S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/12/2018 - 12:22

బెంగళూరు: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గత నెలలో న్యూయార్క్ వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అక్కడ నుంచి వచ్చిన తరువాత బెంగళూరు శ్రీశంకర ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించటంతో సోమవారం వేకువజామున తుది శ్వాస విడిచారు.

11/12/2018 - 03:55

తెలంగాణలో పోటీపై
త్వరలోనే నిర్ణయం: పవన్‌కల్యాణ్
*
డిస్కషన్‌లో ఉన్నదంట
పొలిటికల్ కహానీ!
ప్రీ షెడ్యూల్ చెప్పునంట
త్వరలోనే.. సేనాని!!
*
రాజకీయ స్టంట్‌లకు
కొట్టరెవరు.. క్లాపు
‘ముందస్తు’ల సంగ్రామం
జనసేనకు మేల్కొలుపు!!

11/12/2018 - 03:53

జమ్మూ, నవంబర్ 11: ఉగ్రవాద నిర్మూలనకు భారత్ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పాకిస్తాన్ మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. తన ఉగ్రవాద కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పెట్టడం లేదు. తాజాగా 160 మంది ఉగ్రవాదులు భారత్‌లో చొరబడటానికి ఆధీన రేఖ వద్ద కాచుకుని ఉన్నారని లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జిత్ సింగ్ వెల్లడించారు.

11/12/2018 - 01:57

న్యూడిల్లీ, నవంబర్ 11: రిజర్వ్‌బ్యాంక్ స్వయంప్రతిపత్తి, దాని కార్యక్రమాల్లో కేంద్రం జోక్యంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలు కేవలం విభిన్న వర్గాల అభిప్రాయాలు మాత్రమేనని, ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రయోగంపై మాత్రమే చర్చలు దురదృష్టకరమని ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ వ్యాఖ్యానించారు.

11/12/2018 - 01:47

ఆదివారం ఢిల్లీలోని ఇండియా గేట్‌వద్ద జరిగిన ‘మేరా పీఎం.. మేరా అభిమాన్’
ప్రచార కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తల ఉత్సాహం

11/12/2018 - 01:45

న్యూఢిల్లీ, నవంబర్ 11: అయోధ్యలో రామమందిరం నిర్మించాలని, అప్పుడే ముస్లింలు ఈ దేశంలో ప్రశాంతంగా, గౌరవంగా జీవించగలుగుతారని మైనారిటీల జాతీయ కమిషన్ చీఫ్ ఘాయరుల్ హసన్ రిజ్వి ఆదివారం నాడిక్కడ పేర్కొన్నారు. అలాగే ఈ వివాదానికి త్వరగా పరిష్కారం చూపి అన్నివర్గాల వారిమధ్య సంబంధాలు బలపడేందుకు దోహదం చేయాలని రిజ్వి కోరారు.

11/12/2018 - 01:45

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూటు, బూటు స్నేహితులను రాఫెల్ యుద్ధ విమానంలో ఊరేగిస్తూ యువకుల కలలను మట్టిలో కలిపేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా విమర్శల గుప్పించారు. తనను ప్రధాన మంత్రిని చేస్తే రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానంటూ 2014లో ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చకుండా యువతను మోసం చేశాడు.

11/12/2018 - 01:43

న్యూఢిల్లీ, నవంబర్ 11: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అభియోగాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నేడు సోమవారం కోర్టుకు నివేదిక సమర్పించనుంది. సీబీఐలో ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న తగాదాల నేపథ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు గత నెలలో విచారించింది.

11/12/2018 - 01:42

న్యూఢిల్లీ, నవంబర్ 11: ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళం పూర్తి అప్రమత్తంగా ఉందని, భారత జాతి ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళ అధిపతి మార్షల్ బిఎస్ ధనోవా తెలిపారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడారు.

11/12/2018 - 01:42

ఐటానగర్, నవంబర్ 11: భారత్, చైనా మధ్య ఉన్న విబేధాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే, ఇర దేశాలు సమస్యలను, విబేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం కంటే మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదన్నారు.

Pages