S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/13/2018 - 13:03

న్యూఢిల్లీ: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్‌తో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. అంతకుముందు ఎంపీ సుజనాచౌదరి నివాసంలో ఎంపీలు భేటీ అయ్యారు. ప్రధానంగా ఐదు డిమాండ్లతో వారు వినతిపత్రం సమర్పించారు.

10/13/2018 - 12:59

ముంబయి: పండిట్ రవిశంకర్ మాజీ భార్య, ప్రఖ్యాత గాయని అన్నపూర్ణదేవి బీచ్‌ఖండ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. 91 సంవత్సరాల అన్నపూర్ణదేవి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. హిందూస్థానీ శాస్ర్తియ సంగీతంలో ప్రవీణురాలైన అన్నపూర్ణను కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సన్మానించింది.

10/13/2018 - 12:58

జమ్మూకాశ్మీర్: పూల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. బాబ్‌గుంద్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

10/13/2018 - 12:56

భువనేశ్వర్: తిత్లీ తుపాను వల్ల కొండ చరియలు విరిగిపడి 12 మంది గిరిజనులు చనిపోయారు. ఒడిసాలోని గజపతి జిల్లా బారాఘారాలో తిత్లీ తుపాను ధాటికి గిరిజనుల గుడిసెలు కొట్టుకుపోయాయి. దీంతో 12 మంది గిరిజనులు పిల్లలతో సహా సమీపంలోని గుహలోనికి వెళ్లి తలదాచుకున్నారు. దురదృష్టవశాత్తు కొండచరియలు విరిగిపడి ఆ గుహ కుప్పకూలటంతో 12మంది చనిపోయారు. గిరిజనుల మృతదేహాలను వెలికితీస్తున్నారు.

10/13/2018 - 11:37

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మూడోవిడతలో భాగంగా పలు నగరాలు, పట్టణాల్లో భారీ సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య పోలింగ్ సాగుతోంది. బారాముల్లాలోని యూరి పోలింగ్ కేంద్రం ముందు ఓటు వేసేందుకు ఓటర్లు ముందుకు వచ్చారు.

10/13/2018 - 05:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు,ప్రజలు కోరితే టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేకర్‌రావుపై పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో గద్దర్ విడివిడిగా శుక్రవారం సమావేశం అయ్యారు.

10/13/2018 - 02:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై ఎనిమిది అబద్ధాలు చెప్పారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి, బీజేపీ కోశాధికారి పీయూష్ గోయల్ శుక్రవారం ఇక్కడి బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ అరోపించారు. రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై చెప్పిన ఎనిమిది అబద్ధాలు ఇవేనటూ ఆయన వరుసక్రమంలో వివరించారు.

10/13/2018 - 05:13

న్యూఢిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ డిపాజిట్ల వ్యవహారంపై వివిధ కోర్టుల్లో నమోదైన క్రిమినల్ కేసుల విచారణపై స్టే కొనసాగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే దీనిపై ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇచ్చింది.

10/13/2018 - 01:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: అక్రమాలు చేస్తున్న కంపెనీలు, సంస్థలపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) తనిఖీలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌పై దాడి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్రీకరిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై నివాసాలపై ఐటీ సోదాలు కేంద్రమే చేయిస్తుందని ఆ పార్టీనేతలు చేస్తున్న ఆరోపణలను జీవీఎల్ కొట్టిపారేశారు.

10/13/2018 - 01:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు సంబంధిచిన కేసులను పరిశీలించి ప్రభుత్వానికి తగు సూచనలూ, సలహాలు ఇచ్చేందుకు సీనియర్ న్యాయమూర్తులు, న్యాయ కోవిదులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ప్రకటించారు.

Pages