S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/20/2016 - 12:47

ఢిల్లీః మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను శనివారం ఉదయం వీర్ భూమిలో నిర్వహించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లు సహా కొందరు ప్రముఖులు ఢిల్లీ వీర్ భూమిలో పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.

08/20/2016 - 11:56

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష చేసి, ఇటీవలే దీక్ష విరమించిన మణిపూర్ ఉక్కుమహిళ ఐరోం షర్మిలను ఆమె తల్లి 16 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కలుసుకున్నారు. నిరాహారీ దీక్ష చేపట్టిన సమయం నుంచి దాన్ని విరమించే వరకూ షర్మిలను ఆమె తల్లి సాక్షీదేవి (84) ఎన్నడూ కలుసుకోలేదు.

08/20/2016 - 11:55

దిల్లీ: ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరచి దేశానికి పతకాలు సాధించిన తెలుగమ్మాయి పివి సింధు, హర్యానా యువతి సాక్షి మాలిక్‌లను నగదు నజరానాలతో సత్కరించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. రజత పతకం సాధించిన సింధుకు రూ. 2 కోట్లు, కాంస్య పతక విజేత సాక్షికి కోటి రూపాయలను అందజేయనున్నట్లు దిల్లీ సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

08/20/2016 - 11:54

జబల్పూర్: గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన మధ్యప్రదేశ్‌లోని రహత్‌గఢ్ జిల్లాలో శనివారం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

08/20/2016 - 08:24

న్యూఢిల్లీ, ఆగస్టు 19: స్వల్ప శస్తచ్రికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుప్రతిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిశ్చార్జి అయ్యారు. ఈనెల ఆరంభంలో జ్వరం, అతిసార, భుజం నొప్పితో ఆమె ఇదే ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వైద్య చికిత్సల కొనసాగింపులో భాగంగానే సోనియా మళ్లీ ఆసుపత్రిలో చేరారు.

08/20/2016 - 07:56

ముంబయి, ఆగస్టు 19: రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న రిజర్వేషన్లను కొత్త విద్యావిధానంలో మార్చే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ శుక్రవారం స్పష్టం చేశారు. కొత్త విద్యావిధానాన్ని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని, దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా కేంద్ర కేబినెట్ తదుపరి చర్చ నిమిత్తం చేపట్టాల్సి ఉంటుందన్నారు.

08/20/2016 - 07:55

న్యూఢిల్లీ, ఆగస్టు 19: ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’కు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించనున్నారు. ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ పలు చర్చల అనంతరం ప్రధాని మోదీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

08/20/2016 - 07:54

పసిఘాట్, ఆగస్టు 19: అరుణాచల్ ప్రథేశ్ భూభాగంలోకి చైనా సైన్యం ఇటీవల రెండు సార్లు దురాక్రణకు ప్రయత్నించిందని కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్‌ను ప్రారంభించిన మంత్రి జూలై 22న అంజ్వా జిల్లాలోని మారుమూల కిబితు ప్రాంతంలో చైనా సైన్యం చొరబడే ప్రయత్నం చేసిందన్నారు.

08/20/2016 - 07:52

శ్రీనగర్, ఆగస్టు 19: జమ్మూ, కాశ్మీర్‌లో ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్‌ను వాడొద్దంటే తమ ముందు తుపాకులు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉంటాయని, దీనివల్ల మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం ఉందని సిఆర్‌పిఎఫ్ జమ్మూ, కాశ్మీర్ హైకోర్టుకు తెలియజేసింది.‘ ఒక వేళ పెల్లెట్ గన్స్‌ను నిషేధించినట్లయితే సిఆర్‌పిఎఫ్‌కు రైఫిల్స్‌తో కాల్పులు జరపడం తప్ప మరో మార్గం ఉండదు.

08/20/2016 - 07:52

న్యూఢిల్లీ, ఆగస్టు 19: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)ను వీలున్నంత త్వరగా ఖాళీ చేయటం గురించి పాకిస్తాన్‌తో విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు జరిపేందుకు సిద్ధమేనంటూ భారతదేశం కొత్త మెలిక పెట్టింది.

Pages