S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/10/2018 - 22:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: లక్షలాది మంది దంపతులు ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రసారమైన ‘లిటిల్ థింగ్స్’ ధారావాహిక రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మిథిలాపాల్కర్ తెలిపారు. 2016లో యూ ట్యూబ్‌లో ప్రసారమైన ఈ షోతో రాత్రికి రాత్రే స్టార్‌హోదాను దక్కించుకున్న ఈమె ఇటీవలే ఈ షో రెండో సీజన్ ప్రసారానికి నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదిరిన విషయాన్ని వెల్లడించింది.

10/10/2018 - 16:37

న్యూఢిల్లీ: రాయబరేలి మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, సాధారణంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి యోగీ రెండు లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

10/10/2018 - 16:37

న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది కూడా 78 రోజులకు బోనస్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ లభించనున్నది. దీని కింద ఉద్యోగులు తమ వేతనంతో పాటు అదనంగా 18 వేల రూపాయలు పొందనున్నారు.

10/10/2018 - 16:36

న్యూఢిల్లీ: ప్రఖ్యాత పూరీ ఆలయంలోకి పోలీసులు బూట్లు, ఆయుధాలతో వెళ్లొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇటీవల పూరీ ఆలయంలో జరిగిన ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలపై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ మదన్ బి. లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.

10/10/2018 - 16:35

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారంనాడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రియారమణి అనే జర్నలిస్ట్ చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందించాలని ఆయన ప్రశ్నించారు. మహిళా జర్నలిస్ట్ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని కోరారు.

10/10/2018 - 16:33

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి కోల్‌కతా కోర్టులో ఊరట లభించింది. నవరాత్రి ఉత్సవాలకుగానూ 28వేల దుర్గా పూజా కమిటీలకు రూ.10వేల చొప్పున ఇచ్చే నిధులపై ఉన్న స్టేను కోర్టు ఎత్తివేసింది. దుర్గాపూజ కమిటీలకు నిధులు ఇవ్వటం అనేది శాసన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

10/10/2018 - 13:05

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఏ పద్ధతిలో నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని కోర్టు సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే రాఫెల్ విమానాల ధరలు కానీ, వాటి సాంకేతిక అంశాలు తమకు అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 29వ తేదీలోగా ఆ సమాచారాన్ని ఇవ్వాలని కోర్టు పేర్కొన్నది. రాఫెల్ అంశంపై మళ్లీ అక్టోబర్ 31వ తేదీన సుప్రీం విచారించనున్నది.

10/10/2018 - 12:48

న్యూఢిల్లీ: ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్ గేహ్లాట్ ఇళ్లపై ఐటీ శాఖ దాడులు జరిగాయి. మంత్రి నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ దాడులపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ తమ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

10/10/2018 - 12:46

విశాఖపట్నం: కోస్తా తీరంలో తుపాను ముప్పు ముంచుకువస్తుంది. అలలు ఎగిసిపడుతున్నాయి. వాయుగుండం తితిలీ తుపాను గా మారుతుండటంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఒడిస్సా, చెన్నై, ఏపీ కోస్తా తీరంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

10/10/2018 - 12:42

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి జిల్లా హరిచంద్‌పూర్ సమీపంలోని ఓ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పశ్చిమబెంగాల్ మాల్దా నుంచి ఢిల్లీ వెళుతున్న న్యూఫరక్కా ఎక్స్‌ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇరవై మంది గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Pages