S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/12/2018 - 01:41

న్యూఢిల్లీ, నవంబర్ 11: పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు 59 నిమిషాల్లో ఒక కోటి రూపాయల రుణం మంజూరు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారని, ఇదంతా పెద్దస్కాం అని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఇది కేవలం దోపీడీచేసే సంస్థలకు ఉపయోగపడే స్కీం అని కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్ అన్నారు. ఈ స్కీంపై న్యాయమూర్తి చేత దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు.

11/12/2018 - 01:40

న్యూఢిల్లీ, నవంబర్ 11: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ప్రకటనల రూపంలో పత్రికల్లో ప్రచురించాలని, టీవీల్లో ప్రసారం చేయాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఒక వేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే పెనాల్టీలు విధిస్తామని, కోర్టు ధిక్కారం కింద కేసును ఎదుర్కొనాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. మీడియాలో కనీసం మూడు సార్లు ప్రచురించాలని, ప్రసారం చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది.

11/12/2018 - 01:29

మధుర, నవంబర్ 11: ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రామశంకర్ కథేరియా ధీమా వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథకాలు, అందరూ మెచ్చే పనితీరును చూస్తే ఆయన పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘన విజయం పొందడం ఖాయమని ఆయన అన్నారు.

11/12/2018 - 01:28

ఫైజాబాద్, నవంబర్ 11: ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా మార్చాలన్న నిర్ణయంపై భిద్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి స్థానికుల్లో అనేకులు ఈ విషయంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ కారణాలతో తీసుకున్న నిర్ణయమని, ఇందువల్ల చారిత్రాత్మకమైన ఈ పట్టణం గుర్తింపు కోల్పోతుందని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

11/12/2018 - 01:18

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రపంచ శాంతికి భారత్ కట్టుబడి ఉందని నరమేథాన్ని సృష్టించే మానవాళిని సర్వనాశనం చేసే విధ్వంసాలకు దూరంగా శాంతియుత పథంలో ప్రపంచ గమనం సాగాలని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. మొదటి ప్రపంచయుద్ధంలో అశువులు బాసిన భారత జవాన్లకు ఘన నివాళి అర్పించిన ఆయన ‘అత్యంత భయానకమైన రీతిలో లక్షలాది మంది ప్రాణాలు తీసిన మొదటి ప్రపంచ యుద్ధం జరిగి వందేళ్లు పూర్తయ్యింది.

11/12/2018 - 01:14

మధ్యప్రదేశ్‌లో ముస్లింలు 8 నుంచి 9 శాతం వరకు ఉన్నారు. కాని ఈ వర్గానికి ప్రధాన రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఈ రాష్ట్రంలో 230 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ముస్లింల జనాభా 7.8 మిలియన్లు ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు వీలుగా కాంగ్రెస్, బీజేపీలు తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ముస్లింలు కోరుతున్నారు. కాని పట్టించుకునే నాయకులు లేరు.

11/12/2018 - 01:12

న్యూఢిల్లీ, నవంబర్ 11: నిమిషానికో కథనం, రోజుకో సర్వే..ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి ఊహాగానాలు వారివి. ఎవరికివారికి గెలుపుధీమా..ప్రత్యర్థుల్ని చిత్తుచేయగలమన్న నమ్మకం. అంతిమంగా ఓటరు మదిలో ఏముందో ఎవరికీ తెలియదు.

11/11/2018 - 03:30

భోపాల్: మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలకు ఐదేళ్ల పాటు వేతన గ్రాంటును మంజూరు చేస్తామని, గోసంరక్షణకు గోశాలలను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

11/11/2018 - 02:47

కోల్‌కొతా, నవంబర్ 10: కొన్ని పార్టీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, మంచి పనులు చేతకాదని, కాని విమర్శించడంలో ముందుంటాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అధికారంలో ఉన్నా, ఒక్క మంచి పనిని కూడా చేయడం చేతకాని వారికి విమర్శించే హక్కు ఉండదని ఆమె బీజేపీని పరోక్షంగా విమర్శించారు. ఆమె శనివారం ఇక్కడ 24వ కోల్‌కొతా అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాన్ని ప్రారంభించారు.

11/11/2018 - 02:02

రాయ్‌పూర్, నవంబర్ 10: చత్తీస్‌గఢ్‌లో అధికార బీజేపీ శనివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా చత్తీస్‌గఢ్‌ను నక్సల్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని బీజేపీ ప్రకటించింది. చిన్న, మధ్య తరగతి రైతులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెడతామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది.

Pages