S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/14/2015 - 08:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసి పధ్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర పార్లమెంటు సభ్యులు ఆ దాడిలో మృతిచెందిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.

12/14/2015 - 08:21

న్యూఢిల్లీ / ప్యారిస్ / వాషింగ్టన్, డిసెంబర్ 13: పుడమి వేడిని తగ్గించి భూతలాన్ని ఆవాస యోగ్యంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్యారిస్‌లో కుదిరిన పర్యావరణ ఒప్పందం సమన్యాయానికి పట్టం గట్టిందని ప్రపంచ దేశాలు శ్లాఘించాయి. ఈ చారిత్రక ఒప్పందంలో విజేతలు, పరాజితులు ఎవరూ లేరని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

12/14/2015 - 08:19

ముంబయి, డిసెంబర్ 13: విషాద చిత్రాలకు పెట్టింది పేరైన అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (93) పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నాడు. దీర్ఘకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ కుమార్‌కు ముంబయి శివారు బాంద్రాలోని ఆయన నివాసంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఈ అవార్డును ప్రదానం చేశారు.

12/14/2015 - 08:36

జైపూర్, డిసెంబర్ 13: దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచడానికి, ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఉగ్రవాదం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించని (జీరో టాలరెన్స్) విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోందని పేర్కొన్నారు.

12/14/2015 - 08:18

చెన్నై, డిసెంబర్ 13: గత వారం కురిసిన కుండపోత వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి రూ.4,500 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి అందజేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఆదివారం కోరింది.

12/14/2015 - 08:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: నేషనల్ హెరాల్డ్ కేసుపై వివాదం తీవ్రమైన తరుణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆ పార్టీ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు పి.చిదంబరం, అశ్వినీకుమార్ ఆదివారం బాసటగా నిలిచారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసిన ఆరోపణలు, పరోక్ష నిందలు పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా పన్నినవేనని వారు పేర్కొన్నారు.

12/14/2015 - 08:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: కేరళలోని కొళ్లంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరువుతున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాకూడదని కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీని కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.

12/14/2015 - 06:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: మరోసారి దేశంలోని పలు రాష్ట్రాలపై ఉగ్రవాదులు పంజా విసిరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ అనేక కోణాల నుంచి సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా ఇంటిలిజెన్స్ సంస్థలు ఈమేరకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ సహా మొత్తం 8 రాష్ట్రాలపై ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదం ఉందంటూ దేశవ్యాప్త అలెర్ట్ ప్రకటించాయి.

12/14/2015 - 06:39

కోల్‌కతా, డిసెంబర్ 13: భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయమని, ప్రతి వ్యక్తి ఎలాంటి భయాలు, అనుమానాలు లేకుండా జీవించినప్పుడే సామాజిక వ్యవస్థ బలంగా ఉంటుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆదివారం ‘డయోసిస్ ఆఫ్ కలకత్తా’ ద్విశతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్టప్రతి మాట్లాడుతూ, ప్రతి మతం కూడా మానవతా విలువలనే బోధిస్తుందన్నారు.

12/14/2015 - 06:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: తెలంగాణ, ఆంధ్ర, రాజస్థాన్‌లలో దాదాపు 300 కోట్ల పెట్టుబడితో సెల్‌ఫోన్లను ఉత్పత్తి చేయాలని మైక్రోమాక్స్ సంకల్పిస్తోంది. చైనా నుంచి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతోనే దేశీయంగా వీటి ఉత్పత్తులను చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది.

Pages