S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/13/2018 - 13:34

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోని అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ వేసిన రివ్యూ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరుగనున్నది. ఈ కేసును పునఃసమీక్షించాలని కోరుతూ దాదాపు 48 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు జరుగుతున్న విషయం విదితమే. ఆలయంలోకి మహిళలు రాకుండా అడ్డుకుంటున్నారు.

11/13/2018 - 13:31

న్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌కి సంబంధించి తాను ఎలాంటి అబద్ధమాడలేదు. ఇకపై ఆడను అని డసాల్డ్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ మరోసారి స్పష్టంచేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాలు రావటం సహజమేనని, తమ కంపెనీ ఇండియాతో కుదుర్చుకున్న తొలి ఒప్పందం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అన్నారు.

11/13/2018 - 12:37

న్యూఢిల్లీ: ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మృతిచెందిన కేంద్రమంత్రి అనంతకుమార్ అంత్యక్రియలు నేడు బెంగళూరులోని చామరాజ్ స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరుకానున్నారు.

11/13/2018 - 03:43

వారణాసి: వారణాసి పుణ్యక్షేత్రం సర్వతోముఖ రీతిలో అభివృద్ధిని సంతరించుకుంటోదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం నాడిక్కడ 2413 కోట్ల రూపాయలతో చేపట్ట తలపెట్టిన హైవేలు, ఇన్‌లాండ్ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ అభివృద్ధి ఆగిపోయిందని, నిజానికి ఇది దశాబ్దాల క్రితమే జరిగి ఉండాల్సిందని ఆయన అన్నారు.

11/13/2018 - 03:15

న్యూఢిల్లీ, నవంబర్ 12: అనేక తర్జనభర్జనల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ 65 మందితో తొలిజాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలు

11/13/2018 - 02:22

చిత్రం..పెద్ద నోట్ల రద్దు కారణంగా అభివృద్ధి కుంటుపడిందని, వృద్ధి రేటు ఆశాజనకంగా లేదని ఆరోపిస్తూ లక్నోలోని
గోమతీ నగర్ ఆర్‌బీఐ కార్యాలయం ముందు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.

11/13/2018 - 02:17

సూళ్లూరుపేట, నవంబర్ 12: కమ్యూనికేషన్ రంగంలో నూతన పుంతలు తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ సమాచార ఉపగ్రహ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్ని శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు.

11/13/2018 - 02:01

శబరిమల (కేరళ), నవంబర్ 12: అన్ని వయసుల మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చునని ఒకవైపు సుప్రీం కోర్టు ఉత్తర్వులు, మరోవైపు శబరిమల యాత్ర ప్రారంభం కావడానికి కేవలం ఆరు రోజులే ఉండటం కేరళ ప్రభుత్వం, శబరిమల ఆలయ నిర్వాహకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేలాదిమందిగా తరలివచ్చే అయ్యప్ప భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడం వారికి పెనుసవాల్‌గా మారింది.

11/13/2018 - 01:58

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలులో రక్షణపరమైన విధానాలన్నీ కచ్చితంగా పాటించామని, దాని తర్వాతే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) దానిని ఆమోదించిందని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు జెట్ల కొనుగోలుకు చేపట్టిన వివిధ విధానాలు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని కేంద్రం కోర్టుకు సమర్పించింది.

11/13/2018 - 01:56

సోమవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని
కలుసుకుని మాట్లాడుతున్న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ

Pages