S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/30/2016 - 04:43

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఈ ఏడాది జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అమెరికా కూడా ధ్రువీకరించింది. జనవరి 2న పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు జైష్ ఎ మహమ్మద్ సంస్థకు చెందినవారేనని జాతీయ పరిశోధనా ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించి జైష్ అధినేత మోస్ట్ వాంటెడ్ వౌలానా మసూద్ అజర్‌పై చార్జిషీట్ దాఖలు చేయటానికి కూడా సన్నద్ధమైంది.

08/30/2016 - 04:41

చెన్నై, ఆగస్టు 29: తమిళనాట ‘అమ్మ’ పేరిట పలు జనాకర్షక పథకాలు ప్రారంభించిన అన్నాడిఎంకె ప్రభుత్వం మరో మందడుగు వేసింది. అమ్మ జిమ్‌లు, అమ్మ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్టు తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలిత సోమవారం ప్రకటించారు. గ్రామీణ ప్రాంత యువతలో శారీరక, మానసిక పరిస్థితిని పెంపొందించడానికి వీటిని ఏర్పాటు చేయతలపెట్టామని ఆమె అన్నారు.

08/30/2016 - 04:40

కాన్పూర్, ఆగస్టు 29: గంగానదిలో 550 కి.మీ. దూరాన్ని పదిరోజుల్లో ఈదేస్తానంటోంది 11 ఏళ్ల బాలిక. ‘క్లీన్ గంగ’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, దాంతోపాటే వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనాలి ఈ బాలిక ఉవ్విళ్లూరుతోంది. 9వ తరగతి చదువుతున్న సిద్ధార్థ శుక్ల కాన్పూర్‌లోని మస్సాక్రే ఘాట్ నుంచి వారణాసి (550 కి.మీ.)కి 10 రోజుల్లో ఈదేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 150 కి.మీ.

08/30/2016 - 04:39

న్యూఢిల్లీ, ఆగస్టు 29: మహాత్మా గాంధీ హత్యకు సంబంధించి కాంగ్రెస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజీ పడేది లేదని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసింది. లిఖితపూర్వకంగా రాహుల్ గాంధీ తమకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది.

08/30/2016 - 04:39

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రిజర్వేషన్ సౌకర్యం లేని కులాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును సుప్రీంకోర్టు సోమవారం మరో రెండు వారాలు పొడిగించింది.

08/30/2016 - 04:38

తిరువనంతపురం, ఆగస్టు 29: పాఠశాల వార్షికోత్సవాలు, ఫంక్షన్లలో మతపరమైన పాటలు, ప్రార్థనలు, జ్యోతి ప్రజ్వలన వంటి కార్యక్రమాలు మానుకోవాలని కేరళ పబ్లిక్ వర్క్స్ మంత్రి జి సుధాకరన్ అన్నారు. ‘రాజ్యాంగంలో ఎక్కడా కులం లేదా మతం గురించి ప్రస్తావన లేదు. పాఠశాలల్లో జ్యోతి ప్రజ్వలన చేయనక్కర్లేదు. చేయమని రాజ్యంగంలో ఎక్కడా చెప్పలేదు కూడా’ అని మంత్రి స్పష్టం చేశారు.

08/30/2016 - 04:37

చెన్నై, ఆగస్టు 29: అన్నాడిఎంకె బహిష్కృత ఎంపీ ఎం శశికళ పుష్ప పార్టీ అధినాయకత్వంపై ధిక్కారస్వరం వినిపించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని సోమవారం వెల్లడించారు. సింగపూర్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న శశికళ మీడియాతో మాట్లాడుతూ ‘రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేసే ప్రశే్నలేదు’ అని అన్నారు.

08/30/2016 - 04:36

ఆర్డినెన్స్, ఆగస్టు 29: పాకిస్తాన్, చైనాలతో యుద్ధాల తరువాత భారత్‌నుంచి ఆయా దేశాలకు వలసపోయినవారి ఆస్తులపై తమకు హక్కు ఉందని వారి వారసులెవరూ వాదించకుండా నిరోధించడానికి సుమారు 50 ఏళ్లనాడు రూపొందించిన శత్రు ఆస్తుల (ఎనెమి ప్రాపర్టీ) చట్టాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగోసారి ఆర్డినెన్స్ జారీ చేసింది.

08/30/2016 - 02:24

న్యూఢిల్లీ, ఆగస్టు 29: తెలంగాణ వర్శిటీలకు వీసీల నియామకంలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉపకులపతుల నియామకాలపై ప్రభుత్వ ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. ఇప్పటికే నియమితులైన వీసీలను యథాతథంగా కొనసాగించొచ్చని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాలు సహా, వర్శిటీలు వెలువరించే అభిప్రాయాలపై వివరణలు, స్పందన తెలియజేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

08/30/2016 - 04:57

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్టప్రతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నుంచి స్వీకరిస్తున్న తెలుగు అమ్మాయ, బాడ్మింటన్ సూపర్ స్టార్ పివి సింధు. ఆమెతోపాటు రెజ్లర్ సాక్షి మాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూ రాయ్‌లకు కూడా ఖేల్ రత్న అవార్డును రాష్టప్రతి బహూకరించారు.

Pages