S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/12/2016 - 18:04

తిరువనంతపురం: కేరళలోని అన్ని ఆలయాల్లో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకూ బాణసంచా కాల్చరాదని కేరళ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కొల్లం జిల్లాలోని పుట్టింగళ్ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా కాలిపోయి 109 మంది మరణించిన సంఘటనపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయం వద్ద భక్తులను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.

04/12/2016 - 16:50

దిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బిజెపి నేతలు మంగళవారం ఇక్కడ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొదటి రెండు విడతల పోలింగ్‌లో పలు చోట్ల హింసకు తృణమూల్ కాంగ్రెస్ బరితెగించిందని వారు ఆరోపించారు. మిగతా విడతల పోలింగ్‌లోనైనా శాంతిభద్రతలను కాపాడాలని వారు కోరారు.

04/12/2016 - 16:49

దిల్లీ: రైతులు, సామాన్య జనం రుణాలు బకాయిపడితే వారి ఆస్తులను జప్తు చేసే బ్యాంకులు వేలకోట్ల రూపాయల్లో బకాయిపడే వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. రుణఎగవేతదారుల వివరాలు వెల్లడించలేమంటూ ఆర్‌బిఐ నిస్సహాయతను వ్యక్తం చేయడం సరైన విధానం కాదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

04/12/2016 - 16:48

జార్ఖండ్: ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత గొడ్డలితో నరికి చంపిన ఘటనలో దోషికి మరణశిక్షను విధిస్తూ జార్ఖండ్‌లోని గిరిథ్ జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. 2011లో మధురయాదవ్ అనే వ్యక్తి మామిడిపండ్లు ఇస్తానని చెప్పి ఏడేళ్ల బాలికను అడవిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె తలను గొడ్డలితో నరికేశాడు.

04/12/2016 - 16:48

ముంబయి: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు ముంబయిలోని అతిపెద్ద డంపింగ్ యార్డు (డియోనార్)ను సందర్శించి అక్కడి పరిస్థితులపై స్వయంగా ఆరా తీశారు. నిత్యం స్వచ్ఛ్భారత్ అంటూ గొప్పలు చెప్పే ప్రధాని మోదీ ముంబయిలోని చెత్త సమస్య గురించి పట్టించుకోరా? అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం వల్ల ప్రజలు మరణిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు.

04/12/2016 - 16:47

దిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి వేముల రోహిత్ కుటుంబాన్ని ఆదుకుంటానన్న దిల్లీ సిఎం కేజ్రీవాల్ తన మాట నిలుపుకున్నారు. రోహిత్ తమ్ముడు రాజాకు దిల్లీ ప్రభుత్వంలో గుమస్తా ఉద్యోగాన్ని ఇస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ ఉద్యోగంలో చేరాలా? వద్దా? అనే విషయమై ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని రాజా చెబుతున్నారు.

04/12/2016 - 16:47

కొల్లం: కేరళలోని కొల్లం జిల్లా పుట్టింగళ్ ఆలయం వద్ద బాణసంచా పేలుడు ఘటనలో నిందితులైన ఏడుగురు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. బాణసంచా వల్ల మంటలు వ్యాపించి వందమందికిపైగా మరణించడంతో ఆలయ కమిటీ సభ్యులపైన, బాణసంచా కాంట్రాక్టర్లపైన వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో సోమవారం అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

04/12/2016 - 16:46

ముంబయి: ‘బాలికా వధు’ ఫేమ్ టీవీ నటి ప్రత్యూష అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన ఆమె ప్రియుడు రాహుల్ సింగ్‌కు స్థానిక కోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 18కి కేసు విచారణను వాయిదా వేశారు. రాహుల్‌కు బెయిల్ పొడిగించాలా? అరెస్టు చేయాలా? అనే విషయాన్ని 18న కోర్టు నిర్ణయిస్తుంది.

04/12/2016 - 16:45

దిల్లీ: మే నెల రాకముందే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వేసవి ఎండలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అధికం కావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎపి, తెలంగాణ, ఒడిశా, యుపి, దిల్లీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో వడగాలుల జోరు పెరిగింది. ఒడిశాలో ఒక్కరోజులోనే 19 మంది ఎండదెబ్బకు మరణించడంతో ఆ రాష్ట్రంలో స్కూళ్లకు ఈనెల 20 వరకూ సెలవులు ప్రకటించారు.

04/12/2016 - 14:15

దిల్లీ: తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్టల్రోని లాతూరు ప్రాంతానికి రెండు నెలలపాటు రోజుకు పదిలక్షల లీటర్లను ఉచితంగా సరఫరా చేస్తామని దిల్లీ సిఎం కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కరవు ప్రాంతంలో ప్రజలను ఆదుకోవాలన్న ఆశయంతోనే నీటిని సరఫరా చేసేందుకు ముందుకొచ్చామని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Pages