S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/14/2018 - 16:28

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ తీర్పుపై దాదాపు 49 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం నాడు కూడా మరో పిటిషన్ దాఖలు కావటంతో సీజీఐ జస్టిస్ రింజన్ గొగయ్ ఈ పిటిషన్‌ను పరిశీలించారు. ఈ రివ్యూ పిటిషన్లపై బహిరంగ విచారణ జనవరి 22న చేపడతామని అప్పటి వరకు ఆగాల్సిందిగా ఆయన కోరారు.

11/14/2018 - 13:28

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో మావోయిస్టుల దుశ్చర్యలు కొనసాగుతున్నాయ. సరిహద్దు భ్రదతా సిబ్బంది లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీని పేల్చివేశారు. ఈ ఘటనలో ఆరుగురు భ ద్రతా సిబ్బంది గాయపడ్డారు. భీజాపూర్లోని ఘట్టి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

11/14/2018 - 13:03

వాషింగ్టిన్: అమెరికా శే్వతసౌధంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. భారత్‌తో వాణిజ్య వ్యాపార సంబంధాలను ఏర్పరచుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భారతీయ అమెరికన్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

11/14/2018 - 12:55

చెన్నై: తుపాను తీరం దాటే సమయంలో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నది. 10 జాతీయ విపత్తు బృందాలను సిద్ధం చేసింది. 30,500 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని, తూత్తుకుడి వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

11/14/2018 - 12:54

చెన్నై: మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ‘గజ’ తీవ్ర తుపానుగా మారనున్నది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారి రేపు మధ్యాహ్నాం పంబన్-కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది చెన్నైకు తూర్పున 570 కిలోమీటర్లు, నాగపట్నానిక ఈశాన్యంగా 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

11/14/2018 - 07:03

ఎన్నికల భూమి....
============

11/14/2018 - 06:51

ఎన్నికల భూమి....
============

11/14/2018 - 05:46

న్యూఢిల్లీ, నవంబర్ 13: జనగామ తప్ప మరో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసే ప్రసక్తే లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. లక్ష్మయ్య మంగళవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినాయకత్వం విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవటం దురదృష్టకరమన్నారు. ఇందుకు దారితీసిన పరిస్థితుల గురించి వాకబు చేసేందుకు పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీకి వచ్చారు.

11/14/2018 - 05:44

న్యూఢిల్లీ, నవంబర్ 13: శాసనసభకు పోటీ చేసేందుకు టికెట్లు లభించని వారికి అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు ఇస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా తెలిపారు. కుంతియా మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని అన్నారు.

11/14/2018 - 02:33

బలోడ బజార్, మహాసముంద్, నవంబర్ 13: కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా మన ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు పేరుతో పేదల జేబుల నుంచి కొట్టేసిన డబ్బును నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా లాంటి పెద్ద పారిశ్రామికవేత్తల చేతుల్లో పోసారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు.

Pages