S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/02/2019 - 02:23

భోపాల్, జనవరి 1: బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై మోపిన రాజకీయ కేసులను ఎత్తివేయనున్నట్లు మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. తమపై ఉన్న కేసులను ఎత్తివేయకుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలకు మద్దతుపై పునరాలోచిస్తామని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అల్టిమేటం ఇచ్చిన మరుసటి రోజే ఎంపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

01/02/2019 - 02:22

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటర్యూ అబద్ధాల పుట్ట అని, మోదీ నిష్క్రమణకు కౌంట్ డౌన్ మొదలైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మోదీ పాత విషయాలనే మళ్లీ నెమరువేశారని, సొంత డబ్బాకొట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న భావన మోదీలో కనపడలేదన్నారు.

01/02/2019 - 00:52

న్యూఢిల్లీ, జనవరి 1: జమ్మూ-కశ్మీర్‌లోని ఉరి సైనిక శిబిరంపై చేసిన దాడికి ప్రతీకారంగానే పాకిస్తాన్‌పై మెరుపుదాడి చేశామని, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతమాత్రం వాడుకోలేదని నరేంద్ర మోదీ తెలిపారు. దీనికోసం కొన్నినెలల పాటు ఏర్పాట్లు చేశామని.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు.

01/02/2019 - 00:52

న్యూఢిల్లీ, జనవరి 1: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసినట్లే 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ మహాకూటమికి ఓటమి తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నాలుగున్నర సంవత్సరాలుగా దేశాన్ని నిజాయితీ, చిత్తశుద్ధితో పరిపాలించాను.. ఇస్లామిక్ ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని ఉరి సైనిక క్షేత్రంలో మన సైనికులపై చేసిన దాడికి ప్రతీకారంగానే మెరుపు దాడి జరిగింది..

01/02/2019 - 00:39

చెన్నై, జనవరి 1: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ట్వీట్ ద్వారా తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియచేస్తూ, ప్రజల మద్దతుతో తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. బెంగళూరుకు చెందిన ప్రకాశ్‌రాజ్ చాలా రోజుల నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది.

01/01/2019 - 17:06

న్యూఢిల్లీ: మహాకూటమికి తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే బీటలు పడుతున్నాయని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ విమర్శలు కురిపించారు. ప్రతి పక్ష నేతలది విఫలమైన ఆలోచనగా ఆయన అభివర్ణించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ కలిసి తెరాసను ఓడించాలనుకుని విఫలమయ్యాయి’ అని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఫలితమే లోక్‌సభ ఎన్నికల్లోనూ వస్తుందని ఆయన అన్నారు.

01/01/2019 - 16:50

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. చౌకీదార్ దొంగల కోసం బ్యాంకులను దోచిపెట్టారని ట్వీట్ చేశారు. దాదాపు రూ.41,167 కోట్లు తన స్నేహితుల కోసం దోచిపెట్టారని అన్నారు.

01/01/2019 - 16:50

సిక్కిం: మంచులో చిక్కుకుపోయిన ప్రయాణీకులను కాపాడటం కోసం సైనికులు పాటు పడటమే కాదు వారిని తమ శిబిరాలకు తరలించి వారు మాత్రం మంచులో నిద్రించిన సంఘటన ఇది. నాథులాం నుంచి సుమోంగో ప్రాంతానికి వెళుతున్న దాదాపు 2800 మంది ప్రయాణీకులు విపరీతంగా మంచు కురవటంతో చిక్కుకుపోయారు. వారిని సైనికులు రక్షించి శిబిరాలకు తరలించారు. అక్కడ వారికి తమ మంచాలను ఇచ్చి సైనికులు మంచులో నిద్రించారు.

01/01/2019 - 16:49

గోవా: కొన్ని నెలల తరువాత గోవా సీఎం పారికర్ ఈరోజు సెక్రటేరియట్‌కు వచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన సెక్రటేరియట్‌కు వచ్చి విధుల్లో పాల్గొన్నారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆమెరికాలో చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత ఢిల్లీ, ముంబయిలలో సైతం చికత్స చేయించుకున్నారు.

01/01/2019 - 16:48

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార శాఖ కమిషన్ ప్రధాన కమీషనర్‌గా సుధీర్ భార్గవ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాధ్ సింగ్, అరుణ్ జైట్లీ హాజరయ్యారు.

Pages