S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరియా అధ్యక్షురాలి అభిశంసన

సియోల్, డిసెంబర్ 9: అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలు పార్క్ గియున్-హై అభిశంసనకు గురయ్యారు. శుక్రవారం ఆమెపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ ఆమోదించింది.

దేశహితం కోసమే పెద్దనోట్ల రద్దు

ఫతేపూర్, డిసెంబర్ 9: పెద్దనోట్ల రద్దు దేశప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు అనుకోని వరమేనని హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 500,1000 నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నవారంతా నల్లకుబేరులేనని శుక్రవారం ఇక్కడ జరిగిన పరివర్తన ర్యాలీలో ధ్వజమెత్తారు. ఇప్పటి వరకూ అవినీతి కార్యకలాపాలతో అక్రమార్జన చేసినవారి ఆటకట్టయిందని అందుకే రోజువారీగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. పెద్దనోట్ల రద్దును అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణిచిన ఆయన ఈ చర్య ద్వారా ప్రధాని మోదీ నల్లధనంపై యుద్ధ్భేరీ మోగించారని తెలిపారు.

అంతా మీ ఇష్టమేనా..?

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రాకేష్ ఆస్థానాను నియమించడంపై సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశాన్ని కుదిపేసిన 2జి స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తులను పర్యవేక్షించిన సీనియర్ అధికారి ఆర్‌కె దత్తాను పక్కనపెట్టి, తమ అనుమతి లేకుండా రాకేష్‌ను ఎలా నియమించారని కేంద్రాన్ని ప్రశ్నించింది.

జాతీయ గీతం తప్పనిసరి..

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే విషయంలో దివ్వాంగులకు కోర్టు మినహాయింపుఇచ్చింది. జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు దివ్యాంగులు లేచి నిలబడాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమిత్వారాయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం దివ్యాంగులు సంజ్ఞల ద్వారా తెలియజేయాల్సి ఉంటుందని బెంచ్ పేర్కొంది. థియేటర్‌లలో జనగణమన గీతం ప్రదర్శనకు సంబంధించి కేంద్రం పదిరోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తుందని అటార్నీ జనరల్ ముకుల్ రొహ్‌త్గి కోర్టుకు తెలిపారు.

అవినీతిపరులను ప్రోత్సహిస్తున్న పాలకులు!

శ్రీకాకుళం, డిసెంబర్ 9: అవినీతి అంటే ఆగ్రహం కట్టలు తెంచుకుని - పాలకులైనా, ప్రభుత్వ అధికారులైనా కడిగిపారేయడం కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహంకు అలవాటే. అదే రీతిలో మరోసారి శుక్రవారం ఎసీబీశాఖ అధ్వర్యంలో ఇక్కడ సూర్యమహాల్ జంక్షన్‌లో ప్రారంభించిన విద్యార్థుల ర్యాలీని ప్రారంభించేందుకు వచ్చిన కలెక్టర్ వందకోట్ల నల్లధనం, 100 కేజీల బంగారంతో ఐటీ అధికారులకు పట్టుబడిన శేఖర్‌రెడ్డి ఉదాంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అతి పవిత్రమైన తిరుమలతిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా ఇంటువంటి నల్లకుబేరులను ఎంపిక చేసి పాలకులు తప్పు చేస్తున్నారని సుతిమెత్తగా తెలుగుదేశం ప్రభుత్వంపై చురకులు వేశారు.

పీకనొక్కేస్తారు... జాగ్రత్త!

శ్రీకాకుళం, డిసెంబర్ 9: బీదోళ్ళ పీకనొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే - వచ్చే ఎన్నికల్లో టిడిపి పాలకుల పీకను బీదలు నొక్కేస్తారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ కలెక్టరేట్ వద్ద జిల్లా వైకాపా ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ప్రజాహక్కు అంటూ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం బీదలకు ఎంతో ప్రయోజనకారైన పథకమన్నారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అధిగమిస్తాం!

శ్రీకాకుళం(రూరల్); డిసెంబర్ 9: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం ఆర్టీసీకాంప్లెక్స్‌ను పరిశీలించారు. అభివృద్ధికి అవకాశం ఉన్న విషయాలపై ప్రాంతీయ మేనేజర్ ఆర్.అప్పన్నను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆర్టీసీ ప్రస్తుత కొంతమేర నష్టాల్లో ఉందని దాన్ని భర్తీ చేసే చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ప్రతీ రోజు 69లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యాలకు చేరుస్తోందన్నారు. అయితే ప్రైవేటు వాహనాలు రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్నాయని వాటి సేవలను కోటి మందికిపైగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

దివ్యదర్శనాన్ని సద్వినియోగం చేసుకోండి

నరసన్నపేట, డిసెంబర్ 9: రాష్ట్ర దేవాదాయ శాఖ నిరుపేద వర్గాలకు ఉచితంగా పుణ్యక్షేత్రాలు దర్శనార్థం దివ్యదర్శనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలి తహశీల్దార్ జె.రామారావు తెలిపారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దివ్యదర్శనానికి సంబంధించి పెట్టెను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ నెల రెండుసార్లు పుణ్యక్షేత్రాల దర్శనానికి ఉచితంగా బస్సు సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వివరించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసి కులాలకు సంబంధించి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా పర్యటన

పాతశ్రీకాకుళం, డిసెంబర్ 9: రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు ఈనెల 10,11వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు.

నగదురహిత లావాదేవీల ప్రచార రథం ప్రారంభం

శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 9: మారుమూల గ్రామాల్లోని నగదురహిత లావాదేవీలపై అవగాహన కలిగించేందుకు ఆర్‌బిఐ స్టేట్‌బ్యాంకు ఏర్పాటు చేసిన సంచార రథాన్ని ఓటర్ల జాబితా పరిశీలకుడు ఐ.శ్రీనివాస శ్రీనరేష్, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎస్ బిఐ రీజనల్ మేనేజర్ డి.మేరీసగాయతోపాటు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రజలకు నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి-2 పి.రజనీకాంతారావు, ఎస్ బి ఐ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Pages