S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/13/2018 - 01:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 12:పారదర్శకత, భాగస్వామ్య పాలనా వ్యవస్థకు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ)ఓ బలమైన వేదిక వంటిదని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఇక్కడ ఉద్ఘాటించారు. అయితే ప్రజాస్వామ్యంలో మితిమీరిన సమాచారం అంటూ ఏమీ ఉండదని పేర్కొన్న ఆయన ‘సమాచార లోటు కంటే దీని ఓవర్‌లోడే మిన్న’అని వ్యాఖ్యానించారు.

10/13/2018 - 01:03

తిరునల్వేలి, అక్టోబర్ 12: అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపట్టేందుకు వీలుగా కేంద్రం పార్లమెంటులో శాసనాన్ని తీసుకురావాలని విశ్వహిందూపరిషత్ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టులో ఈ నెల 29వ తేదీ నుంచి రోజూవారీ వాదనలు ప్రారంభమవుతున్నాయని, ఆరు నెలల్లో తీర్పు వెలువడుతుందని వీహెచ్‌పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోక్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జనవరి 31 లేదా ఫిబ్రవరి 1 వరకు తాము వేచిచూస్తామన్నారు.

10/13/2018 - 00:57

పాండిచ్చేరి, అక్టోబర్ 12: ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాల్లో కనీస సౌకర్యాలను రోజురోజుకు విస్తృతం చేస్తూ మనదేశం రూపాంతర దశలో ఉందని, ఈ రంగానికి మనం ఇంకా ఎంతో చేయాల్సి ఉందని భారత ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలోని ప్రాథమిక ఆరగ్యో కేంద్రాలు, జిప్‌మెర్, ఎయిమ్స్ లాంటి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు కాని చూసినప్పుడు ఈ రంగానికి ఎంతో చేయాల్సి ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాయన్నారు.

10/13/2018 - 00:56

భువనేశ్వర్, అక్టోబర్ 12: తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రకృతి విపత్తు సహాయ బలగాలను రాష్ట్రప్రభుత్వం రంగంలోకి దింపింది. ఒడిశా రాష్ట్రాన్ని కుదిపేసిన తుపాను వల్ల దాదాపు 60 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దక్షిణ ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగడ జిల్లాల్లో నదులు పొంగి ఫ్రవహించడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.

10/13/2018 - 00:54

తిరుచ్చిరాపల్లి, అక్టోబర్ 12: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. సిబ్బంది, ప్రయాణికులతో కలిపి 136 మందితో దుబాయికి వెళ్లేందుకు విమానం ఎగిరే సందర్భంలో దాని చక్రాలు ఎయిర్‌పోర్టు ప్రహరీగోడను ఢీకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈమేరకు పైలెట్ల నుంచి సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై నితి611 విమానాన్ని ముంబయికి దారిమళ్లించారు.

10/13/2018 - 00:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశంలోని ప్రజలంతా శాఖాహారులుగా మారాలన్నదే మీ ఉద్దేశ్యమా? అని శుక్రవారం సంబంధిత పిటిషనర్‌ను ప్రశ్నించింది. మన దేశంనుంచి మాంసం ఎగుమతిని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ మదన్ బీ లోకుర్, దీపక్‌గుప్తాలతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్య లు చేసింది.

10/12/2018 - 01:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాల పేరుతో ఢిల్లీలో డ్రామాలు ఆడారని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం గడువు దాటిన తర్వాత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేత రాజీనామాలను ఆమోదింపజేయించుకొని, మళ్లీ ఎన్నికల రాకుండా తెలివిగా వ్యవహరించారని ఆరోపించారు.

10/12/2018 - 01:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా జెడ్డా (మక్కా)కు యాత్రికులను పంపించేందుకు కేంద్ర ప్రభుత్వ అంగీకరించింది.

10/12/2018 - 01:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: గత నాలుగేళ్ల కాలంలో ఎదురైన ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ, పరిస్థితులను అవకాశాలుగా మలుచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకేళ్తున్నామని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. గురువారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్

10/12/2018 - 02:33

ముంబయి: మహిళలకు లైంగిక వేధింపులపై న్యాయం కోసం పోరాడే హక్కు ఉంటుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. కేంద్రమంత్రి ఎంజె అక్బర్‌పై వచ్చిన అరోపణలకు సంబంధించి ఆ మంత్రినే స్పందించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. దేశ వ్యాప్తంగా తమపైన గతంలో పెద్ద మనుషుల ముసుగులో అనేక మంది సెలబ్రిటీలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మీటూ పేరిట ప్రచారం సంచలనం సృష్టిస్తోంది.

Pages