S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/17/2016 - 07:19

భువనేశ్వర్, నవంబర్ 16: ఒడిశా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముక అయిన పల్లెల్లోని పోస్ట్ఫాసులు నకిలీ కరెన్సీని గుర్తించే యంత్రాలు లేక చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. నగదును మార్చుకునేందుకు వచ్చిన వారు తెచ్చే రద్దయిన నోట్లలో నకిలీవి గుర్తించే యంత్రాలు పోస్ట్ఫాసులకు చేరలేదు. కొద్దో గొప్పో ఉన్నవి సరిగా పనిచేయలేదు. దీంతో నగదు మార్పిడి చాలా ఆలస్యమైపోయింది.

11/17/2016 - 07:19

బలియా, నవంబర్ 16: కూతురు పెళ్లికి ముందు జరిగే ‘‘తిలక్’’ కార్యక్రమానికి తగిన నగదు లేక.. పాత నోట్లను మార్చుకోలేక ఓ తండ్రి గుండెపోటుతో మరణించాడు. సహత్‌వార్ నగర్ పంచాయత్‌కు చెందిన సురేశ్ సోనర్ కూతురు సుమన్ తిలక్ కార్యక్రమం బుధవారం జరగాల్సి ఉంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దుతో కూతురు తిలక్ కార్యక్రమానికి అవసరమైన నగదు తక్కువ పడింది.

11/17/2016 - 07:18

పూణె, నవంబర్ 16: పెద్ద నోట్ల రద్దు బ్యాంకు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. సెలవులు లేక.. సాధారణ పనివేళలకు మించి రేయింబవళ్లు పనిచేయటంతో సీనియర్ ఉద్యోగులు తాళలేకపోతున్నారు. పూణె సమీపంలోని రాజ్‌గురునగర్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో మెసెంజర్‌గా పనిచేస్తున్న తుకారాం తాన్పురె బుధవారం ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకులోనే కుప్పకూలాడు. ఆయన్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

11/17/2016 - 07:17

పెద్ద నోట్లరద్దుపై రాష్టప్రతికి పార్టీల విజ్ఞప్తి
ప్రజల ఇబ్బందులను తొలగింపచేయండి: శివసేన
రద్దు వెనుక పెద్ద కుట్ర: మమతా బెనర్జీ
రాష్టప్రతి భవన్‌కు 4 పార్టీల నేతల మార్చ్

11/17/2016 - 07:15

న్యూఢిల్లీ,నవంబర్ 16: దేశంలోని అవినీతి, నల్లధనాన్ని అరికట్టటంతోపాటు ఉగ్రవాదాన్ని దెబ్బ తీసేందుకు పెద్ద నోట్లను రద్దు చేయటం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నాయకుడుగా ఎదిగిపోయారని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. ఎవరి మెప్పుకోసమో తాను ఈ మాటలు అనడం లేదని ప్రపంచ నేతలంతా ఆయన తీసుకున్న చర్యను ప్రశంసిస్తున్నారన్నారు.

11/17/2016 - 07:15

న్యూఢిల్లీ, నవంబర్ 16: నల్లధనం నియంత్రణ కోసమంటూ మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకున్నప్పటినుంచి ప్రభుత్వం తదుపరి చర్య ఏమిటనే మాట వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై అటు సానుకూలంగా, ఇటు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రభు త్వం ఇంకేం చర్యలు తీసుకుంటుందోననే అలోచనలు సామాన్యుడిని ముప్పిరిగొంటున్నాయి.

11/17/2016 - 07:14

హంపి..తిరుమల సెట్టింగ్‌లు
అడుగడుగునా సంపద ప్రదర్శన
50వేల మంది అతిథులు
బాలీవుడ్ స్టార్లతో హంగామా
కోట్లాది రూపాయల ఖర్చు

11/17/2016 - 06:20

పెద్ద నోట్ల రద్దు తొందరపాటు చర్య నియంతల తరహాలో మోదీ నిర్ణయాలు
మిమ్మల్ని చంపాలనుకున్నది ఎవరో చెప్పండి రాజకీయ స్వప్రయోజనాలకే ఈ చర్య
85 శాతం కరెన్సీ చెల్లదంటే ఏమైపోవాలి? ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే యత్నమా?
నల్లధనం నిర్మూలనకు కట్టుబడే ఉన్నాం రాజ్యసభలో దుమ్మెత్తిపోసిన విపక్షాలు

11/17/2016 - 06:16

న్యూఢిల్లీ, నవంబర్ 16: పెద్దనోట్ల మార్పిడి, విత్‌డ్రాల కోసం ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులు, అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

11/17/2016 - 06:15

న్యూఢిల్లీ, నవంబర్ 16: అన్ని అంశాలను చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతేకాదు శీతాకాల సమావేశాల్లో సభా కార్యకలాపాల అజెండాను పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు తోడ్పాటునందిస్తాయన్న ఆశాభావాన్ని సైతం ఆయన వ్యక్తం చేశారు.

Pages