S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/01/2019 - 10:37

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అర్థరాత్రి వరకు శివారు ప్రాంతాలకు యువత తరలివెళ్లి ఆటపాటలతో గడిపారు. పబ్‌లు, క్లబ్బులలో ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాల్చారు. ఆత్మీయ ఆలింగనాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.

01/01/2019 - 05:40

న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై బుధవారం జరిగే చర్చకు తాము సిద్ధమేనని, లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ‘మంత్రి జైట్లీ మనకు ఈ విషయంలో సవాల్ విసిరారు. జనవరి 2న జరిగే చర్చకు మేము సిద్ధమే. టైం నిర్ణయించండి’ అని సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఖర్గే పేర్కొన్నారు.

01/01/2019 - 05:38

లక్నో, డిసెంబర్ 31: యూపీఏ హయాంలో జరిగిన అగస్టా హెలికాప్టర్‌ల కొనుగోలు కుంభకోణంలో కాంగ్రెస్ నేతలకు రూ.150 కోట్లు లంచంగా అందిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఆ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వార్థం కోసం దేశరక్షణను, పౌరుల భద్రతను పణంగా పెట్టిందని విమర్శించారు.

01/01/2019 - 05:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: నౌక దళం సేవల నుంచి ఉపసంహరించిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్ ఆంధ్రప్రదేశ్ చేజారిపోయింది. విరాట్ తమ రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు.

01/01/2019 - 05:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా సుధీర్ భార్గవను కేంద్రం నియమించింది. ఆయనతోపాటు నలుగురు కమిషనర్లను కూడా నియమించారు. భార్గవ ప్రస్తుతం ఇన్ఫర్మేషన్‌ను కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీనితో ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో సభ్యుల సంఖ్య 11కు చేరింది. ఈ నియామకాలకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఆమోదముద్ర వేశారు.

01/01/2019 - 05:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశ వ్యాప్తంగా రైతాంగంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి సత్వర ప్రాతిపదికన మేలు కలిగించేందుకు మూడు అంశాలను కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్షోభంలో పడ్డ రైతాంగాన్ని ఆదుకోవడంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరి మద్దతును విశేషంగా చూరగొనే లక్ష్యంతోనే ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది.

01/01/2019 - 06:02

న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాది మంది ముస్లిం మహిళల ప్రయోజనాలు పరిరక్షించేందుకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు ప్రతిపక్షం మెజారిటీలో ఉన్న రాజ్యసభలో చుక్కెదురైంది. ట్రిపుల్ తలాక్ బిల్లును చేపట్టి చర్చ జరపకుండానే రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపాదించేందుకు కూడా ప్రతిపక్షం సభ్యులు ససేమిరా అంగీకరించలేదు.

01/01/2019 - 05:32

బెంగళూరు, డిసెంబర్ 31: కర్నాటకలో అధికారంలో ఉన్న జేడీ (ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి తమ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప ఖండించారు.

01/01/2019 - 05:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రీనివాస్ సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామంటూ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోరా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

01/01/2019 - 05:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: రాజ్యసభలో కేంద్రం ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ బిల్లులోని కొన్ని అంశాలకు సవరణలు చేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సూచించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి మాట్లాడుతూ తలాక్ బిల్లు లోపభూయిష్టంగా ఉందని, ఆ బిల్లును సవరించాల్సిందేనని తెగేసి చెప్పారు.

Pages