S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/13/2015 - 03:30

జైట్లీ ప్రోద్బలంతోనే ఐటి నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసుపై సిబాల్

12/13/2015 - 03:29

వారణాసి, డిసెంబర్ 12: ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే వారణాసి రాక సందర్భంగా కనీవినీ ఎరగని భద్రత కల్పించారు. నగర శివార్లలోని బాబత్‌పూర్ విమానాశ్రయం వద్ద ఇరువురు దేశాధినేతలకు ఘనస్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కేంద్ర మంత్రులు మనోజ్ శర్మ, కల్‌రాజ్ మిశ్రా ఇరువురు ప్రధానులకు ఘనస్వాగతం పలికారు.

12/13/2015 - 03:28

హెరాల్డ్ కేసుకు, జిఎస్‌టి బిల్లుకు సంబంధం లేదు రాహుల్ గాంధీ స్పష్టీకరణ

12/12/2015 - 23:49

అంతర్మథనంలో అధికార పక్షం * సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి

12/12/2015 - 16:41

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే భేటీ అయ్యారు. ఉదయం ఆయన రాష్టపతి భవన్‌కు వెళ్లి ఆయనతో చర్చించారు. భారత్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం షింజో అబే నిన్న దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే.

12/12/2015 - 14:14

కర్నాటక: బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో అదుపుతప్పిన కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు.

12/12/2015 - 13:54

ఢిల్లీ: ‌ఢిల్లీలో మైనర్‌బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని దిచావన్‌ ప్రాంతంలో 14ఏళ్ల మైనర్‌ బాలిక పాఠశాలకు వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు కారులో వచ్చి అపహరించారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

12/12/2015 - 13:25

న్యూ‌ఢిల్లీః జపాన్‌ సహకారంతో ముంబాయి- అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శనివారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో జపాన్‌ ప్రధాని షింజోఅబేతో మోదీ భేటీ అయ్యారు. అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య కుదురిన పలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు.

12/12/2015 - 13:19

అగర్తల : ఇటీవల త్రిపురలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అగర్తల మున్సిపాలిటీ కార్పొరేషన్‌ రెండు స్థానాల్లో సిపిఎం గెలుపొందింది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ త్రిపురలో జిరానియా నగర పంచాయతీని అధికార కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నేతృత్వంలోని వామపక్ష కూటమి ఇప్పటికే కైవసం చేసుకోగా.. అనేక స్థానాల్లో లెఫ్ట్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

12/12/2015 - 06:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఓవైపు పర్యావరణానికి హాని చేయని విద్యుత్‌కు కట్టుబడి ఉంటూనే మరోవైపు తన అభివృద్ధి లక్ష్యాలను సాధించుకోవడం అనేది భారత దేశానికి పెద్ద బాధ్యతే కాక సవాలు కూడానని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ‘ప్రపంచ జనాభాలో 17 శాతం భారత్‌లో ఉంది. అయినప్పటికీ దాని ఇంధన, విద్యుత్ వినియోగం ప్రపంచ వినియోగంలో దాదాపు అయిదు శాతంగా మాత్రమే ఉంది’ అని ఆయన అన్నారు.

Pages