S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తుత్తి విరాళాలు!

విశాఖపట్నం, డిసెంబర్ 9: ఆంధ్రా విశ్వవిద్యాలయం మహామహులు పట్టాలు పుచ్చుకున్నది ఇక్కడే. ఇక్కడ చదివిన ప్రముఖులు దేశ, విదేశాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సహకారం లేక ఆర్థికంగా తవ్ర ఇబ్బందుల్లో ఉన్న విశ్వవిద్యాలయాన్ని ఉద్ధరించాలంటే ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల సహకారం కోరాలని నిర్ణయించారు. విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు కెసి రెడ్డి జయంతిని పురస్కరించుకుని యేటా డిసెంబర్ 10న పూర్వ విద్యార్థుల సమ్మేళనం (అలూమినా) నిర్వహించాలని తీర్మానించారు. దీనిలో భాగంగానే నిరుడు కాస్త ముందుగా నవంబర్ 12న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

విప్లవాత్మక స్టార్టప్..

విప్లవాత్మక స్టార్టప్.. అడాప్ట్ మోటార్స్ శుక్రవారం హైదరాబాద్‌లో రెండు సరికొత్త శ్రేణి త్రీ వీలర్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. స్వీకర్, స్వీకర్ ఎల్ పేరిట ముందుకొచ్చిన వీటిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, పలువురు రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారు. స్వీకర్ ఆటో ప్యాసింజర్ మోడల్ అవగా, స్వీకర్ ఎల్ ఆటో కార్గో మోడల్ అని సంస్థ ప్రతినిధులు వివరించారు. వివిధ సంస్థల నుంచి 500 యూనిట్ల ఆర్డర్లను అందుకున్నట్లు తెలిపారు

ఎస్‌బిఐ లైఫ్‌లో 3.9 శాతం వాటా అమ్మేస్తున్న ఎస్‌బిఐ

ముంబయి, డిసెంబర్ 9: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో తమ 3.9 శాతం వాటాను అమ్మేయనుంది. గ్లోబల్ ఇనె్వస్ట్‌మెంట్ సంస్థలైన కెకెఆర్, టెమసెక్‌లకు 1,794 కోట్ల రూపాయలకు ఈ వాటాను ఎస్‌బిఐ విక్రయిస్తోంది. ఈ విక్రయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆమోదం లభించినట్లు ఎస్‌బిఐ తెలిపింది. ఒక్కో షేర్‌ను 460 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పింది. కాగా, ఎస్‌బిఐ లైఫ్‌లో 74 శాతం వాటా ఎస్‌బిఐకి ఉండగా, మిగతా 26 శాతం వాటా బిఎన్‌పి పరిబాస్ కార్డ్ఫికు ఉంది.

రూటు మార్చిన ప్రతిపక్షం

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రోజూ పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో గొడవ చేసిన ప్రతిపక్షం శుక్రవారం రూటు మార్చింది. గోధుమల దిగుమతిపై సుంకాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా ఎన్‌డిఏ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసిందంటూ ప్రతిపక్షం శుక్రవారం రాజ్యసభను స్తంభింపజేసింది. సిపిఎంతోపాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జెడియు తదితర ప్రతిపక్షాలు గోధుమల దిగుమతిపై సుంకాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించాయి. దేశంలోని గోధుమ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు కురిపించారు. దీనిపై సిపిఎం పక్షనేత సీతారాం ఏచూరి 267 నియమం కింద నోటీసు ఇచ్చారు.

పంజాబ్‌లో ఘెర ప్రమాదం

ఫజిల్కా (పంజాబ్), డిసెంబర్ 9: పంజాబ్‌లో శుక్రవారం దట్టమైన పొగమంచు కారణంగా రెండు వాహనాలు ఢీకొనడంతో 13మంది ఉపాధ్యాయులు సహా 14 మంది దుర్మరణం చెందారు. ఫజిల్కా- జలాలాబాద్ రోడ్‌లో చాంద్‌మేరి టోల్ ప్లాజా సమీపంలో ఉపాధ్యాయులను పాఠశాలకు తీసుకెళ్తున్న వాహనం ఒక ట్రక్కును ఢీకొంది. దట్టమైన పొగమంచు కారణంగా సరిగా కనపడకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయులు వెళ్తున్న వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడి, తరువాత మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మృతి చెందిన ఉపాధ్యాయులలో అయిదుగురు మహిళలు ఉన్నారు. వీరంతా 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు.

తోకముడిచిన ప్రభుత్వం

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు సిద్ధమని చెబుతూ వచ్చిన ప్రభుత్వం శుక్రవారం తోకముడించింది. నిబంధనలతో సంబంధం లేకుండా చర్చకు సిద్ధమని విపక్షం ప్రకటించగా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ 16 రోజులు చర్చ జరగుకండా అడ్డుకున్నందుకు ప్రతిపక్షమే మొదట క్షమాపణలు చెప్పాలంటూ గందరగోళం సృష్టంచి సభ వాయిదా పడేలా చేసింది. లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

త్వరగా చేతులు కలపండి

వాషింగ్టన్, డిసెంబర్ 9: భారత్ బలమైన ఆర్థిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని, అలాంటి దేశంతో వీలయినంత త్వరగా సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోవడం వల్ల ఇరు దేశాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అమెరికాలో ముగ్గు రు రక్షణ నిపుణులు అంటూ, అందువల్ల వీలయినంత త్వరగా భారత్‌తో సంబంధాలను పెంపొందంచుకోవాలని త్వరలో బాద్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సలసా ఇచ్చారు.

ఇప్పుడేమీ చెప్పలేం

బెంగళూరు, డిసెంబర్ 9: తమిళనాడు మాజీ ముఖ్యమత్రి, అన్నా డిఎంకె అధినేత్రి జె.జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నప్పటికీ ఎఐఎడిఎంకెకి, తమ పార్టీకి మధ్య పొత్తు గురించి ఇప్పుడే చర్చించడం ‘చాలా తొందరపాటు’ అవుతుందని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ‘మేడమ్ (జయలలిత) అంత్యక్రియలు ఇప్పుడే పూర్తయినందున ఎఐఎడిఎంకె-బిజెపి మధ్య పొత్తుకు సంబంధించి ఇప్పుడు ఏమి మాట్లాడినా చాలా తొందరపాటే అవుతుంది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పొందిక గానీ, పునఃపొందిక గానీ జరగడంలేదు.

ఎందుకంత గోప్యత?

చెన్నై, డిసెంబర్ 9: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వైద్యచికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంత గోప్యతను ఎందుకు పాటించిందని తమిళ నటి గౌతమి తడిమల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెను చూడటానికి ఎవరినీ ఎందుకు అనుమతించలేదని గౌతమి ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రశ్నించారు. 68 ఏళ్ల జయలలిత గుండెపోటు కారణంగా ఈ నెల 5న ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న జయలలిత సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.

కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతం

శ్రీనగర్, డిసెంబర్ 9: కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమైనారు. 36 గంటలుగా కొనసాగిన ఎన్‌కౌంటర్ శుక్రవారం ముగిసింది. కాగా, గురువారం శాంతిభద్రతల సమస్య సందర్భంగా గురితప్పిన బులెట్ ఒకటి తగిలి పౌరుడొకరు మృతి చెందాడు. ఇంటిలో దాగి ఉండిన ముగ్గురు మిలిటెంట్లను మట్టుబెట్టడం జరిగిందని, ఇద్దరు మిలిటెంట్ల మృతదేహాలను, మూడు ఆయుధాలను స్వాధీనం చేసకున్నట్లు ఆర్మీకి చెందిన నార్తర్న్ కమాండ్ ఒక ట్వీట్‌లో తెలియజేసింది.

Pages