S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెజిబివి టీచర్ల సర్వీసుల క్రమబద్ధీకరణ

హైదరాబాద్, డిసెంబర్ 8: కేంద్రప్రభుత్వ పథకం కింద నడుస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి కోరామని పేర్కొన్నారు. కెజిబివిలకు కేంద్రం ఆరో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకూ మాత్రమే ఆర్థిక సాయం అందిస్తోందని దీనిని 12వ తరగతి వరకూ పెంచాలని కెజిబివిలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని కూడా కోరామని చెప్పారు.

హడలెత్తిస్తున్న వార్ధా తుపాను

మచిలీపట్నం, డిసెంబర్ 8: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిన అధికారులు గురువారం బందరు పోర్టులో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరించారు. అల్పపీడనం రెండు మూడు రోజుల్లో తీవ్ర తుఫాన్‌గా మారి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

12న సాయంత్రం తీరందాటే అవకాశం

విశాఖపట్నం, డిసెంబర్ 8: విశాఖకు 1,028 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉన్న వార్ధా తుపాను ఈ నెల 12న సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం గురువారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో 11 నుంచి కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే పదో తేదీ నుంచి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఈ కేంద్రం పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, 10న మాత్రం చేపల వేటకు వెళ్ళరాద హెచ్చరించింది.

అంతా వాళ్ల మనుషులే

విఆర్‌పురం/కూనవరం/చింతూరు, డిసెంబర్ 8: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టర్లు, సబ్-కాంట్రాక్టర్ల కోసమే నిర్మాణ వ్యయం అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. రూ.16వేల కోట్ల అంచనా వ్యయంగా నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయాన్ని తాజాగా రూ.36వేల కోట్లకు పెంచేశారన్నారు. డీజిల్, పెట్రోలు, ఇసుక, సిమెంటు, స్టీలు ధరలు తగ్గుముఖం పడుతుంటే అంచనా వ్యయం ఎలా పెరుగుతుందని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల బంధువు ఒకరు ఈ ప్రాజెక్టుకు సబ్-కాంట్రాక్టరుగా ఉన్నారని,

బౌద్ధం పరిఢవిల్లిన నేల అనుపు

గుంటూరు, డిసెంబర్ 8..ఒకానొకప్పుడు బౌద్ధం పరిఢవిల్లిన నేలగా ప్రసిద్ధిగాంచి నాటి చారిత్రక కట్టడాలు పునరుజ్జీవం పోసుకుంటున్న నాగార్జునసాగర్‌కు దక్షిణ వైపున ఉన్న గుంటూరు జిల్లా అనుపు గ్రామంలో 16 వందల సంవత్సరాల తరువాత మూడురోజుల పాటు ఉత్సవాల నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు తవ్వకాల్లో అప్పట్లో బౌద్ధమతానికి సంబంధించిన అనేక పురావస్తు ఆనవాళ్లు బయల్పడ్డాయి. ఇక్కడ లభ్యమైన పురాతన వస్తువుల ఆధారంగా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ అనుపు గ్రామంలోని 80 హెక్టార్లలో పునర్నిర్మాణాలు చేపట్టింది.

ప్రతిష్ఠాత్మకంగా ‘స్వాస్థ్య విద్యావాహిని’

గుంటూరు, డిసెంబర్ 8: విద్యార్థి దశ నుండే మెడికోలు గ్రామాల్లో పర్యటించి ప్రజారోగ్యం పట్ల అవగాహన పెంపొందించుకునేందుకు స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తామన్నారు. గురువారం గుంటూరు వైద్యకళాశాల జింఖానా ఆడిటోరియంలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రి కామినేని మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు.

మరో ఐదు జిల్లాల్లో సిపిఒ వ్యవస్థకు శ్రీకారం

చిత్తూరు, డిసెంబర్ 8: రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణను పూర్తిగా అటవీశాఖకే అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు డిజిపి సాంబశివరావు తెలిపారు. గురువారం సాయంత్రం చిత్తూరులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కొంత వరకు తగ్గిందని ఇందుకోసం ప్రత్యేకంగా డిఐజి స్థాయిలో ఒక టాస్క్‌పోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణ, తదితర వ్యవహారాన్ని ఇకపై పూర్తిగా అటవీశాఖకే అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

‘బడి రుణం’ ద్వారా రూ.8.38 కోట్ల విరాళం

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బడి రుణం తీర్చుకుందాం’ ద్వారా విద్యాశాఖకు వివిధ రూపాల్లో రూ.8.38 కోట్లు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం వచ్చాయని సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జి శ్రీనివాసులు చెప్పారు. చిన్నప్పుడు మనం చదువుకున్న బడి అమ్మ ఒడితో సమానమని, నడిచొచ్చిన దారిని మరువకుండా మనకు వీలైనంతలో ఆ బడికేం చేయగలమో అలోచించాలని పిలుపునిచ్చారు. గత నెల 24 నుంచి ప్రారంభమైన ‘బడిరుణం తీర్చుకుందాం’ కార్యక్రమం ముగింపు సందర్భంగా గురువారం విజయవాడలో నిర్వహించిన విద్యార్ధుల భారీ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

పింఛన్ కోసం పండుటాకు బలి

కవిటి, డిసెంబర్ 8: పెన్షన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు తన బ్యాంకు ఖాతాలో పింఛన్ సొమ్ము జమ కాలేదని తెలిసి మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో బొరివంకలో చోటుచేసుకుంది. మండలంలోని పాతవరఖ గ్రామానికి చెందిన బెహరా ఖగా(66) తన పింఛన్ సొమ్మును తీసుకునేందుకు బొరివంకలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుకు గురువారం ఉదయం వచ్చాడు. అతని పింఛన్ సొమ్ము బ్యాంకులో జమైందీ లేనిది చెప్పమని బ్యాంక్ సిబ్బందిని కుటుంబ సభ్యులు అడిగారు. పెన్షన్ పడలేదని చెప్పడంతో వారు బెహరా ఖగాకు చెప్పగా అతను ఒక్కసారిగి షాక్‌కు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆరోగ్యశ్రీపై చర్చకు రండి

గుంటూరు, డిసెంబర్ 8: వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరోగ్యశ్రీపై చర్చకు సిద్ధమని ప్రకటించారని, ఈ విషయంపై బహిరంగ చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, సమయం, తేదీ చెబితే వస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో ముడుపులు రానందునే ప్రభుత్వం ఈ పథకం అమలు పట్ల నిరాసక్తత ప్రదర్శిస్తోందన్నారు.

Pages