S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/21/2018 - 17:18

చెన్నై: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. జనసేన పార్టీ విధానాలను పక్క రాష్టమ్రైన తమిళనాడుకు వివరించేందుకు వచ్చినట్లు చెప్పారు. తమిళంలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. విభజన సమయంలో సంభవించిన పరిణామాలను వివరించారు. చంద్రబాబుతో ప్రయాణం ప్రమాదకరమని, ఏమీ ఆశించకుండానే ఆయనతో ప్రయాణిస్తే రాష్ట్రానికి జరిగింది శూన్యమని అన్నారు.

11/21/2018 - 12:30

కోర్బా:చత్తీస్‌గఢ్‌లోని బాల్కోనగర్‌లో బీజేపీ యువ మోర్చాకు చెందిన మండల అధ్యక్షుడు కుమార్ చంద్ర (37) తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. బాల్కోనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని భరదపారాలో ఉంటున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

11/21/2018 - 12:28

ఢిల్లీ: మరో ఆప్ నేతపై దాడి జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై దాడి సంఘటన మరువకముందే ఆమ్ ఆద్మీకి చెందిన పార్టీ సీనియర్ నేత సురేశ్ శర్మపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మంగళవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సురేశ్ ఫర్నిచర్ దుకాణానికి వచ్చారు. అనంతరం వారు దగ్గర నుంచి సురేశ్ శర్మపై కాల్పులు జరిపి పరారయ్యారు. సురేశ్ పరిస్థితి నిలకడగా ఉంది.

11/21/2018 - 12:27

చండీఘర్: 2015లో జరిగిన మతపరమైన అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట సినీ నటుడు అక్షయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ కేసులో అక్షయ్‌కుమార్‌కు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, డిప్యూటీ సీఎం సుఖబీర్ సింగ్‌కు సమన్లు జారీ చేసిన విషయం విదితమే.

11/21/2018 - 12:27

హిసార్: బ్రిడ్జిపై నిద్రిస్తున్న కూలీలపై నుంచి కారు దూసుకువెళ్లటంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో తొమ్మిది మంది వ్యక్తులు గాయపడ్డారు. హర్యానాలోని హిసార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో కూలీలంతా బ్రిడ్జి పనులు చేసి అక్కడే నిద్రిస్తున్నారు. వేగంగా వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొని బ్రిడ్జిపై నిద్రిస్తున్న కూలీలపైకి వెళ్లింది.

11/21/2018 - 12:26

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన ఎంపీ కొండా విశే్వశ్వరెడ్డి బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతో కలిసి ఆయన రాహుల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు.

11/21/2018 - 03:55

జాబువా/రేవా: దేశాన్ని అవినీతి ఊబి నుంచి రక్షించేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు పెద్ద నోట్లరద్దు అనే కఠినమైన వైద్య విధానాన్ని అమలు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో అవినీతి సొమ్ము చలామణిని అరికట్టి, బ్యాంకుల పరిధిలోకి ఈ సొమ్మును తెచ్చామని ఆయన చెప్పారు.

11/21/2018 - 02:15

న్యూఢిల్లీ, నవంబర్ 20: పాలల్లో కల్తీని స్మార్ట్ ఫోన్ ద్వారా కనిపెట్టే సరికొత్త విధానం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఒక ఇండికేటర్ పేపర్‌ను వినియోగించడం ద్వారా ఆ పేపర్ రంగుల్లోకి మారితే పాలల్లో వాతగుణాలు (కల్తీ) ఉన్నట్లు నిర్ధారించేలా ఈ విధానం రూపొందించారు.

11/21/2018 - 02:06

కటక్, నవంబర్ 20: ఒరిస్సాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 49 మంది గాయపడ్డారు. జగత్‌పూర్ సమీపంలోని ఓ వంతెనపై వెళుతున్న బస్సు మహానదిలో దొర్లి పడడంతో ఈ విషాద ఘటన జరిగింది. తాల్చేరు నుంచి కటక్ వస్తున్న ఈ బస్సు బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొని 30 అడుగుల పైనుంచి పడిపోయిందని పోలీసులు తెలిపారు.

11/21/2018 - 02:04

ఐజ్వాల్, నవంబర్ 20: స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్, సీబీఐ లాంటి సంస్థల పనితీరులో మోదీ ప్రభుత్వం జోక్యం చేసుకుని, పెత్తనం చెలాయిస్తూ వాటి విధి నిర్వహణలో ఆటంకాలు సృష్టిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న ప్రధాని మోదీ దానిని ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు.

Pages