S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/04/2017 - 01:52

న్యూఢిల్లీ, జూలై 3: కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తన బెయిల్ పిటిషన్‌ను సత్వరం విచారించాలన్న కర్ణన్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కోర్టు ధిక్కారణ ఆరోపణపై కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తికి ఆరు నెలల జైలుశిక్ష పడింది.

07/04/2017 - 01:50

పశ్చిమ బెంగాల్‌లోని ‘గూర్ఖాలాండ్’ను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలన్న డిమాండ్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. సోమవారం డార్జిలింగ్ సమీపంలోని మిరిక్ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించిన జి.జె.ఎం మద్దతుదారులు

07/04/2017 - 01:37

న్యూఢిల్లీ, జూలై 3: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై తెలంగాణకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం కేంద్ర మంత్రులు చౌదరి బీరేంద్రసింగ్, ప్రకాశ్ జావడేకర్, బండారు దత్తాత్రేయలను కలిశారు. బీరేంద్ర సింగ్‌ను కలిసిన కెటిఆర్ బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

07/04/2017 - 01:21

ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ, జూలై 3: ‘్భరత్‌లో మా దాడులు కొనసాగుతాయి. ఇప్పటి వరకు భారత్ ఆక్రమిత శక్తులపైనే మేం దృష్టి పెట్టాం. మా ఆపరేషన్లు ఇలాగే కొనసాగుతాయి’ అని అంతర్జాతీయ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ స్పష్టం చేశాడు. తనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన కొద్ది రోజులకే ఒక టెలివిజన్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ భారత్‌లో గతంలో తాము జరిపిన దాడులను అంగీకరించాడు.

07/04/2017 - 01:19

న్యూఢిల్లీ, జూలై 3: వంట గ్యాస్ ధర భారంకానుంది. ఈనెల నుంచి కనీసంగా రూ.32 అదనంగా చెల్లించాల్సి రావొచ్చు. ఓ వైపు జిఎస్టీ ప్రభావం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలో కోత విధిస్తుండటంతో వినియోగదారులు అధిక ధర చెల్లించాల్సి ఉంటుం ది.

07/04/2017 - 01:17

న్యూఢిల్లీ, జూలై 3: ఇజ్రాయిల్‌తో భారత్ బలమైన స్నేహ సంబంధాలను కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఇజ్రాయిల్, జర్మనీల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతాన్యాహూతో రెండు దేశాలూ ఉమ్మడిగా ఎదుర్కొంటున్న ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చిస్తానని ఆయన అన్నారు.

07/04/2017 - 01:15

న్యూఢిల్లీ, జూలై 3: డ్రాగన్ బుసకొడుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. భారత్‌ను రెచ్చగొడుతోంది. భారతదేశమే హద్దులు మీరి తనకు ద్రోహం చేస్తోందని సరికొత్త వాదన చేస్తోంది. తమది 1962నాటి భారత్ కాదని రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన చేస్తే తమదీ 1962 నాటి చైనా కాదని తిప్పికొట్టింది.

07/04/2017 - 00:34

న్యూఢిల్లీ, జూలై 3: శిశువు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా గర్భస్రావం చేయించుకోడానికి ఓ మహిళకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. కడుపులో ఉన్న 26 వారాల బిడ్డ గుండె సంబంధిత సమస్యతో ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. ఒకవేళ శిశువు జన్మించినా తీవ్రమైన అనారోగ్యంతో ఉంటుందని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి స్పష్టం చేసింది. దీనిపై ఆసుపత్రి మెడికల్ బోర్డు నివేదికను అందించింది.

07/04/2017 - 00:33

అహ్మదాబాద్, జూలై 3: దేని దశ ఎప్పుడు ఎలాతిరుగుతుందో ఎవరూ చెప్పలేం. వ్యక్తి కావచ్చు లేదా సంస్థ కావచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిన్నప్పుడు టీ అమ్మిన స్టాల్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. ఆ టీ స్టాల్‌ని టూరిస్ట్ స్పాట్‌గా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుజరాత్‌లోని వాద్‌నగర్ స్టేషన్‌లో ఓ ప్లాట్‌ఫాంపై ఉన్న చిన్న టీ స్టాల్‌లో నరేంద్ర మోదీ చిన్నప్పుడు టీ అమ్మేవారు.

07/04/2017 - 00:32

న్యూఢిల్లీ, జూలై 3: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు రాజ్యసభలో మద్దతు పెరగనుంది. ఆరుగురు ఇండిపెండెంట్ సభ్యులు కోవింద్‌కే ఓటు వేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వారిలో కొందరు పలు అంశాలపై ఎన్‌డిఏకు మద్దతు ఇస్తున్నారు.

Pages