S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరాభివృద్ధిపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ప్రశంసలు

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 8: నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన వాషింగ్‌టన్ పర్యటన సందర్భంగా ప్రపంచ బ్యాంకు హెడ్ క్వార్టర్స్‌లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన కమిషనర్ వీరపాండియన్ నగరంలో చేపట్టిన బహిరంగ మల, మూత్ర విసర్జన, నమ్మా టాయ్‌లెట్స్, స్క్రాబ్ పార్క్, ట్రాన్స్‌ఫార్మింగ్ విజయవాడ కాంపెయిన్, హ్యాపీ సండేస్, స్ట్రీట్ ఫర్నీచర్స్, జాతీయ స్థాయిలో అందిన స్కాచ్ అవార్డ్స్- 2016 లతోపాటు నగరంలోని నదీ కాల్వ గట్ల సుందరీకరణ తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసిన వివరించారు.

మావోల నోట్లు మారుస్తూ పట్టుబడ్డ యువకుడు

భద్రాచలం, డిసెంబర్ 8: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు చెందిన పెద్ద నోట్లను మారుస్తూ గురువారం ఓ యువకుడు అరెస్ట్ అయ్యాడు. దంతెవాడ జిల్లా భాంసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు అనుమానాస్పదంగా కన్పించాడు. అతనిని సోదా చేయగా వెయ్యి రూపాయల నోట్లు రూ.1.10 లక్షలు దొరికాయి. మావోయిస్టులకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు కూడా లభ్యమయ్యాయి. వెంటనే అతన్ని విచారించగా మావోయిస్టులు ఈ పెద్దనోట్లను మార్చుకుని రమ్మని ఇచ్చినట్లుగా విచారణలో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్జాతీయ హిందీ సమ్మేళనానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

న్యూఢిల్లీ, డిసెంబరు 8: అంతర్జాతీయ హిందీ సమ్మేళనంలో పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొనున్నారు. న్యూయార్క్ నగరంలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో శుక్రవారం జరుగనున్న ఈ సమ్మేళనంలో హాజరయ్యేందుకు గురువారం నాడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అమెరికాకు పయనమయ్యారు.

యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాల్లో 50 ఏళ్ల జాప్యం నిజమే

న్యూఢిల్లీ, డిసెంబరు 8: యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ 50 ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందని యునెస్కో పేర్కొన్నట్టు కేంద్రమానవ వనరుల సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా వెల్లడించారు.
రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ 50 ఎళ్లు ఆలస్యంగా అందుకుంటుందని యూనెస్కో ఇచ్చిన రిపోర్టు వాస్తవమని వెల్లడించారు. ప్రాథమిక విద్యను 2050కి,సెకండరీ విద్యను 2060నాటికి అప్పర్ సెకండరీ విద్యను 2070 నాటికి భారత్ అందుకుంటుందని యు నెస్కో పేర్కొన్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.

మున్సిపల్ టీచర్లకు సర్వీసు రూల్స్

హైదరాబాద్, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ టీచర్ల సర్వీసు రూల్స్‌ను మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్ళి కరికాల వలవన్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ వెంకటేశ్వరరావు, పి బాబు రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ టీచర్లకు జీవో 320 కార్పొరేషన్ టీచర్లకు 322 జీవోలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీచర్లకు 323 జీవో, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ టీచర్లకు 324 జీవో విడుదల చేసినట్టు వారు వివరించారు.

రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 100 అన్న క్యాంటీన్లు

తిరుపతి, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కడుపు నింపడానికి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 100 అన్న క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభించనున్నారని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి.సప్తగిరి ప్రసాద్ వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో కూడా ఒక అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.1కే ఇడ్లీ, రూ.5కి పెరుగన్నం, రూ.5కి పొంగలి, రూ.5కి ఉప్మా, రూ.5కే పులిహోర, రూ.7.50కు సాంబారు అన్నం ఇస్తారన్నారు. రాత్రి పూట రూ.5కు రెండు చపాతీలు ఇస్తారని వివరించారు.

బ్రాండిక్స్ పార్కుకు ప్రభుత్వ సహకారం

అచ్యుతాపురం, డిసెంబర్ 8: విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ పార్కుకు ప్రభుత్వం తరఫున మరింత సహకారం అందిస్తామని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. గురువారం బ్రాండిక్స్ పార్కును సందర్శించిన ఆయన మాట్లాడుతూ బ్రాండిక్స్ గార్మెంట్లు ప్రపంచ స్థాయిలో గల బ్రాండ్లకు ఎగుమతి చేయడం చాల ఆనందంగా వుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్న కంపెనీ పనితీరును ఆయన మెచ్చుకున్నారు. 15వేల మంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తున్న కంపెనీ పనితీరు బాగుందన్నారు.

మిస్సోరి వర్శిటీలో భారతీయులకు ఆఫర్

హైదరాబాద్, డిసెంబర్ 8: అమెరికాకు చెందిన మిస్సోరి స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ప్రాజెక్టు మేనేజిమెంట్ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. అన్ని విభాగాలకు చెందిన వృత్తి నిపుణులకు వారి అవసరాలను తీర్చే విధంగా ఈ కోర్సు రూపుదిద్దుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్‌లలో ప్రాజెక్టు మేనేజిమెంట్ ప్రొఫెషనల్స్‌ను ఎడ్యుకేట్ చేసేందుకు ఈ ఇంటిగ్రేటెడ్, అప్లయిడ్ ప్రోగ్రాం ఎంతగానో తోడ్పడుతుందని ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ కల్నల్ స్టీఫెన్ హెచ్ రాబినెట్ చెప్పారు.

గ్రూప్-2 దరఖాస్తుల గడువు పొడిగింపు

హైదరాబాద్, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 దరఖాస్తు గడువును డిసెంబర్ 15వ తేదీ వరకూ పొడిగించినట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి వై వి ఎస్ టి సాయి తెలిపారు. గత వారం రోజులుగా సర్వర్లు పనిచేయకపోవడంతో అభ్యర్థుల వినతి మేరకు దరఖాస్తు గడువు పొడిగించినట్టు సాయి చెప్పారు. మరోమారు దరఖాస్తుల గడువు పొడిగింపు ఉండదని అభ్యర్థులు గుర్తించాలని, కనుక చివరి తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలని ఆయన సూచించారు.

‘పోలవరం’ పనులపై విమర్శలు తగదు

పోలవరం, డిసెంబర్ 8: అధునాతన యంత్రాలు, అంతర్జాతీయ ఏజెన్సీలతో పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతుంటే, నత్తనడకన జరుగుతున్నాయని ప్రతిపక్షనేత జగన్ విమర్శించడం తగదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గతంలో జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టు పనులు దళారులకు అప్పగించి దోచుకున్నారన్నారు. పోలవరం పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకోవడానికి గతంలో పనులు చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దుచేయించారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో గురువారం మంత్రి దేవినేని పర్యటించారు.

Pages