S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/14/2015 - 18:20

న్యూఢిల్లీ : కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారితో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి భేటీ అయ్యారు. జీహెచ్‌ఎంసీలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆధార్ కార్డు అనుసంధానంతో ఓట్లు తొలగించారని ఆయన మీడియాతో చెప్పారు.

12/14/2015 - 16:05

న్యూఢిల్లీ : శాంతి స్థాపనే లక్ష్యంగా దాయాది దేశంతో సంబంధాలపై దృష్టి పెట్టినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. లోకసభలో ఇవాళ ఆమె మాట్లాడుతూ పాకిస్థాన్‌తో సహకార సంబంధాలు కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

12/14/2015 - 15:55

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ కాంగ్రెస్‌ సభ్యులు పార్లమెంటులో ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ... మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ తన పనితీరును మార్చుకోవాలని రాహుల్‌ సూచించారు.

12/14/2015 - 15:54

న్యూఢిల్లీ : షకూర్‌ బస్తీలో అధికారులు రైల్వే ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ ప్రారంభించడానికి ముందే పాప చనిపోయిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు పార్లమెంట్‌లో వెల్లడించారు. పశ్చిమ ఢిల్లీలోని షకూర్‌ బస్తీలో నిన్న రైల్వే స్థలాల్లో ఉన్న ఆక్రమణల తొలగింపులో భాగంగా దాదాపు 1200 ఇళ్లను అధికారులు తొలగించారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో ఆరు నెలల పసిపాప రుకైయా మరణించిన సంగతి తెలిసిందే.

12/14/2015 - 15:53

వారణాసి : ఆర్టిస్ట్ హేమా మర్డర్ కేసులో పోలీసులు కీలక నిందితున్ని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సాధూ రాజ్‌బర్‌ను ఆ రాష్ట్ర స్పెషల్ పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం రాజ్‌బర్ తనను కలవాలంటూ హేమాకు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

12/14/2015 - 13:26

న్యూఢిల్లీ : షకూర్ బస్తీలో పర్యటిస్తూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆప్ ఎంపీల ఆందోళనపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. రైల్వే శాఖ కేంద్రం పరిధిలో ఉందనే విషయం కూడా రహుల్‌కు పార్టీవారు నేర్పించినట్లు లేదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

12/14/2015 - 13:25

ఢిల్లీ : ఢిల్లీలోని షకూర్ బస్తీలో రైల్వే శాఖ 1200 ఇళ్లను తొలగించటం వల్ల ఆరునెలల పసిపాప మృతిచెందిన విషయం విదితమే. దీనిపై రాజకీయ దుమారం నెలకొన్న నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం ఢిల్లీలోని షకూర్ బస్తీలో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మేజీస్ట్రీరియల్ విచారణకు ఆదేశించారు. రైల్వే శాఖ చర్యలను నిరసిస్తూ ఆప్ ఎంపీలు ఆందోళన చేశారు.

12/14/2015 - 13:24

న్యూఢిల్లీ : విపక్షాల ఆందోళనతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పాక్ విదేశీ పర్యటన వివరాలను సభ ముందు ఉంచేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ విపక్షాల ఆందోళన కొనసాగటంతో సభను వాయిదా వేశారు.

12/14/2015 - 11:53

చెన్నై: భారీ వర్షాల అనంతరం దాదాపు నెల రోజుల విరామం తర్వాత చెన్నైలో సోమవారం విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. సెలవుల కారణంగా సిలబస్ పూర్తి కాకపోవడంతో అదనపు పనిగంటలతో తరగతులు నిర్వహిస్తామని విద్యా సంస్థలు ప్రకటించాయి. కాగా, భారీ వర్షాలతో ధ్వంసమైన స్కూళ్లను ప్రారంభించేందుకు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

12/14/2015 - 11:48

చెన్నై: ప్రఖ్యాత సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి సోమవారం తెల్లవారుజామున ఇక్కడ గుండెపోటుతో మరణించారు. ‘దేవత’ సినిమాతో సంభాషణల రచయితగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలువురు అగ్ర నాయకులు నటించిన హిట్ సినిమాలకు మాటలు అందించారు. ‘దాదర్ ఎక్స్‌ప్రెస్’ ‘చైతన్య’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.

Pages