S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/02/2016 - 19:08

హైదరాబాద్:్ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ ప్రాంతంలో 16మంది ఆదివాసీలను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. ఇన్‌ఫార్మర్లనే నెపంతో వారి ప్రాణాలు తీశారు. ఈ దారుణాన్ని కళ్లారా చూడాలని, ఇదేం న్యాయమో చెప్పాలని మానవహక్కుల సంఘానికి ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి కల్లూరి సవాల్ విసిరారు.

03/02/2016 - 18:30

న్యూదిల్లి:ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజల మాట వినాలని, ప్రజాప్రతినిధులు, మంత్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని, అధికారవర్గాల సూచనలు అర్థం చేసుకోవాలని, కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్‌గాంధీ హితవు చెప్పారు. అంతే తప్ప సొంత నిర్ణయాలతో దేశాన్ని నడపలేరని ఆయన అన్నారు. లోక్‌సభలో ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఉద్యోగాల కల్పన హామీ వట్టిపోయిందని విమర్శించారు.

03/02/2016 - 17:04

న్యూదిల్లి:ఉద్యోగుల ప్రావిండెంట్ ఫండ్ విత్‌డ్రా చేసుకున్నప్పుడు ఆ మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాలన్న నిర్ణయం దేశంలో బీమారంగాన్ని ప్రోత్సహించేందుకేనని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లి స్పష్టం చేశారు. న్యూదిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

03/02/2016 - 16:21

ఇంఫాల్:మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మంగళవారం మరోసారి నిరశన దీక్ష ప్రారంభించిన సామాజిక కార్యకర్త ఇనోం షర్మిలను బుధవారంనాడు మళ్లీ పోలీసులు అరెస్టు చేశారు. గత పదిహేనేళ్లుగా ఆమె ఇలా నిరశన దీక్షకు దిగడం, పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయడం మామూలే. కోర్టు తీర్పు మేరకు ఆమె సోమవారం విడుదలవగా మంగళవారం దీక్ష ప్రారంభించారు.

03/02/2016 - 16:22

న్యూదిల్లి:ఎయిర్‌సెల్-మాక్సి ఒప్పందం విషయంలో మాజీ ఆర్థికమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఆవకతవకలకు పాల్పడ్డారన్న వివాదంపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లి స్పందించారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు ఫైల్ అయిందని, దోషులు ఎంతటివారైనా ఉపేక్షించబోమని, ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, కోర్టు నిర్ణయమే తరువాయని జైట్లి అన్నారు.

03/02/2016 - 07:42

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాలకు బడ్జెట్‌లో ఇచ్చిన ఊతాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌డిఎ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రైతులకు చేరువై వారిని గరిష్ఠస్థాయిలో పంటల బీమా పథకం పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రతి ఎంపీ కూడా ఈ లక్ష్యాన్ని ఓ సవాలుగా తీసుకోవాలని, తమ నియోజకవర్గాల పరిధిలో విస్తృత స్థాయి ఫలితాలను సాధించాలని మోదీ స్పష్టం చేశారు.

03/02/2016 - 07:39

న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు సభాహక్కుల తీర్మానాలు ఇచ్చారు. మంగళవారం దీనిపై ఇరుపక్షాల నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

03/02/2016 - 07:38

న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనాన్ని కలిగించి జెఎన్‌యు విద్యార్థుల అరెస్టుకు దారితీసిన కార్యక్రమ నిర్వహణకు అయిన ఖర్చు కేవలం వంద రూపాయలేనని విద్యార్థులు స్పష్టం చేశారు.

03/02/2016 - 07:35

ఇంఫాల్: సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఆఫ్‌స్పా)ను ఉపసంహరించాలంటూ అలుపెరుగని పోరాటం చేస్తున్న ఇరోమ్ షర్మిలా చాను తన దీక్షను మళ్లీ ప్రారంభించారు. ఆఫ్‌స్పా రద్దుకు మణిపూర్‌కు చెందిన హక్కుల కార్యకర్త షర్మిల 15 ఏళ్లనుంచి నిరాహారదీక్ష చేస్తున్న విషయం విదితమే. ఆత్మహత్య కేసులో కోర్టు నిర్దోషిగా నిర్ధారించడంతో సోమవారం జ్యుడీషియల్ కస్టడీనుంచి షర్మిలకు విముక్తి లభించింది.

03/02/2016 - 06:11

న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రాయల్స్‌పై నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం మంగళవారం నివృత్తి చేస్తూ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) విత్‌డ్రాయల్స్‌పై ఇకపై కూడా పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని, ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఉద్యోగి భవిష్య నిధి (ఇపిఎఫ్)ఖాతాలో జమయ్యే మొత్తంపై వచ్చే వడ్డీలో అరవై శాతానికి మాత్రమే పన్ను విధించడం జరుగుతుందని తెలియజేసింది.

Pages