట్రప్రభుత్వం హుటాహుటిన తరలించింది. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ అభ్యంతరకర పోస్టుతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది.

07/05/2017 - 02:12

న్యూఢిల్లీ, జూలై 4: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను మూడింట రెండింతల మెజారిటీతో గెలిపించుకునేందుకు బిజెపి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే దాదాపు అరవై ఐదు శాతం ఓట్లను పదిలం చేసుకున్న బిజెపి ఇప్పుడు లోక్‌సభ, రాజ్యసభకు చెందిన ఇండిపెండెంట్ సభ్యులతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇండిపెండెంట్ శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు బిజెపి అధినాయకత్వం పావులు కదుపుతోంది.

07/05/2017 - 02:09

న్యూఢిల్లీ, జూలై 4: దేశంలోని ట్రిబ్యునళ్లు అన్నింటినీ రద్దు చేయబోతున్నారా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మంగళవారం సూటిగా ప్రశ్నించింది. క్వాజీ జుడీషియల్ ప్యానెళ్లను రద్దుచేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

07/05/2017 - 02:06

న్యూఢిల్లీ, జూలై 4: దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) పేరిట సమీకరించిన భూములలో నిరుపయోగంగా ఉన్నవాటిని తిరిగి రైతులకు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఏపీ-తెలంగాణతోసహా అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది.

07/05/2017 - 02:05

ఇటానగర్, జూలై 4: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. భారీవర్షాలు, పొగమంచు కారణంగా హెలికాప్టర్ మందుకు కదలలేని పరిస్థితి ఎదురుకావడంతో పైలట్లు ఇటానగర్ శివారు ప్రాంతంలోని ఓ చిన్న ఖాళీ ప్రదేశంలో సురక్షితంగా దింపేశారు. ఎంఐ-17 హెలికాప్టర్‌లో కేంద్ర మంత్రి రిజిజుతో పాటు ఏడుగురు ప్రయాణికులు, ఇతర సిబ్బంది ఉన్నారు.

07/05/2017 - 02:05

న్యూఢిల్లీ, జూలై 4: దేశ కరెన్సీ చరిత్రలో తొలిసారిగా రూ.200 నోటు రంగప్రవేశం చేయనుంది. ఇందుకు సంబంధించి రిజర్వుబ్యాంక్ త్వరలో నోటిఫికేషన్ జారీచేయనుంది. రూ.200 నోటు ప్రవేశపెట్టే అంశంపై గత మార్చిలోనే కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదించిన అనంతరం ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూ.200 నోటు అంశం తెరపైకి వచ్చింది.

Pages