S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/12/2016 - 16:01

చెన్నై : తిరుచ్చి- మధురై రహదారిపై శుక్రవారం వ్యాన్, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

08/12/2016 - 15:59

బెంగళూరు: కర్ణాటక శాసనమండలి చైర్మన్, బీజేపీ సీనియర్ నేత డి.హెచ్. శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా నియమించేందుకు బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ పదవిని ‘చే’జిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

08/12/2016 - 15:35

దంటాల్‌ ( హిమాచల్‌‌ప్రదేశ్‌) : వారం రోజులుగా కురుస్తున్నవర్షాలతో దంటాల్‌లోని హిమాచల్‌‌ప్రదేశ్‌లో కూచ్‌ నదికి వరద పోటెత్తింది. నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వంతెన కొట్టుకుపోయింది. వంతెనపై మూడు రోజులుగా రాకపోకలను నిలిపివేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.

08/12/2016 - 15:32

ఘజియాబాద్‌ ( ఉత్తరప్రదేశ్‌) : బీజేపీ నేత బ్రిజ్‌పాల్ టియోటియా కాన్వాయ్‌పై శుక్రవారం ఘజియాబాద్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఓ కుటుంబ వేడుకలో పాల్గొని మురద్‌నగర్‌ నుంచి బ్రిజ్‌పాల్ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో బ్రిజ్‌పాల్ సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిజ్‌పాల్‌ను వెంటనే నోయిడాలోని ఫోర్టిస్‌ ఆస్పత్రికి తరలించారు.

08/12/2016 - 15:12

దిల్లీ: ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్దరు పైలట్లు తేలింది. దీంతో వారిని 4 సంవత్సరాల పాటు సస్పెండ్‌ చేస్తూ పౌర విమానయాన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆయా సంస్థలను ఆదేశించారు. ఆగస్టు 3న అబుదాబి నుంచి చెన్నై చేరుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఓ పైలట్‌ మద్యం తాగినట్లు తేలింది.

08/12/2016 - 14:59

దిల్లీ: ఎపి రాజధాని అమరావతి నిర్మాణంలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఏబీకే ప్రసాద్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. రాజధానిని కట్టుకోవాలనుకుంటే అడ్డుకుంటారా?, రాజధాని ఎక్కడ కట్టుకోవాలో కూడా మీరే నిర్ణయిస్తారా అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

08/12/2016 - 14:35

దిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఈ సమావేశాల్లో లోక్‌సభలో 13, రాజ్యసభలో 14 బిల్లులు ఆమోదం పొందాయి. కాశ్మీర్ అంశంపై ఏకగ్రీవ తీర్మానం చేసిన అనంతరం లోక్‌సభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఎన్‌డిఎ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావించిన జిఎస్‌టి బిల్లుకు ఈ సమావేశాల్లో ఆమోదం లభించింది.

08/12/2016 - 04:12

న్యూఢిల్లీ, ఆగస్టు 11: రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలు రైతుల బకాయిలను చెల్లించేందుకు ఆర్థిక సహాయం చేయాలని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవంతి శ్రీనివాస్ గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో సహకార చక్కెర కర్మాగారాలు రైతులకు చెల్లించవలసిన బకాయిల అంశాన్ని ప్రస్తావించారు.

08/12/2016 - 02:38

న్యూఢిల్లీ, ఆగస్టు 11: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ తీర్మానం రేపు రాజ్యసభలో చర్చకు రానున్నది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోకి తీసుకోవాలి.

08/12/2016 - 02:33

సూళ్లూరుపేట, ఆగస్టు 11: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల 29న ప్రయోగించాల్సిన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 5 రాకెట్ ప్రయోగం వాయిదా పడినట్లు తెలిసింది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఇన్‌శాట్- 3డిఆర్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఐదు రోజుల క్రితం ఈ నెల 6న ఉపగ్రహం బెంగళూరు నుండి షార్‌కు చేరింది.

Pages