S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/06/2017 - 01:49

బరేలీ (యూపీ), జూన్ 5: ఉత్తర ప్రదేశ్‌లోని 24 నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24మంది సజీవ దహనమయ్యారు. మొత్తం 41మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి యూపీలోని గోండా వస్తున్న ప్రభుత్వ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని పూర్తిగా దగ్ధం కావడంతో ఈ ఘోరం జరిగింది. మరో 14మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

06/06/2017 - 01:48

శ్రీనగర్, జూన్ 5: ఊరి తరహాలో మరోసారి భారత్‌పై దాడి చేసేందుకు మిలిటెంట్లు పన్నిన కుట్ర భగ్నమైంది. బందిపురా జిల్లా సుంబల్‌లోని ఓ సైనిక శిబిరంపై దాడి చేసేందుకు సోమవారం ప్రయత్నించిన నలుగురు మిలిటెంట్లను సిఆర్‌పిఎఫ్, కాశ్మీర్ పోలీసులు మట్టుబెట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో భారీ ఆయుధాలతో ఈ మిలిటెంట్లు సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌లోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించారు.

06/06/2017 - 01:47

న్యూఢిల్లీ, జూన్ 5: ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ ఇంటిపై సోమవారం సిబిఐ దాడులు నిర్వహించింది. ఓ షేర్ లావాదేవీ గురించి సెబికి తెలియజేయకుండా దాచి ఉంచినందుకు, ఓ ప్రైవేట్ బ్యాంకును మోసం చేసిన ఆరోపణలపై సిబిఐ ఆయనపై కేసు నమోదు చేసింది.

06/05/2017 - 02:44

తిరువనంతపురం, జూన్ 4: కేరళలో తమ పార్టీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం నాడు ఇక్కడ ఉద్ఘాటించారు. అధికార సిపి ఎం ఎన్నిరకాలుగా దాడులు జరిపినా, ఎంతగా హింసాకాండ సృష్టించినా రాష్ట్రంలో బిజెపి శక్తివంతం కావటాన్ని ఎవరూ నిరోధించలేరని ఆయన స్పష్టం చేశారు.

06/05/2017 - 02:43

న్యూఢిల్లీ, జూన్ 4: లండన్ ఉగ్రవాద దాడులను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు దిగ్భ్రాంతి కలిగించాయని పేర్కొన్న ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ ఒక ట్వీట్‌లో ఆకాంక్షించారు. కాంగ్రెస్ అధ్యక్షురా లు సోనియా గాంధీ సైతం లండన్ దాడులను ఖండించారు.

06/05/2017 - 02:42

న్యూఢిల్లీ, జూన్ 4: పశు వధను నిషేధిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌పై వివిధ వర్గాలు చేసిన సూచనలను పరిశీలించడానికి సిద్ధం గా ఉన్నామని, దీన్ని ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా చూడడం లేదని ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసిం ది. పశు వధపై ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇవ్వడం గమనార్హం.

06/05/2017 - 02:35

హమీర్‌పూర్, జూన్ 4:కాశ్మీర్‌లో తరచూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం పాకిస్తాన్‌ను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పాకిస్తాన్ ఈ రకమైన చర్యలకు ఒడిగడితే భారత దళాలు తీవ్రస్థాయిలో ప్రతిస్పందిస్తాయని, పేల్చే బులెట్లను లెక్క పెట్టవని స్పష్టం చేశారు. ‘కాశ్మీర్‌లో శాంతి యుత పరిస్థితులకు పాకిస్తాన్ ఎన్నోసార్లు విఘాతం కలిగించింది.

06/05/2017 - 02:03

విశాఖపట్నం, జూలై 4: ఎంతో ఆశపెట్టుకున్న నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. అనుకున్న సమయానికే కేరళను తాకిన రుతుపవనాలు రాష్ట్రాన్ని వచ్చే క్రమంలో కాస్త వెనుకబడ్డాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో కేరళ వరకూ వచ్చిన రుతుపవనాలు అక్కడే స్థిరంగా నిలిచిపోయాయి.

06/05/2017 - 02:03

గుంటూరు, జూన్ 4: ‘నరేంద్ర మోదీ ఎప్పుడూ హిందూ ధర్మం గురించి చెబుతుంటారు. హిందూ ధర్మ పరిరక్షకుడని చెబుతుంటారు. కానీ ఆయన కోట్లాది మంది ఆరాధించే తిరుమల వెంకటేశ్వరస్వామి సమీపంలో సభ నిర్వహించి ఆంధ్ర రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత హోదా ఇవ్వకుండా మోసం చేశారు. హిందు ధర్మం గురించి మాట్లాడే మోదీ మీకు అబద్ధం చెప్పినట్లే కదా? ఇదేనా మీరు పాటించే ధర్మం?

06/05/2017 - 01:16

సూళ్లూరుపేట, జూన్ 4: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సవాల్‌గా తీసుకుని భారీ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశ రోదసీ చరిత్రలోనే అత్యంత భారీ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇదే ప్రథ మం.

Pages