S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/12/2016 - 14:03

దిల్లీ: ఇక్కడి రాష్టప్రతి భవన్‌లో మంగళవారం ఉదయం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పలువురు ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉప రాష్టప్రతి అన్సారీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. సినీ నటుడు రజనీకాంత్, పత్రికాధిపతి రామోజీరావు, వికె ఆత్రే, గిరిజాదేవి, శాంతా విశ్వనాథన్‌లకు పద్మవిభూషణ్ అవార్డులను అందజేశారు.

04/12/2016 - 12:13

ఆగ్రా: బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ ఈనెల 16న ఇక్కడి తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు వస్తున్నందున పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్‌ఐఎస్ తీవ్రవాద సంస్థకు సానుకూలంగా ఉంటున్న పాక్, ఇరాన్, ఇరాక్, టర్కీ దేశాలకు చెందిన వారికి ఇక్కడి హోటళ్లలో గదులు ఇవ్వరాదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు.

04/12/2016 - 12:13

దిల్లీ: ఇక్కడి రాష్టప్రతి భవన్‌లో మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను అందజేశారు. సినీనటుడు రజనీకాంత్, గిరిజాదేవి, పత్రికాధిపతి రామోజీరావు తదితరులకు పద్మవిభూషణ్, క్రీడాకారిణి సానియా మీర్జా, గాయకుడు ఉదిత్ నారాయణ్, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులకు పద్మభూషణ్ అవార్డులను అందజేశారు.

04/12/2016 - 12:12

ముంబయి: తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న మరట్వాడా ప్రాంతంలోని లాతూరుకు మంగళవారం ఉదయం నీటి రైలు చేరుకుంది. సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని మిరాజ్ రైల్వే స్టేషన్ నుంచి పది వ్యాగన్లలో ఏభై లక్షల లీటర్ల నీటిని తొలివిడతగా లాతూరుకు అధికారులు తరలించారు. ఏభై వ్యాగన్ల ద్వారా నీటిని తరలించాలని ప్రతిపాదించినా దూరం ఎక్కువ కావడంతో పది వ్యాగన్లకే పరిమితం చేశారు.

04/12/2016 - 12:21

ముంబయి: మహారాష్టల్రోని థానే జిల్లా భివాండీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ వస్త్ర పరిశ్రమలో నాలుగు అంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే 12 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. ఈ భవనంలో 80 మంది చిక్కుకున్నారని, ఇప్పటికే కొంతమందిని క్షేమంగా బయటకు తీసుకునివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

04/12/2016 - 04:41

తిరువనంతపురం, ఏప్రిల్ 11: ఎక్కడ చూసినా శవాలు.. పోస్ట్‌మార్టమ్ పూర్తయి పక్కనపెట్టిన మృతదేహాలను గుర్తించి తీసుకువెళ్లటానికి వచ్చిన బంధువుల రోదనలు.. పక్కన ఉన్న వార్డులకు వెళ్తే ప్రతి మంచంపైనా క్షతగాక్షత్రులే.. ఒకటి కాదు.. రెండు కాదు.. తిరువనంతపురంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో సోమవారం కనిపించిన దృశ్యాలివి.

04/12/2016 - 04:31

పాట్నా, ఏప్రిల్ 11: వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో బిజెపి వ్యతిరేక పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకురావడానికి పాటుపడతానని జనతాదళ్ (యునైటెడ్) నూతన సారథి, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం తెలిపారు. శరద్ యాదవ్ స్థానంలో జెడి(యు) అధ్యక్షుడిగా నితీశ్ ఎన్నికయిన విషయం తెలిసిందే.

04/12/2016 - 04:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఈ వర్షాకాలం అన్నదాతలకు తీపికబురే తీసుకురానుంది. రెండేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం సమృద్ధిగానే వర్షాలు కురుస్తాయని కేంద్రం వెల్లడించింది. దాదాపు రెండేళ్లపాటు మన దేశాన్ని తక్కువ వర్షపాతంతో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ ఏడాది ఉండవని సోమవారం తెలిపింది. ఈ సంవత్సరం వర్షపాతం సంతృప్తికర స్థాయిలో నమోదవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభనా కె పట్నాయక్ సోమవారం తెలిపారు.

04/12/2016 - 04:27

గౌహతి/కోల్‌కతా, ఏప్రిల్ 11: అసోం, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. అసోంలో 79 శాతం మంది, పశ్చిమ బెంగాల్‌లో 75 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల సందర్భంగా అక్కడక్కడా ఘర్షణలు, పోలీసు కాల్పులు చోటుచేసుకోవడంతో ఒక వృద్ధ ఓటరు మృతిచెందాడు. అసోంలో సోమవారం రెండో విడతగా 61 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు.

04/12/2016 - 04:23

హైదరాబాద్, ఏప్రిల్ 11: సోషల్ వెల్ఫేర్ చైర్‌పర్సన్‌గా రాగం సుజాతను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాగం సుజాత గతంలో రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు.

Pages