S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/03/2016 - 05:24

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన మూలంగా ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి రక్షించాలని అనకాపల్లి లోకసభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు. ఆయన బుధవారం లోకసభ జీరో అవర్‌లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు వీలున్నంత త్వరగా ప్రత్యేక హోదా ఇస్తే విభజన గాయాల నుండి కొంతైనా ఉపశమనం కలుగుతుందని చెప్పారు.

03/03/2016 - 04:45

న్యూఢిల్లీ: ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర విద్యుత్, బొగ్గు, పునరుత్పత్తి ఇంధన వనరుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ఉండేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్రం అన్ని విధాలుగా సహాయం చేయడంతో విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారిందన్నారు.

03/03/2016 - 04:20

న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఇచ్చిన సభా హక్కుల తీర్మానాన్ని అడ్డం పట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడంలో కాంగ్రెస్ నాయకత్వంలోని మిత్రపక్షాలు విఫలం కాగా మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీక్ చిదంబరంపై 193 నోటీసు కింద చర్చ జరిపి కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టటంలో అధికార బిజెపి విజయం సాధించింది.

03/03/2016 - 04:20

న్యూఢిల్లీ: ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో అఫిడవిట్‌ను ఎందుకు ఎందుకు మార్చారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నిచారు. వెంకయ్యనాయుడు బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ ఇషత్ జహాన్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని ఐబి రిపోర్టును, అఫిడవిట్‌ను మార్పించారని, హోంశాఖ కార్యదర్శి జికె పిళ్లై కూడా అఫిడవిట్ మార్చింది వాస్తవమని తెలిపారన్నారు.

03/03/2016 - 04:02

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరుపట్ల స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర అవహనానికి గురయ్యారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షలకు చెందిన సభ్యులు బుధవారం లోక్‌సభ పోడియం వద్దకు వచ్చి నినాదాలిస్తూ గొడవ చేయటంతోపాటు, తనను విమర్శించటం పట్ల సుమిత్రా మహాజన్ జీరో అవర్‌లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

03/03/2016 - 04:01

న్యూఢిల్లీ: ప్రజాభిప్రాయానికి విలువివ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఇష్టానుసారం పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోశారు. దేశంపైకి పాక్ ఉగ్రవాదులను పంపుతుంటే, చెప్పాపెట్టకుండా నరేంద్ర మోదీ లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో తేనీటి విందు చేసుకోవడాన్ని తప్పుపట్టారు.

03/03/2016 - 03:59

న్యూఢిల్లీ: రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శాలువా ఆమె పర్సు జిప్‌లో ఇరుక్కుపోవడంతో దాన్ని తీయడానికి ఆమె ఇబ్బంది పడాల్సి వచ్చింది. తమ నాయకురాలు ఇబ్బంది పడుతుండడాన్ని చూసిన మల్లికార్జున ఖర్గే సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఆయన కూడా శాలువాను బైటికి తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

03/03/2016 - 03:59

న్యూఢిల్లీ: ముంబయి డాన్స్‌బార్ల యజమానులకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. డాన్స్‌బార్ల నుంచి సిసిటివి ఫుటేజ్ పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనను కోర్టు తిరస్కరించింది. వీటికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు సవరించిన సుప్రీం కోర్టు డాన్స్ బార్లకు పది రోజుల్లో లైసెన్స్‌లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

03/02/2016 - 23:56

జలాలాబాద్/ న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంపై బుధవారం మానవ బాంబులు, భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అఫ్గాన్ జాతీయ భద్రతా దళానికి (ఎఎన్‌పి)చెందిన జవాను సహా 9 మందిని కాల్చి చంపడంతో పాటు కార్యాలయానికి తీవ్రంగా నష్టం కలిగించారు. కాగా, 2007నుంచి జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది నాలుగోసారి.

03/02/2016 - 23:53

న్యూఢిల్లీ: దేశ ద్రోహం కేసులో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌కు ఆర్నెల్ల పాటు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు ‘వర్శిటీ ప్రాంగణంలో చేసిన నినాదాలను జాతి వ్యతిరేకమైనవి’ పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ఆ నినాదాలు దేశ సమగ్రతను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను ఉదహరించింది.

Pages