S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/17/2018 - 01:46

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న ‘మీటూ’ సెగలు కాంగ్రెస్ పార్టీని కూడా తాకాయి. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.

10/17/2018 - 01:35

షియోపూర్ (మధ్యప్రదేశ్), అక్టోబర్ 16: మధ్యప్రదేశ్‌లో పోషకాహార లోపంతో చిన్న పిల్లలు చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బాధ్యతను విస్మరించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తనకు తాను మార్కెటింగ్ చేసుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు.

10/17/2018 - 00:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో విఫలమైందని, ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద విడుదల చేసిన రూ.190కోట్లను వాపస్ చేయాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిసింది.

10/17/2018 - 03:00

తిరువనంతపురం, అక్టోబర్ 16:శమరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన చారిత్రక తీర్పును నిరసిస్తూ గత పది రోజులుగా ఉద్యమాలు చెలరేగుతున్న నేపథ్యంలో బుధవారం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. సుప్రీం తీర్పు తర్వాత ఆలయ ద్వారాలు తెరుచుకోవడం ఇదే మొదటిసారి కావడంతో నిరసనల స్థాయి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

10/17/2018 - 00:41

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 108 క్యారెట్ల ఈ అపురూప వజ్రాన్ని 170 సంవత్సరాల క్రితం అప్పటి లాహోర్ మహారాజు ఇంగ్లాండ్ రాణికి ‘‘సరండర్’’ చేశారని భారత పురావస్తు శాఖ వెల్లడించింది. ఈ వజ్రాన్ని బ్రిటిష్ పాలకులకు ఇవ్వలేదని సమాచార హక్కు పిటీషన్‌దారుకు స్పష్టంచేసింది.

10/16/2018 - 17:18

కేరళ: శబరిమల ఆలయంలోకి అన్ని వయసులకు చెందిన మహిళా భక్తులు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అయ్యప్పభక్తులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. బుధవారంనాడు ఆలయం తెరవనుండటంతో మహిళా భక్తులు ఆలయానికి వెళ్లే బస్సులను అడ్డుకున్నారు.

10/16/2018 - 17:17

న్యూఢిల్లీ:బీజేపీ నాయకుడు, జస్వంత్ సింగ్ కుమారుడు మనే్వంద్రసింగ్ రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాజస్థాన్‌లోని షియో నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మనే్వంద్ర సింగ్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ తెలపారు.

10/16/2018 - 17:17

దావణగెరె: రుణం మంజూరు చేయాలంటే తన కోర్కె తీర్చాలని అసభ్యకరంగా మాట్లాడిన బ్యాంక్ మేనేజర్‌ను ఓ మహిళ చితక్కొంట్టింది. కర్ణాటకలోని దావణగెరెలోని ఓ బ్యాంక్‌కు ఈ మహిళ రుణం కావాలంటూ వచ్చాంది. ఆమెతో బ్యాంక్ మేనేజర్ అసభ్యకరంగా మాట్లాడటంతో ఆ మహిళ నడిరోడ్డుపై మేనేజర్‌ను చితకబాదింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

10/16/2018 - 17:16

పాట్నా: బీహార్ జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికల వ్యహాకర్త ప్రశాంతి కిశోర్‌ను నియమిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తెలిపారు. ఇక నుంచి ప్రశాంతి కిశోర్ పార్టీలో రెండవ స్థానంలో ఉంటారని చెప్పకనే చెప్పారు. ప్రశాంతి కిశోర్ నియామకంతో వారసత్వ రాజకీయాలకు నితీశ్‌కుమార్ స్వస్తి పలికారు.

10/16/2018 - 17:14

కేరళ:శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టంచేశారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరిస్తూ..చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు అన్ని విధాల రక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Pages