S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/19/2016 - 02:42

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశంలో 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న రాక్షస నిర్ణయం వల్ల ఇప్పటి వరకూ 55మంది మరణించారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఇందుకు సంబంధించి దేశానికి, మృతుల కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నగదు కోసం బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద గంటల తరబడి నిలబడాల్సి రావడం వల్లే వీరందరూ మరణించారని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు.

11/19/2016 - 02:20

న్యూఢిల్లీ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలు నగదు కోసం బ్యాంకులు, పోస్ట్ఫాసుల ఎదుట బారులుతీరి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తడాన్ని తీవ్రమైన సమస్యగా సుప్రీం కోర్టు శుక్రవారం అభివర్ణించింది.

11/19/2016 - 02:18

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్రవ్య బిల్లేనని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ రూలింగ్ ఇచ్చా రు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిసి కురియన్ శుక్రవారం మధ్యాహ్నం సభలో చైర్మన్ అన్సారీ రూలింగ్‌ను చదివి వినిపించారు.

11/19/2016 - 01:59

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఉన్నత న్యాయస్థానాల జడ్జిల పదవీవిరమణ వయస్సు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్‌మెంట్ వయసుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పిపి చౌదరి శుక్రవారం రాజ్యసభలో ఈ ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు, 24 హైకోర్టుల న్యాయమూర్తుల పదవీవిరమణ వయస్సు పెంపునకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

11/19/2016 - 01:59

న్యూఢిల్లీ, నవంబర్ 18: వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఏర్పడిన నగదు కొరతను తగ్గించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డులను స్వైప్ చేసి 2 వేల రూపాయల నగదును తీసుకునే సదుపాయం శుక్రవారం దేశవ్యాప్తంగా దాదాపు 700 పెట్రోల్ బంకుల్లో ప్రారంభమైంది.

11/18/2016 - 04:18

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 17: విజయవాడకు సమీపంలోని మూలపాడు క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, వెస్టిండీస్ మహిళ జట్ల మధ్య శుక్రవారం నుండి టి20 సిరీస్ జరుగనుంది. ఈ నెల 18, 20, 22తేదీల్లో వరుసగా మూడు టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇప్పటికే వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు మంచి జోరుమీద ఉంది.

11/18/2016 - 04:08

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఢిల్లీ-ఎన్‌సిఆర్, హర్యానాల్లో గురువారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో భూకపంపం కారణంగా వరుస ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప మూలకేంద్రం హర్యానాలోని బావల్‌కు ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా గుర్తించారు. భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతుల్లో ఈ ప్రకంపనలు మొదలైనట్టుగా చెబుతున్నారు.

11/18/2016 - 04:07

చెన్నై, నవంబర్ 17: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేగంగా కోలుకుంటున్నారు. శ్వాసకోస సంబధిత వ్యాధి నుంచి జయలలిత పూర్తిగా కోలుకున్నారని, సొంతంగానే శ్వాస తీసుకోగలుగుతున్నారని అధికార అన్నాడిఎంకె వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఏ రోజైనా అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జిచేసే అవకాశం ఉందని పార్టీ ప్రతినిధి సి పొన్నయ్యన్ తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి ఇదే ఆసుపత్రిలో జయ చికిత్సపొందుతున్నారు.

11/18/2016 - 03:50

న్యూఢిల్లీ, నవంబర్ 17: నగదు మార్పిడిపై నేటి నుంచి రోజుకు రెండు వేలు మించి ఇచ్చేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగున్నర గురువారం రెండు వేలకు కుదించింది. నగదు కొరతను దృష్టిలో పెట్టుకుని మార్పిడిపై ఇచ్చే మొత్తాన్ని తగ్గించినట్టు తెలిపింది. కాగా కొత్త రూ. 2000, రూ.

11/18/2016 - 03:32

న్యూఢిల్లీ, నవంబర్ 17: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. రద్దు నిర్ణయాన్ని మూడు రోజుల్లో వాపస్ తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. వారిద్దరూ గురువారం రిజర్వ్ బ్యాంక్‌ను సందర్శించి కొత్త నోట్ల ప్రింటింగ్ పరిస్థితిని సమీక్షించి వచ్చారు.

Pages