S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/15/2018 - 22:58

లక్నో, అక్టోబర్ 15: గుజరాత్ భారతీయులందరిదీ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సోమవారం నాడక్కడ పేర్కొన్నారు. ఆ రాష్ట్రానికి వలస వెళ్లిన హిందీ మాట్లాడే వారిపై దాడులు జరిగిన కొన్ని రోజులకు ముఖ్యమంత్రి స్పందిస్తూ పైవిధంగా అన్నారు. ప్రజలందరి మర్యాద రక్షణకు, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు.

10/15/2018 - 22:54

జైపూర్, అక్టోబర్ 15: గెలిచే వారికే టిక్కెట్లిస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే రైతులు, యువకుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ వెల్లడించారు.

10/15/2018 - 22:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వివిధ రంగాల్లో దేశానికి చేసిన సేవలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ శ్లాఘించారు. కలామ్ 87వ జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన మోదీ అబ్దుల్ కలామ్ అద్భుతమైన స్పూర్తి ప్రధాతగా అభివర్ణించారు. 11వ రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానమన్నారు.

10/15/2018 - 22:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉన్నారా? లేదా? అన్నదానిపై స్పష్టం చేయాలని నేషనల్ ఆర్కివ్స్ ఆఫ్ ఇండియాను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. నేతాజీ బోస్‌కు సంబంధించిన సమాచారం కోరుతూ ఆర్‌టీఐ కార్యకర్త అవ్‌దేశ్ కుమార్ చతుర్వేది సీఐసీని ఆశ్రయించారు.

10/15/2018 - 22:47

చెన్నై, అక్టోబర్ 15: గతంలో లైంగిక వేధింపులకు గురైన మహిళలను ‘మీటూ’ ఉద్యమం పేరుతో బయటకు వస్తున్న నేపథ్యంలో విలక్షణ నటుడు కమల్‌హసన్ తనదైన రీతిలో స్పందించారు. ఈ విషయంలో కేవలం సినిమా రంగానే్న తప్పుపట్టడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు వెలుగుచూసినప్పుడు ఇరువర్గాల వాదనలు వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన లైంగిక వేధింపులన్నది అన్ని రంగాల్లోనూ ఉన్నాయన్న విషయాన్ని మరచిపోకూడదని చెప్పారు.

10/15/2018 - 17:13

న్యూఢిల్లీ:తనపై లైంగిక ఆరోపణలు చేసిన పాత్రికేయురాలు ప్రియారమణిపై మాజీ ఎడిటర్, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. తనపై నిందలు మోపుతున్నారని, తనను అవమానపరిచేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన పాటియాల కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

10/15/2018 - 17:12

కేరళ: శబరిమల ఆలయంలోకి మహిళల వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గత వారం ప్రారంభించిన ర్యాలీ కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంది. ఈ ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెలవారీ పూజల నిమిత్తం బుధవారం ఆలయాన్ని తెరవనున్న నేపథ్యంలో ఈ ఆందోళన మరింత ఉధృతమైంది. మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు.

10/15/2018 - 17:12

దతియా: ప్రధాని నరేంద్ర మోదీ మదిలో పేదలకు, అణగారిన మహిళకు స్థానం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని దతియా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ నీరవ్, అనిల్ వంటివారిని మాత్రమే ఆయన భాయ్ అని సంబోధిస్తారని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన గ్వాలియర్ ప్రాంతంలోని మా పీతాంబర పీఠాన్ని సందర్శించుకున్నారు.

10/15/2018 - 14:04

బెంగళూరు: విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడ్ని ఆరుగురు దుండగులు హతమార్చారు. అగ్రహార్ దసరహల్లీ ఉపనగర్‌లోని హవానూర్ పబ్లిక్ స్కూలులో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు సంబంధించిన భూవివాదాలే కారణమని వెల్లడైంది. అరవై ఏళ్ల ప్రధానోపాధ్యాయుడు రంగనాథ్ ఈ హత్యకు గురయ్యారు.

10/15/2018 - 12:10

ముంబయి : దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఎనిమిది పైసల చొప్పున ధర పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.72 డీజిల్ ధర రూ.75.46గా ఉంది. ముంబయిలో పెట్రోల్ ధర రూ.88.18 డీజిల్ ధర రూ.79.1 గా కొనసాగుతుంది. రూపాయి విలువ పతనం కావడంతో పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

Pages